వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

కాశ్మీర్‌పై ఐదు అపోహలు.. తొలగించాలి

August 26, 2019

కాశ్మీరీలు పెట్టుబడులనూ, అభివృద్దిని కోరుతున్నారు. ఇది తెలుసుకోవాలంటే దురంహాకార ధోరణిని పక్కన పెట్టాలి. ప్రజల్లో ఆగ్రహాన్ని తొలగించనిదే కేంద్రం ఎన్ని వేల కోట్లు గుమ్మరించినా కాశ్మీర్‌లో మార్పు రాదు. సాయుధ దళాలతో కాకుండా ప్రేమపూర్వకంగా కాశ్మీరీల మనసులను గెలవాలి. పొగరును ప్రదర్శిస్తే ఫలితం ఉండదు. అంతేకాక, కాశ్మీరీలు మొదటి నుంచి భారత్‌ ‌లో కొనసాగాలనే కోరుకుంటున్నారు.మితవాద, జాతీయవాదులు కాశ్మీర్‌కి సంబంధించి వాస్తవాలను, సహేతుకతనూ అర్థం చేసుకోవడంలో విఫలమవుతున్నారు. కాశ్మీరీల మనసును గెల్చుకోవడానికి భిన్నత్వం ఒక్కటే మార్గం. గత వారం కఠోరమైన వాస్తవానికి జాతీయ ప్రయోజనాన్ని జోడించారు. కాశ్మీర్‌పై ఐదు అపోహలను వాస్తవ దృష్టితో పరిశీలిస్తే తార్కికంగా అనుసరిస్తే మనం కూడా చాలా మంది మితవాదుల నమ్మకాలనే కలిగి ఉన్నారు. ఇది పెద్ద వర్గం. ఈ వర్గం నరేంద్రమోడీ నేతృత్వంలోని బీజేపీ వోటర్ల బృందం. వారిలో ఆర్టికల్‌ 370 ‌కాశ్మీరీ నాయకుల ద్రోహమే అసలు సమస్య అని, యావత్‌ ‌భారత జాతి అంతా కలిసి చేసిన అన్యాయం కన్నా ఎక్కువ అని వారి భావన. మితవాద జాతీయవాదులు వాస్తవాలను తెలుసుకోకపోవడం వల్లనే అలాంటి అభిప్రాయాలను కలిగి ఉంటున్నారు. పురాణాలు కాదు, మితవాద, జాతీయవాద లేదా మధ్యస్థ వాదులు కాదు. కాశ్మీర్‌ ‌గురించిన వాస్తవాలపై మనం దృష్టిని కేంద్రీకరించాలి నమ్మకాలు ప్రియంగానే ఉంటాయి, కానీ, ప్రమాదకరమైనవి. అందువల్ల నేను కాశ్మీర్‌పై మితవాద, జాతీయవాదుల అపోహలు ఐదింటిని మీ ముందు ఉంచుతున్నాను.
మొదటిది…. కేంద్ర బిందువు వంటిది ఆర్టికల్‌ 370. ‌కాశ్మీర్‌కి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించేందుకు రాజ్యాంగంలో చేర్చిన అధికరణం ఇది. సమస్యకు మూలకారణం. అది ఇప్పుడు తొలగి పోయింది. అలాగే, సమస్య కూడా…చరిత్ర సృష్టించాం. ఇప్పుడు కొత్త వెలుగులోకి ప్రవేశించాం. చరిత్ర సృష్టించడం అంటే చరిత్రను చెరిపేయడం కాదు. ఆర్టికల్‌ 370 ‌భావోద్వేగానికి సంబంధించిన అంశం. జాతీయ ఏకాభిప్రాయానికి సంబంధించిన అంశం. 69 ఏళ్ల క్రితం అది రాజ్యాంగంలో చేరింది. అప్పట్లో దానిని తాత్కాలికంగా చేర్చిన మాట నిజమే. ప్రత్యేకంగా చేర్చిన మాటా నిజమే. ఇది ఇప్పుడు లేదు. అది ఇప్పుడు కాంతిని కోల్పోయింది. దాని మూలం ఎప్పుడో చెదిరి పోయింది. వీపీ సింగ్‌ ‌మినహా ప్రధానమంత్రులంతా 370వ అధికరణాన్ని నిర్వీర్యం చేయడానికి చేయగలిగిందంతా చేశారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ దానిని రద్దు చేయడానికి ముందే అది నిర్వీర్యం అయిపోయింది. ఆయన రద్దు చేయడం అనేది ఒక లాంఛనమే. రక్షణ, ఆర్థిక, కమ్యూనికేషన్లు, విదేశాంగ విధానపరమైన అంశాలు తప్ప మొత్తం 395లో 290 అంశాలు నేరుగా కాశ్మీర్‌కూ వర్తిస్తాయి. చికాకు పర్చే అంశాలు కొన్ని ఉన్నాయి. తరచుగా ప్రస్తావించే అటువంటి అంశాల్లో కాశ్మీర్‌లో ఉపాధి హక్కు, ఆస్తి హక్కు ముఖ్యమైనవి. మిగిలినవి ఉదారమై అంశాలకు సంబంధించినవి. కాశ్మీరేతర వ్యక్తిని పెళ్ళి చేసుకున్నందుకు కాశ్మీరీ మహిళకు ఆస్తి హక్కు, వారసత్వపు హక్కు , అటువంటి పెళ్ళిళ్ళు చేసుకున్న వారికి పుట్టిన వారిని కాశ్మీరీలుగా గుర్తించకపోవడం, మమ్మారు తలాక్‌పై సుప్రీంకోర్టు ఉత్తర్వును వర్తింపజేయకపోవడం. భారత శిక్షాస్మృతిలోని 377వ అధికరణం మొదలైనవి ఉన్నాయి. కాశ్మీరీలు దూరం కావడానికి అవన్నీ మూల కారణాలని అనడం అపోహే. ఈ అపోహల్లో ముఖ్యమైనది పాకిస్తాన్‌ ‌ప్రభావానికి లోనవతున్నారడం. ఆక్రమణ దారులను ఖాళీ చేయించాల్సిందేనన్నది కవ్వించే చర్యే.
మితవాద, జాతీయ వాదులు 1948 తర్వాత భారత సైనికులు గిల్జిత్‌, ‌బాల్టిస్తాన్‌ ‌సహా కాశ్మీర్‌ను పాక్‌ ‌నుంచి భారత సైన్యం స్వాధీనం చేసుకునేందుకు సిద్ధంగా ఉందని. అయితే నేహ్రూ ఈ అంశాన్ని ఐక్యరాజ్య సమితి వద్దకు తీసుకుని వెళ్ళడం వల్ల ఆక్రమిత కాశ్మీర్‌ని కోల్పోయామని మితవాద జాతీయవాదుల భావన. సర్దార్‌ ‌పటేల్‌కి ఈ విషయాన్ని వదిలి పెట్టి ఉంటే ఆక్రమిత ప్రాంతం కూడా మనకు దక్కేదన్న భావన కూడా వారిలో ఉంది. కానీ, వాస్తవం వేరు. 1947-48 మధ్య రెండు దేశాల సైన్యాలు ప్రతిష్టంభనలో పడ్డాయి. రెండు దేశాలకు చెందిన సైనిక చరిత్రనంతా అధ్యయనం చేస్తే వాస్తవం తెలుస్తుంది. భౌగోళిక, స్థల అమరిక, రవాణా సదుపాయాలు వంటి కారణాల వల్ల రెండు సైన్యాలూ కూడా ముందడుగు వేయలేకపోయాయి.
భారత్‌ ‌యూరీ వంతెన మీదుగా ముజఫరాబాద్‌లోకి దూసుకుని వెళ్ళే అవకాశం ఉంది అది కూడా అవసరమైన దళాలను తీసుకుని వెళ్ళేందుకు వీలుగా లేదు. బానిహాల్‌ ‌పాస్‌ ‌మంచుతో కప్పబడి ఉంది. ఇటు మన వారూ, అటు పాకిస్తానీయులు 1948లో చొరవ చూపి ఉంటే విజయం సాధించి ఉండేవారమన్నది కల్పన మాత్రమే. ఈ యుద్దం రెండు దేశాల సేనలకు బ్రిటిష్‌ ఆర్మీ ఆపీసర్లే ప్రధానాధికారులుగా ఉన్నప్పుడు జరిగిందేననే విషయం మరిచిపోవద్దు. అంతేకాక, భారత సైన్యానికి చాలినంత బలగం లేదు. విభజన సమయంలో పాకిస్తాన్‌ అఖండ భారత్‌ ‌సాయుధ దళాల్లో మూడో వంతును పొందగలిగింది. ఆర్థిక వ్యవస్థలో ఆరవ వంతును వారసత్వంగా పొందింది. అయితే, కాలక్రమంలో పాక్‌ ‌బలం, బలగాలు క్షీణించాయి. ఇరువైపు సైనికుల మధ్య కాల్పుల వల్ల, చొరబాటు యత్నాలను అడ్డుకునేందుకు జరిగిన కాల్పుల వల్ల రెండు వైపుల సైనిక నష్టం ఎక్కువగా జరిగింది. ఆ సమయంలో పీఓకే (ఆక్రమిత కాశ్మీర్‌ ) ‌నుంచి పాకిస్తాన్‌ను తరిమి వేయగలమా చేయలేమని చెప్పడానికి నాకెంతో మనోవేదనగా ఉంది. 1948 తర్వాత ఇరుదేశాల మధ్య జరిగిన యుద్ధాల్లో ఎంతో మంది సైనికులను పోగొట్టుకున్నాం. వాళ్ళ వైపు కూడా సైనిక నష్టం బాగా జరిగింది. సియాచిన్‌ ‌కూడా యుద్దం లేకుండా స్వాధీనం చేసుకోలేకపోయాం. పాకిస్తాన్‌ ‌దళాలు ఆత్మరక్షణ యుద్ధాల్లో ఆరితేరినవి.
కాశ్మీరీలు మొత్తం మీద విధేయులు, శాంతిప్రియులు, దేశ భక్తి కలిగిన భారతీయులు. అయితే, పాకిస్తాన్‌ ‌చేస్తున్న సైద్దాంతిక ప్రచారం వల్ల, మిలిటెంట్లు ఇస్లాం ప్రచారం వల్ల కొంత తేడా వచ్చింది. అయితే, అది శాశ్వతం కాదు. మూడు దశాబ్దాల ఉగ్రవాద దాడుల వల్ల ఎంతో మంది సాయుధ యోధులు పాకిస్తాన్‌ ‌నుంచి రావడం మొదలు పెట్టారు. 1990వ దశకం ఆరంభంలో అనేక మంది విదేశీ జిహాదీలు కూడా చొరబడ్డారు. అయితే, వీరీకీ, సాధారణ కాశ్మీరీలకూ సంబంధం లేదు. గడిచిన దశాబ్ద కాలంలో ఉగ్రవాదం భారతీయం అయింది. అంటే మన వాళ్ళు కూడా ఉగ్రవాద సంస్థలలో చేరడం మొదలు పెట్టారు. కాశ్మీరీలలో అణచివేతకు గురి అవుతున్నామనే భావం ఏర్పడింది. అందుకే వారిలో ఎక్కువ మంది ఉగ్రవాదం వైపు మొగ్గు చూపుతున్నారు. సగటు కాశ్మీరీ యువకుడు ఇప్పుడు భారత సైన్యం పట్ల ఆగ్రహంతో ఉన్నాడు. ఆయుధాలు చేపట్టేందుకు సుముఖంగా ఉన్నాడు.
కాశ్మీరీలు పెట్టుబడులనూ, అభివృద్దిని కోరుతున్నారు. ఇది తెలుసుకోవాలంటే దురంహాకార ధోరణిని పక్కన పెట్టాలి. ప్రజల్లో ఆగ్రహాన్ని తొలగించనిదే కేంద్రం ఎన్ని వేల కోట్లు గుమ్మరించినా కాశ్మీర్‌ ‌లో మార్పు రాదు. సాయుధ దళాలతో కాకుండా ప్రేమపూర్వకంగా కాశ్మీరీల మనసులను గెలవాలి. పొగరును ప్రదర్సిస్తే ఫలితం ఉండదు. అంతేకాక, కాశ్మీరీలు మొదటి నుంచి భారత్‌ ‌లో కొనసాగాలనే కోరుకుంటున్నారు.
భూభాగాల మార్పు విషయానికి వస్తే ఇజ్రాయెల్‌ ‌నుంచి తెలుసుకోవాలి. ఇజ్రాయెల్‌ ‌నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి. అయితే,అలాంటి ఆలోచనే చేయడం లేదు. ఇజ్రాయెల్‌ ‌దశాబ్దాలుగా ఇలాగే పోరాడుతోంది, కానీ విజయం సాధించలేకపోతోంది. భారత దేశానికి కాశ్మీర్‌ ‌భూభాగం ఉంది. దానిని పాక్‌ ‌కానీ, చైనా కాని పోగొట్టలేదు. పురానీ ఢిల్లీ మొహల్లాలను చండిగడ్‌, ‌లేదా గూర్గావ్‌లుగా చేసినట్టు భౌగోళిక మార్పులు ఏమీ చేయడం లేదు. చైనా టిబెట్‌ ‌విషయంలో ఎంత చేసినా, చేస్తున్నా శాంతిని సాధించలేకపోతోంది. కాశ్మీరీలు ఆత్మగౌరవాన్ని హక్కులనూ కోరుకుంటున్నారు. పాకిస్తాన్‌ ‌కన్నా మన దశం ఏమైనా ఎక్కువ వారికి ఇవ్వగలుగుతున్నామా అన్నది ఆలోచించుకోవాలి. వాజ్‌ ‌పేయి అనుసరించిన మార్గం నుంచి నేర్చుకోవాలి.

– శేఖర్‌ ‌గుప్త
‘ద ప్రింట్‌’ ‌సౌజన్యంతో..