Take a fresh look at your lifestyle.

కీలుబొమ్మ ప్రభుత్వమే..చంద్రబాబు లక్ష్యం

కాంగ్రెస్‌ ‌నేతల అసమర్ధతను వాడుకోవాలని చూస్తుండు

గజ్వేల ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌

కాంగ్రెస్‌ ‌పార్టీల నేతల అసమర్ధతను అడ్డుపెట్టుకొని మరోసారి చంద్రబాబు నాయుడు తెలంగాణలో పెత్తనం చేయాలని చూస్తున్నాడని, తద్వారా మన నీటి వాటాలను తన్నుకొని పోయేందుకు కుట్రలు చేస్తున్నాడని, ప్రజలు చూస్తూ ఊరుకోవద్దని.. ఓటుతో కూటమికి బుద్ది చెప్పి చంద్రబాబును తరిమికొట్టాలని ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ ‌పిలుపునిచ్చారు. బుధవారం గజ్వేల్‌ ‌నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ ‌ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ ‌ప్రసంటించారు. కోదాడ సభలో చంద్రబాబు ఏం మాట్లాడాడో అందరం చూశామని.. కృష్ణానదిలో నీళ్లు లేవు, గోదావరి నీళ్లు పంచుకుందామని అంటున్నాడని కేసీఆర్‌ ‌మండిపడ్డారు. చంద్రబాబు, రాహుల్‌.. ‌పక్కన మన కాంగ్రెస్‌ ‌దద్దమ్మలు, మొద్దన్నలు కూర్చున్నారన్నారు. కృష్ణానదిలో నీళ్లు లేవు, గోదావరి నీళ్లు పంచుకుందామని తెలంగాణ కాంగ్రెస్‌ ‌సన్నాసులను కూర్చోబెట్టి.. వాళ్ల అధినేత రాహుల్‌ ‌గాంధీకి ఉన్న సభలో చంద్రబాబునాయుడు అంటున్నాడని అన్నారు

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!