వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

కావేరీ డెల్టా, దాంతో పాటు ఉత్పాదకత ఎందుకు కుంగిపోతుంది?

April 4, 2019

ఈ ‌నదీ జలాలను దశాబ్దాలుగా కర్నాటక, తమిళనాడులు ఇష్టమొచ్చిన రీతిలో వాడటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని తంజావూరు జిల్లా రైతుల హక్కుల పరిరక్షణ కమిటీ ప్రధాన కార్యదర్శి స్వామిమలై విమలనాథన్‌ అన్నారు. భవిష్యత్లో ఒక్క నది కూడా మిగలదు. ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ డెల్టాలో నీరు రాను రాను ఇంకిపోతోంది తమిళనాడుకు అన్నపూర్ణగా పేరు తెచ్చిన ఈ డెల్టాలో మూడు పంటలు పండించే భూములుగా పేరొందిన భూములు ఎండ్పోయ్‌ ‌బంజర్లుగా తయారవుతున్నాయి. తరతరాలుగా ఈ డెల్టాను ఇష్టారాజ్యంగా నీటిని వినియోగించడం, పాలకులు ఏ మాత్రం పట్టించుకోకపోవడ వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని విమలనాథన్‌ అన్నారు.

కావేరీ డెల్టా ఇప్పటికే 20శాతం కుంగిపోయింది. భూముల మళ్ళింపు, వాతావరణ మార్పు మొదలైన కారణాల వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ డెల్టా ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన నీటిపారుదల క్రమబద్దీకరణ ప్రాజెక్టు. తిరుచురాపల్లి వద్ద రెండు వేల సంవత్సరాల క్రితం కావేరీపై నిర్మించిన ఈ ప్రాజెక్టులో తగినంత నీరు లేకపోవడం వల్ల పుదుచ్చేరిలో కరైకాల్‌ ‌డ్యామ్‌లో నీటి మట్టం అట్టడిగుకు చేరుకుంది. తిరుచునాపల్లి వద్ద ఈ ఆనకట్టను రెండువేల ఏళ్ళ క్రితం కరికాల చోళుడు నిర్మించాడు. సాగునీటి సదుపాయాన్ని పెంచడానికి డెల్టాకు నీరును మళ్ళించడానికి, పంటలకు వరద తాకిడిని నివారించడానికి దీనిని నిర్మించారు.

కల్లానాయ్‌ ‌దిగువున కావేరీ నది దక్షిణ భారత దేశంలో ముఖ్యమైన నదుల్లో ఒకటి. ఈ నదీ తీరంలో పెద్ద ఎత్తున కబ్జాలు, ఇసుక తవ్వకాల వల్ల నీరు పొలాలకు అందడం లేదు. కోస్తాలో పేరొందిన పూంపుహార్‌ ‌వద్ద నీరు వృధాగా సముద్రంలోకి పోతోంది. ఈ నది సముద్రంలో కలిసేది అక్కడే.

ఈ నదీ జలాలను దశాబ్దాలుగా కర్నాటక, తమిళనాడులు ఇష్టమొచ్చిన రీతిలో వాడటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని తంజావూరు జిల్లా రైతుల హక్కుల పరిరక్షణ కమిటీ ప్రధాన కార్యదర్శి స్వామిమలై విమలనాథన్‌ అన్నారు. భవిష్యత్లో ఒక్క నది కూడా మిగలదు. ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ డెల్టాలో నీరు రాను రాను ఇంకిపోతోంది తమిళనాడుకు అన్నపూర్ణగా పేరు తెచ్చిన ఈ డెల్టాలో మూడు పంటలు పండించే భూములుగా పేరొందిన భూములు ఎండ్పోయ్‌ ‌బంజర్లుగా తయారవుతున్నాయి. తరతరాలుగా ఈ డెల్టాను ఇష్టారాజ్యంగా నీటిని వినియోగించడం, పాలకులు ఏ మాత్రం పట్టించుకోకపోవడ వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని విమలనాథన్‌ అన్నారు. మద్రాసు ఇనిస్టిట్యూరట్‌ ఆఫ్‌ ‌డెవలెంప్‌ ‌మెంట్‌ ‌స్టడీస్‌ (ఎంఐడిఎస్‌) ‌ఫ్యాకల్టీ సభ్యుడు ఎస్‌ ‌జనకరాజన్‌ ఉటంకిస్తూ ఆయన కావేరీ డెల్టా విషయంలో ఇప్పటికైనా శ్రద్ధ తీసుకోకపోతే భవిష్యత్‌లో ఈ డెల్టాలో చుక్కనీరు కూడా మిగలదని అన్నారు

ఈ డెల్టాలో గడిచిన నాలుగు దశాబ్దాల్లో భూమి ఉపయోగ పద్దతుల్లో వచ్చిన మార్పులపై కేంద్ర సామాజిక శాస్త్ర పరిశోధన మండలి ఆధ్వర్యంలో జరిగిన సర్వేలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కావేరీ డెల్టా 20 శాతం కుంగి పోయినట్టు తేలింది. కావేరీ పరీవాహక ప్రాంతం మొత్తం కర్నాటకతో కలిపి 800 కిలోమీటర్లు ఉంటే తమిళనాడులో 416 కిలో మీటర్లు ఉంది. ఈ ప్రాంతంలో కెమికల్‌, ‌కలపగుజ్జు కర్మాగారాల నుంచి వెలువడుతున్న వ్యర్ధాలు, దుర్గంధాల వల్ల ప్రాంత ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోంది. కావేరీ జల వివాదాన్ని కేవలం నదీ వివాదంగా చూడరాదనీ, కావేరీ పరీవాహక ప్రాంత నాగరికతకు వందల సంవత్సరాల చరిత్ర ఉందని నాగపట్నం రైతు సంఘం నాయకుడు ధనపాలన్‌ అన్నారు. నదిలోకి కాలుష్య కారకాలను విడుదల చేయడం వల్ల జల చరాలు ముఖ్యంగా,చేపలు, రొయ్యల సాగు దెబ్బతింటోందని ఆయన అన్నారు. మెట్టూరు డ్యామ్‌కు ఈ నది నుంచి 184 మిలియన్‌ ‌లీటర్ల నీరు సరఫరా అవుతుంది. మెట్టూరు థర్మల్‌ ‌విద్యుత్‌ ‌కేంద్రంలోని బూడిద అంతా నదిలో కలుస్తోంది. తమిళనాడులోని 72 శాతం మంది ప్రజలు కావేరీ పరీవాహక ప్రాంతంలోనే జీవిస్తున్నారని జనకరాజన్‌ అన్నారు. ఈ ప్రాంతంలో మామిడి తోటల పెంపకం 1971 నుంచి 14 రెట్లు పెరిగింది. ఈ ప్రాంతంలో తోళ్ళశుద్ధి కర్మాగారాలు కూడా ఉన్నాయి. ఆ కర్మాగారాల నుంచి వెలువడే కాలుష్యం కూడా ఈ నదిలో కలుస్తోంది. మెట్టూరు డ్యామ్‌లో నీటి నిల్వ సామర్థ్యం పదకొండేళ్ళలో 2,708 నుంచి 1,889 మిలియన్‌ ‌క్యుబెక్‌ ‌మీటర్లకు తగ్గిందని విమలనాథన్‌ ‌చెప్పారు. కావేరీ రైతుల హక్కుల కోసం ఈ మధ్య కాలంలో రైతు సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. రైతుల ఆత్మహత్యలకు సంకేతంగా పుర్రెలతో ప్రదర్శనను నిర్వహించారు. ఈ నెలలో జరగనున్న ఎన్నికల్లో డిఎంకె ఫ్రంట్‌కు మద్దతు ఇవ్వాలని కావేరీ డెల్టా రైతులు నిర్ణయించారు. ఈ నదీ పరీవాహక ప్రాంతాన్ని రక్షిత ప్రాంతంగా ప్రకటించేట్టు కృషి చేస్తామని ఫ్రంట్‌ ‌హామీ ఇచ్చింది. కాగా, రైతు సంఘాల సమాఖ్య నాయకుడు ఆయకన్ను వారణాసిలో ప్రధాని నరేంద్రమోడీకి వ్యతిరేకంగా పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. అయితే, తమ సమస్యలపై ఆయన హామీ ఇస్తే పోటీ నుంచి విరమించుకుంటానని ఆయన అన్నారు.

– ‘ద వైర్‌’ ‌సౌజన్యంతో..