వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

కార్పొరేట్‌ ‌హాస్పటల్స్‌కు ధీటుగా భద్రాచలం ఏరియా దవాఖాన.

September 11, 2019

  • గిరిజన ప్రాంతాలకు ఆదర్శవంతంగా  అభివృద్ది చేస్తాం
  • వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేంద•ర్‌ ‌వెల్లడి

కార్పోరేట్‌ ఆసుపత్రులకు దీటుగా భద్రాచలం ఏరియా ఆసుపత్రిని తీర్చిదిద్దుతామని, ఇప్పటికే కార్పోరేట్‌ ఆసుపత్రుల తరహాలోనే భద్రాచలం ఏరియా ఆసుపత్రి పనిచేస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ అన్నారు. బుధవారం ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేసారు. రోగులకు అందుతున్న వైద్య సేవలను నేరుగా ఆయన రోగులను అడిగి తెలుసుకున్నారు. ఒక్కో వార్డులో ఉన్న రోగులతో ఆయన కాసేపు మాట్లాడారు. వారు ఏ రోగంతో ఆసుపత్రిలో చేరారో అడిగి తెలుసుకున్నారు. అందుకు అనుగుణంగా వైద్య సేవలు అందుతున్నాయో లేదో రోగులను ప్రశ్నించారు. అలాగే ఆసుపత్రి పరిసర ప్రాంతాలు పరివీలించారు. ఏరియా ఆసుపత్రి పరిశుభ్రతపై సంతృప్తి వ్యక్తం చేసారు. భద్రాచలం ఏరియా ఆసుపత్రి రెండు రాష్ట్రాల ప్రజలకు అందుబాటులో ఉండటం హర్షనీయమని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ‌విలీన మండలాల నుండి కూడ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందటం పట్ల హర్షం వ్యక్తం చేసారు. అలాగే ఛత్తీస్‌ఘఢ్‌ ‌రాష్ట్రం నుండి అనేక మంది వివిధ రోగాలపై వచ్చిన వారికి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న ఏరియా ఆసుపత్రి వైద్యులను ఆయన ప్రశంశించారు. హైద్రాబాదులో ఉన్న కార్పోరేట్‌ ఆసుపత్రి తరహాలోని భద్రాచలం ఏరియా ఆసుపత్రి ఉందని అన్నారు. అయితే ఆసుపత్రిలో డాక్టర్ల కొరత ఉన్న విషయం వాస్తవమేనని త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ ‌రావుతో చర్చించి నియమించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా మారుమూల ప్రాంతం కావడం వలన ఎక్కువ మంది డాక్టర్లు ఇక్కడ పనిచేయడానికి చుముకత చూపటం లేదని అన్నారు. త్వరలోనే కొత్త డాక్టర్లను నియమించి డయాలసీస్‌ ,‌సిటి స్కాన్‌లను త్వరలోనే ఏర్పాటు చేస్తామని చెప్పారు. భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను,  డాక్టర్లను చేస్తున్న సేవలను ఇతర ప్రభుత్వ ఆసుపత్రిలో చెప్పి వారిని కూడ మెరుగైన వైద్యం చేసే విదంగా చర్యలు చేపడతామని చెప్పారు. వైద్య సేవలు పొందుతున్న రోగులు చెప్పిన సమాధానం పట్ల మంత్రి సంతృప్తి చెందారు. ఇక్కడ వైద్యులు రోగుల పట్ల ఎంతో శ్రద్ద చూపుతున్నారని చెప్పారు. హైద్రాబాదులోని ప్రభుత్వ ఆసుపత్రి అయిన ఉస్మానీయా ఆసుపత్రిని తలపించే విధంగా ఏరియా ఆసుపత్రి ఉందని అన్నారు. ఈ ఆసుపత్రికి వచ్చిన రోగులు తమ వ్యాధి తగ్గుతుందనే నమ్మకంతో ఆసుపత్రిలో చేరుతున్నారని చెప్పారు. ఆసుపత్రిలో ఎప్పుడూ కూడ మందులు కొరత లేకుండా చూడాలని, కాంట్రాక్టుపై పనిచేస్తున్న డాక్టర్లకు ఇతర సిబ్బందికి ప్రతీ నెల మొదటివారంలో వేతనాలు వచ్చేల కృషి చేయాలని ఆసుపత్రి సూపరిండింట్‌ ‌కోటిరెడ్డిని ఆదేశించారు.  అలాగే భద్రాచలంలో మెడికల్‌ ‌కాలేజీ కావాలని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకుఆయన స్పందిస్తూ తన దృష్టికి వచ్చినందున తప్పకుండా ప్రభుత్వం చర్చించి చర్యలు చేపడతానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి విపి గౌతమ్‌, ‌సబ్‌కలెక్టర్‌ ‌భవేశ్‌మిశ్రా, జిల్లా పరిషత్‌ ‌చైర్మన్‌ ‌కోరం కనకయ్య, ఖమ్మం గ్రంధాలయ చైర్మన్‌ ‌దిండిగల రాజేంధర్‌, అసిస్టెంట్‌ ‌కమీషనర్‌ ‌రామ్‌రెడ్డి, యంపిపి ఉయికా శాంతమ్మ, డియం• హెచ్‌ఓ ‌భాస్కర్‌ ‌నాయక్‌ , అడిషనల్‌ ‌డియం• హెచ్‌ఓ ‌సింగరాజు, ఏఎస్పీ రాజేష్‌ ‌చంద్రం, మరియు డాక్టర్లు పాల్గొన్నారు.

స్వామివారిని దర్శించుకున్న మంత్రి ఈటెల : వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేంధర్‌ ‌బుధవారం నాడు భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంకు వచ్చిన ఆయనకు ఆలయ ప్రధానార్చకులు ఆలయ సాంప్రదాయాలతో వేదమంత్రోత్సవాలతో ఆలయంలోకి స్వాగతం పలికారు. వరివట్టం కట్టి ప్రధానాలయంలోకి తీసుకువెళ్ళి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లక్ష్మీతయారు అమ్మవారి ఆశీస్సులు స్వీకరించారు. ప్రధానార్చకులు మంత్రికి ఆశీర్వచనం ఇచ్చారు. ఆలయ జేఇఓ శ్రావణ్‌ ‌కుమార్‌ ‌స్వామివారి మెమొంటోను అందచేసారు.