Take a fresh look at your lifestyle.

కుల్‌భూషణ్‌ ‌మరణశిక్ష నిలిపివేత

కేసు పునః సక్షించాలని పాక్‌కు అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశం
అంతర్జాతీయంగా భారత్‌కు పెద్ద విజయం: కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌అం‌తర్జాతీయ న్యాయస్థానంలో భారత్‌ ‌విజయం సాధించింది. నౌకాదళ విశ్రాంత అధికారి కుల్‌భూషణ్‌ ‌జాదవ్‌ ‌కేసులో భారత్‌కు భారీ విజయం లభించింది. కుల్‌భూషణ్‌ ‌జాదవ్‌ ‌కేసులో భారత్‌కు అనుకూలంగా ఐసీజే తీర్పు ఇచ్చింది. జాదవ్‌ ‌కేసును పునః సక్షించాలని పాక్‌ ‌ప్రభుత్వాన్ని ఆదేశించింది. భారత రాయబార కార్యాలయ అధికారులను కలుసుకునేందుకు.. జాదవ్‌కు అవకాశం ఇవ్వాలని తీర్పులో పేర్కొంది. 2016లో గూఢచర్య ఆరోపణలపై కుల్‌భూషణ్‌ను పాక్‌ అరెస్ట్ ‌చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో 2017 ఏప్రిల్‌లో కుల్‌భూషణ్‌కు పాక్‌ ‌సైనిక కోర్టు మరణశిక్ష విధించింది.
దీంతో భారత ప్రభుత్వం అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ కేసులో భారత్‌కు అనుకూలంగా 15 మంది జడ్జీల తీర్పు ఇవ్వగా.. ప్రతికూలంగా ఒక జడ్జి తీర్పు ఇచ్చారు. కుల్‌భూషణ్‌కు పాకిస్థాన్‌ ‌విధించిన ఉరిశిక్షను నిలిపిస్తూ అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) తీర్పు వెలువరించింది. ఈ వ్యవహారంలో పాకిస్థాన్‌ ‌పున:సక్షించే వరకు మరణశిక్షణను నిలిపివేస్తున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది. భారత్‌కు న్యాయవాదిని నియమించుకునే హక్కు ఉందని అంతర్జాతీయ న్యాయస్థానం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. 2016లో పాకిస్థాన్‌ ‌భద్రతా దళాలకు చిక్కిన 49 ఏళ్ల కుల్‌భూషణ్‌… ‌గూఢచౌర్యానికి, ఉగ్రవాదానికి పాల్పడ్డారంటూ ఆ దేశ సైనిక న్యాయస్థానం 2017 ఏప్రిల్‌లో మరణశిక్ష విధించింది. దీనిపై భారత్‌ ‌తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ అదే ఏడాది మే 8న ఐసీజేను ఆశ్రయించింది. ఆయన ఇరాన్‌లో వ్యాపారం చేసుకుంటుండగా అక్రమంగా నిర్బంధించారని పేర్కొంది. న్యాయమూర్తి అబ్దుల్‌ఖవి అహ్మద్‌ ‌యూసుఫ్‌ ‌నేతృత్వంలోని పది మంది సభ్యుల ధర్మాసనం… తాము తుది తీర్పు ఇచ్చేవరకూ మరణశిక్ష అమలును నిలిపివేయాలని పాకిస్థాన్‌ను ఆదేశించింది. ఈ వ్యవహారంపై గత ఫిబ్రవరిలో విచారణ చేపట్టి, ఉభయ దేశాల వాదనలను వింది. తాజాగా మళ్లీ విచారణ చేపట్టిన అంతర్జాతీయ న్యాయస్థానం కుల్‌భూషణ్‌ ‌మరణశిక్షను నిలిపివేస్తూ తీర్పు వెలువరించింది.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!