Take a fresh look at your lifestyle.

కుల్‌భూషణ్‌ను కలిసేందుకు దౌత్యాధికారులకు అనుమతి

అంగీకరించిన పాక్‌ అధికారులుభారత నౌకాదళ విశ్రాంత అధికారి కుల్‌భూషణ్‌ ‌విషయంలో పాక్‌ ‌మరోసారి వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఐసీజే ఆదేశాల మేరకు కుల్‌భూషణ్‌ను కలిసేందుకు భారత దౌత్యాధికారులకు అనుమతులు ఇస్తామని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రకటించింది. పాక్‌ ‌చట్టాలకు లోబడి అందుకు సంబంధించిన అన్ని విధివిధానాలను సిద్ధం చేస్తున్నామన్నారు. వియన్నా ఒప్పందం ప్రకారం లభించే అన్ని హక్కులను ఇప్పటికే జాదవ్‌కు వివరించామని ప్రకటనలో పేర్కొన్నారు. అతనికి న్యాయ సాయం అందకుండా పాక్‌ ‌తీవ్ర తప్పిదం చేసిందన్న అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) మొట్టికాయల నేపథ్యంలో ఆ దేశం కళ్లు తెరిచింది. పాకిస్థాన్‌ ‌సైనిక న్యాయస్థానం కుల్‌భూషణ్‌కు విధించిన మరణశిక్షను నిలిపివేస్తూ ఐసీజే బుధవారం తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. మరణ దండన విధిస్తూ ఇచ్చిన తీర్పును పునః సక్షించాలనీ, అప్పటివరకూ శిక్ష అమలును నిలిపివేయాలని ఆదేశించింది. జాదవ్‌ ‌వ్యవహారంలో పాక్‌ అనుసరించిన తీరును ఐసీజే తీవ్రంగా ఆక్షేపించింది. న్యాయవాదిని నియమించుకునే హక్కు భారత్‌కు ఉందని తేల్చి చెప్పింది. కుల్‌భూషణ్‌ ‌జాదవ్‌(49) ‌తమ భూభాగంలోకి అక్రమంగా చొరబడ్డారంటూ పాకిస్థాన్‌ ‌సైనికులు 2016లో ఆయనను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన అక్కడి సైనిక న్యాయస్థానం 2017 ఏప్రిల్‌లో ఆయనకు మరణశిక్ష విధించింది. జాదవ్‌ ‌గూఢచౌర్యానికి, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ పేర్కొంది. అయితే ఈ వాదనలను భారత్‌ ‌ఖండించింది. భూషణ్‌ అసలు పాకిస్థాన్‌ ‌వెళ్లనే లేదని, ఉద్యోగ విరమణ తర్వాత ఇరాన్‌లో వ్యాపారం చేసుకుంటుండగా అపహరణకు గురయ్యారని పేర్కొంది. ఈ విషయంపై 2016, మే 8న భారత్‌ అం‌తర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అయితే ఏ మేరకు భారత్‌కు పాక్‌ ‌సహకరిస్తుందన్నది విదేశాంగ శాఖ ఎదురు చూస్తుంది.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy