Take a fresh look at your lifestyle.

కూలిపోయే దశలో ఉస్మానియా దవాఖానా ..!

వొచ్చేది వానాకాలం…
కూలిపోయే దశలో
ఉస్మానియా దవాఖానా ..!
శిథిలావస్థలో ఇన్‌పేషేంట్‌ ‌వార్డు
బిక్కుబిక్కుమని కాలం గడుపుతున్న రోగులు
న్యూస్‌ ‌మినట్‌ ‌కథనం

ఉస్మానియా దవాఖానా భవనాలు వందేళ్ళ క్రితం నాటివి. వాటికి వెంటనే మరమ్మత్తులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇన్‌ ‌పేషంట్‌ ‌వార్డు శిథిలావస్థలో ఉన్నది. ఆ భవనంలో అన్ని చోట్లా బీటలు వారినయి. ఇటుకలు బయిటికి ఊడి పడుతున్నయి. పై కప్పు ఏ క్షణాన కూలిపోతుందో అన్నట్టున్నది. మూడు అంతస్తుల్లో ఉండాల్సిన రోగులు ఇప్పుడు రెండు అంతస్తుల్లో ఇరుకుగా సర్దుకుని ఉంటున్నరు. ఈ భవనం వందేళ్ళ క్రితం నాటిది. వాస యోగ్యంగా లేదు. వైద్య సంరక్షణ పొందాల్సిన రోగులు ఈ భవనాల్లో బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నారు. ఈ ఆస్పత్రి భవనాలను పునరుద్ధరణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొద్ది నెలల క్రితం ఆ భవనం రెండో అంతస్తులో పై కప్పు కూలిపోయిన తర్వాత మూసి వేశారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడక పోవడం, ఎవరికీ హాని జరగక పోవడం అదృష్టం. వర్షా కాలం వస్తోంది. మళ్ళీ భారీ వర్షాలకు ఈ భవనాలు నానిపోతయి. పరిస్థితి ఎలా ఉంటదోనన్న ఆందోళన వైద్య రంగంలో ప్రతి ఒక్కరినీ వణికిస్తున్నది. ఏటా వర్షాకాలంలో ఈ భవనాల్లో చాలా చోట్ల నీరు లీక్‌ ‌కావడం సర్వసాధారణం అయింది. వర్షాకాలం వస్తోందంటే రోగుల పరిస్థితి ఎలా ఉంటుందా అన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. ఏటా భారీ వర్షాలు జంటనగరాల్లో పలు ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి.

ఈ భవనం ఇప్పటికే బీటలు వారి శిథిలావస్థలో ఉన్నది. భారీ వర్షాలకు తట్టుకోలేదు. భారీ వర్షం వస్తే అన్ని అంతస్తుల్లో నీరు లీక్‌ ‌కావడం సహజ పరిణామం అయిందని జూనియర్‌ ‌డాక్టర్‌ ఒకరు అన్నరు. ఇప్పటికే ఎంతో నష్టం జరిగిందనీ, గోడలమీద రంగులు వెలిసిపోతున్నయనీ, రోగులకు ఆరోగ్య కరమైన వాతావరణం ఈ దవాఖానాలో లేదని ఆయన అన్నరు. ఈ ఆస్పత్రి భవనాల విషయంలో ఏదో చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ ఇంతవరకూ ఏమీ చేయలేదని డాక్టర్‌ ‌పిఎస్‌ ‌విజయేందర్‌ అన్నరు. ఆయన తెలంగాణ జూనియర్‌ ‌డాక్టర్ల సంఘం అధ్యక్షుడు. ఈ ఆస్పత్రి భవనాల మరమ్మతులు జరిగే వరకూ రోగుల పరిస్థితి దినదిన గండంగా ఉంటుందని అన్నరు. ఉస్మానియా ఆస్పత్రి దేశంలోనే అతి పురాతన దవాఖనాల్లో వొకటి. ఏడవ నిజాం మీర్‌ ఉస్మాన్‌ ఆలీ ఖాన్‌ ‌హయాంలో దీనిని నిర్మించారు. రాష్ట్ర ప్రభుత్వాల ఉదాసీనం వల్ల ఈ భవనాలు శిధిలావస్థకు చేరుకున్నయి. 2015లో ఆందోళనల నేపథ్యంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆస్పత్రి భవనాలను పరిశీలించారు. ఆ భవనాల స్థానే కొత్త భవనాలను నిర్మించాల్సి ఉందని అన్నరు. అయితే అవి చారిత్రక మైనవనీ, వాటిని పడగొట్టడానికి వీలు లేదని చరిత్రకారులు, హక్కుల ఉద్యమ కారులు ఆందోళన చేశారు. దాంతో ఆ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. రోగులను ఆ భవనాల నుంచి ఖాళీ చేయించి ఆ భవనాల చారిత్రక సంపదను యథాతథంగా కొనసాగించాలన్న నిర్ణయం కూడా జరిగింది. అయితే, ఈ పథకాలు, ప్రణాళికలు కాగితాలపైనే ఉన్నయి.
దవాఖానా సూపరింటెండెంట్‌ ‌డాక్టర్‌ ‌నాగేందర్‌ ‌టిఎన్‌ఎం‌తో మాట్లాడుతూ..బాగా శిథిలావస్థకు చేరిన బ్లాక్‌ ‌స్థానే కొత్త భవనాలను నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోందని చెప్పారు. అయితే, ఎన్నికల కారణంగా అది సాకారం కాలేదని అన్నరు. కింద భాగం, మొదటి అంతస్తు సురక్షితంగా ఉన్నాయని రోగులు పేర్కొంటున్నరు. గత డిసెంబర్‌లో ఆపరేషన్‌ ‌థియేటర్లను మూసివేసిండ్రు. రెండు ఆపరేషన్‌ ‌టేబుల్స్ ‌పడిపోవడానికి సిద్ధంగా ఉండటంతో మూసివేసిండ్రు. అయితే, దవాఖానాలో మూడు ఆపరేషన్‌ ‌థియేటర్లు ఇప్పుడు పూర్తి స్థాయిలో పని చేస్తున్నయని సూపరింటెండెంట్‌ ‌చెప్పారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!