వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

కాశ్మీర్‌ ‌లోయలో మళ్లీ ఆంక్షలు

August 30, 2019

ప్రజా రవాణా, మార్కెట్లు మూత – భద్రత కట్టుదిట్టం చేసిన పోలీసులుశ్రీనగర్‌, ఆగస్ట్30 (ఆర్‌ఎన్‌ఏ)‌జమ్మూ కశ్మీర్‌లో మళ్లీ ఆంక్షలు విధించారు. శుక్రవారం ప్రార్థనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. కశ్మీర్‌లో యలోని పలు ప్రాంతాల్లో 144 సెక్షన్‌ ‌విధించారు. గత 26 రోజులుగా కశ్మీర్‌లో పరిస్థితి ఇలాగే ఉంది. ప్రజా రవాణా, మార్కెట్లు మూత పడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో ఫోన్‌ ‌సర్వీసులపై ఆంక్షలు సడలించినప్పటికీ..మరికొన్ని ప్రాంతాల్లో కొనసాగుతూ ఉన్నాయి. ఆర్టికల్‌ 370 ‌రద్దు నేపథ్యంలో ముందస్తు భద్రతా చర్యల నేపథ్యంలో ఆగస్టు 5 నుంచి కశ్మీర్‌లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. భారత్‌లోకి పాక్‌ ‌కమాండోలు ప్రవేశించారన్న వార్తల నేపథ్యంలో మరింత కట్టుదిట్టం చేశారు. భారత ఆర్మీ చీఫ్‌ ‌జనరల్‌ ‌బిపిన్‌ ‌రావత్‌ ఈరోజు శ్రీనగర్‌లో పర్యటిం చనున్నారు. ఆర్టికల్‌ 370 ‌రద్దు తర్వాత ఆయన కశ్మీర్‌కు వెళ్లడం ఇదే తొలిసారి. ఇందులో భాగంగా కశ్మీర్‌లో భద్రతా తీరును ఆయన పర్యవేక్షించ నున్నారు. మరోవైపు జమ్మూ కశ్మీర్‌పై పాక్‌ ‌కయ్యానికి కాలు దువ్వుతోంది. అంతర్జాతీయంగా భంగపడ్డ పాకిస్థాన్‌- ‌ప్రాంతీయంగా చిచ్చు కొనసాగించే ప్రయత్నాలు చేస్తోంది. దీంతో నియంత్రణ రేఖ వద్ద రేయింబవళ్లూ భారత సైన్యం అప్రమత్తంగా ఉంది. వేయికళ్లతో పాక్‌ ‌భూభాగం నుంచి కదలికలను పరిశీలిస్తోంది. పాక్‌ ‌నుంచి సముద్ర మార్గంలో ఉగ్రవాదులు చొరబడినట్లు అనుమానిస్తోంది. దీంతో అప్రమత్తమై గుజరాత్‌లోని కచ్‌ ‌ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. భారీ విధ్వంసం, ప్రాణనష్టం లక్ష్యాలుగా పాక్‌ ‌నుంచి సుశిక్షితులైన టెర్రరిస్టులు గుజరాత్‌ ‌తీరానికి చేరినట్లు 27నే నిఘావర్గాలు హెచ్చరించాయి. దీంతో కాండ్లా, ముంద్రా నౌకాశ్రయాల్లో భద్రతను రెట్టింపు చేశారు. కచ్‌ ‌జిల్లాలోని జామ్‌నగర్‌, ‌వాదినర్‌ ఆయిల్‌ ‌రిఫైనైరీల వద్ద హైఅలర్ట్ ‌ప్రకటించారు. మరోవైపు పీవోకే కూడా భారత్‌లో అంతర్భాగమేనని స్పష్టం చేశారు. ఏదో ఒక రోజు పీవోకే, గిల్గిత్‌-‌బాల్టిస్థాన్‌లు కూడా భారత్‌లో కలిసిపోతాయని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్‌ ‌జమ్మూకశ్మీరు విద్యార్థులతో నిర్వహించిన సమావేశంలో వ్యాఖ్యానించారు. జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలు 2021లో నిర్వహించే అవకాశాలున్నాయని ఎన్నికల కమిషన్‌ ‌వర్గాలు తెలిపాయి. కొత్తగా ఏర్పడిన కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన పక్రియ అక్టోబరు 31 తర్వాత మొదలవుతుందని, పూర్తి కావడానికి 10 నుంచి 15 నెలలు పడుతుందని ఆ వర్గాలు వివరించాయి.