వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

కాల్చి చంపడం న్యాయం కాదు..!

December 7, 2019

పత్రికా ప్రకటన
హైదరాబాద్‌లో నవంబర్‌ 27‌న జరిగిన వెటర్నరీ డాక్టర్‌ ‌సామూహిక అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితులను హత్య చేసిన పోలీసు సిబ్బందిపై వెంటనే హత్యానేరం కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేసి ప్రాసిక్యూట్‌ ‌చేయాలని మానవ హక్కుల వేదిక (హెచ్‌.ఆర్‌.ఎఫ్‌.) ‌డిమాండ్‌ ‌చేస్తోంది. ఈ విషయంలో తెలంగాణ పోలీసులు పాల్గొన్నారు కనుక దర్యాప్తు నిష్పాక్షికంగా జరుగుతుందన్న నమ్మకం లేదు. ఇందువల్ల కేసు దర్యాప్తును సి.బి.ఐ. కి అప్పగించాలని మేము డిమాండ్‌ ‌చేస్తున్నాం. చనిపోయింది పోలీసు రిమాండ్‌, అనగా తమ అదుపులోనున్న బందీలు కనుక ఈ విషయంలో న్యాయస్థానం సుమోటోగా కలుగ చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని మనవి చేస్తున్నాం.‘దిశా’ సామూహిక అత్యాచారం, హత్య సమాజంలో చాలా అలజడికి దారి తీసింది. చాలా మంది ప్రజలు నిందితులను బహిరంగంగా ఉరి తీయాలని, కొట్టి చంపాలని డిమాండ్‌ ‌చేయడం మొదలు పెట్టారు. ఈ రకమైన సెంటిమెంట్స్‌ని అడ్డుపెట్టుకుని పోలీసులు తమ అదుపులోనున్న ఆ నలుగురు నిందితులను పధకం ప్రకారం హత్య చేసారు. ఆత్మరక్షణార్ధం ఈ హత్యకు పాల్పడ్డం అనే కట్టు కథ అల్లారు. ఈ నలుగుర నిందితులే ‘దిశ’ పై అత్యాచారం చేసి ఆమెను హత్య చేసారని తేల్చి శిక్షలు వేయాల్సింది న్యాయవ్యవస్థ, పోలిసులు కాదు. ఈ కనీస న్యాయ సూత్రాన్ని ప్రజలు మర్చిపోయి పోలీసులకు ఇటువంటి హత్యలు చేయడానికి సంఘీభావం తెలపడం వల్ల అంతిమంగా నష్టపోయేది స్త్రీలు, ప్రజలే.
చట్టబద్ధ పాలనను విస్మరించి ఈ విధంగా మనుషులను కాల్చి చంపడం వలన న్యాయం జరిగిందనుకోవడం భ్రమే అవుతుంది. ఒక కేసులో పోలీసులే తీర్పులు చెప్పేసీ, వాటిని అమలు చేసేస్తే అది న్యాయం ఎలా అవుతుందో ఒకసారి ఆలోచంచమని ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాం. న్యాయవ్యవస్థ జోక్యం లేకుండా పోలీసులకు దారి తీస్తుందో ఆలోచించమని కోరుతున్నాం. ‘ప్రజల మనోభావాల’ ను అడ్డం పెట్టుకుని వారిని సంతృప్తి పరచడానికి ఈ విధంగా చట్టవిరుద్ధంగా హత్యా సంస్కతిని ప్రవేశపెట్టడం ప్రజాస్వామ్యానికి హానికారి అవుతుంది. హీనాతిహీనమైన లైంగిక అత్యాచారం, హత్య కేసులలో నిందితులను ఈ విధంగా కాల్చేస్తే స్త్రీలకు నిజంగా భద్రత కల్పించినవారు అవుతారా ? మేము అది సరైనదని అనుకోవడం లేదు. స్త్రీలకు ఇంటా బైటా, విద్యాసంస్థల్లో, పని ప్రదేశాల్లో, సమాజమంతటా భద్రత కల్పించాంటే అందుకు సుదీర్ఘ సాంస్క•తిక పోరాటం అవసరం. ఈ వంకతో పోలీసులకు మనుషులను చంపే అధికారం కట్టబెట్టడం అందుకు వారు జవాబుదారి లేని చర్యలకు పాల్పడటానికి ఉపయోగ పడుతుంది కాని అందువల్ల స్త్రీలకూ ఒరిగేది ఏమీ లేదు. ఈ మృత్యు సంస్కతిని సమర్ధించడం, పండగ చేసుకోవడం అమానుషం. దాశా హత్య ఎంత హేయకరమో పోలీసులు ఈ రకమైన మృత్యు సంస్కతిని ప్రవేవపెట్టడం అంటే హేయకరం. దీనిని మేము ఖండిస్తున్నాం.

-ఎస్‌. ‌జీవన్‌కుమార్‌ (‌హెచ్‌.ఆర్‌.ఎఫ్‌. ‌తెలంగాణ, ఏ.పి. సమన్వయ కమిటీ సభ్యులు),
– జి. మాధవరావు (హెచ్‌.ఆర్‌.ఎఫ్‌. ‌తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు)