Take a fresh look at your lifestyle.

కాగిత రహిత పాలనయే లక్ష్యం : కలెక్టర్‌

మహబూబ్‌ ‌నగర్‌10 ‌జూన్‌( ‌ప్రజాతంత్ర ప్రతినిధి) : పాలమూరు జిల్లాను కాగిత రహిత పాలన జిల్లాగా మార్చడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్‌ ‌వెంకట్రావు అన్నారు. బుధవారం  మహబూబ్‌ ‌నగర్‌ ‌రూరల్‌ ఎం‌పిడిఓ కార్యాలయంలో లో ఈ – ఆఫీస్‌ ‌విధానాన్ని ప్రారంభించారు  పారదర్శకత, గోప్యత, పేపర్‌ ‌వాడకం లేకుండా ఫైలు నిర్వహించేందుకు ఈ- ఆఫీసు విధానం  ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్‌ ఎస్‌. ‌వెంకట రావు అన్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్‌ ‌మాట్లాడుతూ  జిల్లాలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ- ఆఫీస్‌ ‌విధానాన్ని అమలు చేస్తున్నామని, ఇదివరకే జిల్లా కార్యాలయాన్ని పూర్తికాగా, తాసిల్దార్‌ ‌కార్యాలయాలలో కూడా ఈ – ఆఫీస్‌ ‌విధానం పూర్తయిందని తెలిపారు. మండల స్థాయిలో వ్యవసాయ ,విద్య, ఇంజనీరింగ్‌ ‌కార్యాలయాల్లో కూడా ఈ- ఆఫీస్‌ ‌విధానం అమలు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని, త్వరలోనే ఈ కార్యాలయాలన్నింటిలో ఈ- ఆఫీస్‌ ‌విధానం ప్రవేశపెడతామని చెప్పారు.

ఈ- ఆఫీస్‌  ‌విధానం వల్ల పారదర్శకతతో పాటు, ఫైల్‌ ‌క్లియరింగ్‌  ‌త్వరగా అవుతుందని,   పాత తేదీలతో ఫైలు పంపించేందుకు అవకాశం లేదని, అంతేగాక ఫైలు మిస్‌ ‌కావటానికి అవకాశం ఉండదని, ఏ ఫైల్‌ ఎక్కడ ఉందో వెంటనే తెలుసుకునే అవకాశం కూడా ఉంటుందని ,ముఖ్యంగా ఫైల్‌ ‌లో  తీసుకునే నిర్ణ యాలు అధికారికి ,జిల్లా కలెక్టర్‌ ‌తప్ప మధ్యలో ఎవరికీ తెలిసే అవ కాశం లేదని, గోప్యతకు భంగం కలగకుండా ఉంటుందని తెలిపారు. అంతేకాక ఈ -ఆఫీస్‌ ‌విధానం వల్ల వేల ఫైళ్లు  కంప్యూటర్‌ ‌లో నిక్షిప్తం చేసుకోవచ్చని, మ్యానువల్‌ ‌విధానం వల్ల ఎక్కడికి వెళ్లిన ఫైళ్ళను భౌతికంగా తీసుకువెళ్లి పరిష్కరించాల్సి ఉంటుందని,అదే ఈ – ఆఫీస్‌ ‌విధానం వల్ల ఫైళ్లు మోసుకు వెళ్లాల్సిన అవసరం లేద ని, అర్థరాత్రి అయినా, అత్యవసర పరిస్థితుల్లో అయినా వెంటనే ఫైళ్లను క్లియర్‌ ‌చేయవచ్చని తెలిపారు .ముందుగా నిర్ణయించిన ప్రకా రం ఆయా శాఖల అధికారులు అందరూ ప్రత్యేకించి  ఇంకా ఇప్పటి వరకు ఈ-ఆఫీస్‌ ‌పరిధిలోకి రాని అధికారులందరూ తక్షణమే ఈ- ఆఫీస్‌ ‌పరిధిలోకి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుధ శ్రీ, జడ్పిటిసి వెంకటేశ్వరమ్మ, వైస్‌ ఎం‌పీపీ కె.అనిత , జెడ్‌ ‌పి సీఈవో యాదయ్య, జిల్లా  ఎన్‌ ఐ ‌సి అధికారి మూర్తి,డిపివో వెంకటేశ్వర్లు ,ఎంపీడీవో వేదవతి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply