Take a fresh look at your lifestyle.

కిడ్నాప్‌ అయిన టీఆర్‌ఎస్‌ ‌నాయకుడు హతం..!

మూడు రోజులుగా మావోయిస్టుల చెరలో మాజీ ఎంపీటీసీ
పోలీస్‌ ఇన్‌ఫార్మర్‌ అని లేఖలో పేర్కొన్న మావోయిస్టులుభద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లమండలంలోని పెదమిడిసిలేరు ఉంటున్న టిఆర్‌ఎస్‌ ‌మాజీ యంపిటీసి నల్లూరి శ్రీనివాస్‌ను మావోయిస్టులు శుక్రవారం నాడు దారుణంగా హత్యచేసారు. పూర్తి వివరాల్లోకి వెళితే గత 8వతేదీ రాత్రి 10-30 గంటల సమయంలో మావోయిస్టులు శ్రీనివాస్‌ను కిడ్నాప్‌ ‌చేసారు. అప్పటి నుండి జిల్లా వ్యాప్తంగా ఈ సంఘటన తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. కిడ్నాపుకు గురైన శ్రీనివాస్‌ ఆచూకి ఎంతకీ తెలవకపొవడంతో అతని కుటుంబసభ్యుల్లో తీవ్రభయాందోళన మొదలయ్యింది. పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మావోయిస్టుల చెరనుండి విడుదల అయివస్తాడని ఎదురు చూసిన శ్రీనివాసరావు శుక్రవారం తెలంగాణకు సరిహద్దున ఉన్న ఛత్తీస్‌ఘడ్‌ ‌రాష్ట్రంలోని సుకుమా జిల్లాలోని ఎర్రపాడు, పొట్టపాడు గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో శ్రీనివాస్‌ను హత్యచేసి మృతదేహాన్ని అక్కడ వదిలి వెళ్ళిపోయారు. అంతేకాకుండా మావోయిస్టులు మృతదేహం వద్ద లేఖను కూడా వదిలివెళ్లారు. గురువారం శ్రీనివాస్‌ ‌కుటుంబ సభ్యులతో మాట్లాడించినట్లు సమాచారం. శుక్రవారం నాడు హత్యచేసారు. మావోయిస్టు పార్టీకి సంబంధించిన వివరాలు పోలీసులకు చేరవేస్తున్నాడని నెపంతోనే హత్యచేసినట్లు మావోయిస్టులు వెల్లడించారు.
ఇన్‌ఫార్మర్‌ అయినందుకే హత్యచేసాం : మావోయిస్టుల లేఖలో వెల్లడి
ఇంటెలిజెన్స్ ‌పోలీసులతో కలిసి మావోయిస్టుపార్టీని నిర్మూలించడానికి ఆదివాసీ గ్రామాలలో ఇన్‌ఫార్మర్‌గా తయారుచేస్తున్నారని చర్ల ఏరియా కమిటి కార్యదర్శి శారద లేఖలో తెలిపారు. దళాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పోలీసులకు సమాచారం చేరవేయడం, ప్రజాసంఘాల వాళ్ళను అరెస్ట్‌లు చేయడం లాటివి చేస్తుంన్నందున హతమార్చినట్లు లేఖలో వెల్లడించారు. ఆదివాసీలకు సంబంధించిన 70 ఎకరాల భూములను పోలీసుల ప్రోద్భలంతో అక్రమంగా గుంజుకుంటున్నాడని లేఖలో తెలిపారు. ప్రశ్నించినవారిని అరెస్ట్‌లు చేయిస్తున్నారని లేఖలో తెలిపారు. ఎస్‌ఐబితో కలిసి ఆదివాసీ ప్రజాసంఘాల పేరుతో సిపిఐ మావోయిస్టులపార్టీపై దుష్‌‌ప్రచారం చేస్తున్నాడని అందువలనే హత్యచేసినట్లు లేఖలో తెలిపారు.
రైతును చంపడం హేయమైన చర్య : ఎస్పీ సునీల్‌దత్‌
‌మూడురోజులక్రితం చర్లమండలం కొతూరు గ్రామానికి చెందిన నల్లూరి శ్రీనివాస్‌అనే వ్యక్తిని మావోయిస్టులు కిడ్నాప్‌ ‌చేసి శుక్రవారం దారుణంగా కొట్టి హతమార్చడం హేయమైన చర్య అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్‌దత్‌ అన్నారు. నల్లూరి శ్రీనివాస్‌ ‌పోలీస్‌ ఇన్‌ఫార్మర్‌ ‌కాదని పోలీసులతో అతనికి ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. శ్రీనివాస్‌ ‌తన ప్రాంతంలో వ్యవసాయం చేస్తూ చుట్టు పక్కల రైతులకు సహయం చేస్తూ మంచిపేరు సంపాదించుకున్న రైతని తెలిపారు. ఒక మంచి రైతును దారుణంగా కొట్టి హతమార్చడాన్ని తీవ్రంగా ఖండించారు. మావోయిస్టులు తమ మనుగడకోసం చర్ల ఏరియాకు సంబంధించిన రైతులను, వ్యాపారస్తులను డబ్బులకోసం వేధిస్తూ రైతులకు అండగా నిలిచే ఇలాంటివ్యక్తులను టార్గెట్‌చేసి వారిని చంపుతూ ప్రజలలో భయాందోళనను సృష్టిస్తున్నారని అన్నారు. ఇకపై సంఘ విద్రోహచర్యలకు పాల్పడే మావోయిస్టులపై త్వరలోనే చర్యలు తీసుకుంటామని ఎస్పీ సునీల్‌దత్‌ ‌తెలిపారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!