వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

కాళోజీకి నేతల ఘన నివాళి

September 9, 2019

ప్రముఖ కవి, రచయిత కాళోజీ నారాయణరావు 105వ జయంతి వేడుకలో అసెంబ్లీలో ఘనంగా జరిగాయి. అసెంబ్లీ లాంజ్‌లోని కాళోజీ చిత్రపటానికి స్పీకర్‌ ‌పోచారం శ్రీనివాస్‌ ‌రెడ్డి, సీఎం కేసీఆర్‌, ‌మంత్రులు, ఎమ్మెల్యేలు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాళోజీ రచనలను గుర్తు చేసుకున్నారు. కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే.ఇక ఈ ఏడాదికి గానూ కాళోజీ నారాయణరావు అవార్డును ప్రముఖ కవి కోట్ల వెంకటేశ్వర్‌ ‌రెడ్డికి ప్రభుత్వం ప్రకటించింది. పురస్కారంతో పాటు రూ.1,01,116ల నగదును ప్రభుత్వం అందజేయనుంది. 2018 సంవత్సరానికి గానూ ప్రముఖ నవలా రచయిత డాక్టర్‌ అం‌పశయ్య నవీన్‌కు, 2017లో ప్రముఖ కవి సీతారం, 2016లో ప్రముఖ రచయిత, గాయకుడు గోరెటి వెంకన్న, 2015 ఏడాదికి గానూ సుప్రసిద్ధ రచయిత అమ్మంగి వేణుగోపాల్‌కు కాళోజీ పురస్కారం వరించిన సంగతి తెలిసిందే.