Take a fresh look at your lifestyle.

కాంగ్రెస్‌ ‌పార్టీలో వివాదరహితులు ఆ ఇద్దరే..!

రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి శ్రీధర్‌ ‌బాబుకు అనుకూలం
2023లో డబ్బులు ఇవ్వకున్నా కాంగ్రెస్‌ ‌కే వోటేస్తారు:ఎమ్మెల్యే జగ్గారెడ్డి

కాంగ్రెస్‌ ‌పార్టీ లో వ్యక్తిగతంగా ఏ నాయకుడు ఎదిగినా అల్టిమేట్‌ ‌గా గాంధీభవనే శాసిస్తుందని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.అసెంబ్లీ లో కాంగ్రెస్‌ ‌శాసనసభ పక్ష కార్యాలయం లో మీడియా తో చిట్‌ ‌చాట్‌ ‌చేస్తూ…పార్టీ లో కాంట్రవర్సీ లో లేని నాయకులే పీసీసీ అవుతారని,కాంట్రవర్సీ లేని వాళ్ళు పార్టీలో ఇద్దరే యిద్దరని.వారు శ్రీధర్‌ ‌బాబు, జీవన్‌ ‌రెడ్డి లే అని జగ్గారెడ్డి అన్నారు. కాంట్రవర్సీ లో ఉన్న నాయకులు పీసీసీ పరిశీలన జాబితాలో మాత్రమే ఉంటారని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఇక పీసీసీ నియామకనికి డబ్బుతో సంబంధం ఉండదని, 1000 కోట్లు ఖర్చు పెడతా అన్నా… అధిష్టానం పీసీసీ ఇవ్వదన్నారు.అలాగే కాంగ్రెస్‌ ‌లో సింగిల్‌ ‌హీరో ఉండరని ఎవరికీ వారే హీరోలని , రేవంత్‌ ‌రెడ్డి ప్రారంభించిన పార్టీ కార్యాలయం మరో పవర్‌ ‌సెంటర్‌ అని జరిగే ప్రచారంలో తప్పులేదన్నారు.రేవంత్‌ ఎం‌త బలపడితే కాంగ్రెస్‌ ‌కి అంత బలం పెరుగుతుందని, పార్టీలో వ్యక్తిగతంగా ఎవరు ఎదిగినా అది కాంగ్రెస్‌ ‌కే లాభమన్నారు . కాంగ్రెస్‌ ‌లో రేవంత్‌ ‌వ్యక్తిగతంగా ఎదగాలని అనుకోవడంలో తప్పులేదని , రేవంతే కాదు..భట్టి, శ్రీధర్‌ ‌బాబు..దామోదర రాజనర్సింహ.. ఇలా ఎవరైనా వ్యక్తిగతంగా ఎదోగొచ్చన్నారు.తెలంగాణ సిఎం కేసీఆర్‌,ఏపీ సీఎం జగన్‌, ‌నేను ఆడపిల్ల తండ్రిగా ఎన్‌ ‌కౌంటర్‌ ‌ని సమరిస్తున్నామని..కానీ సీఎం కేసీఆర్‌ ‌నేనే ఎన్‌ ‌కౌంటర్‌ ‌చేయించనని అనలేదు కాబట్టి నేను స్పందించను అని మీడియా మిత్రులు వేసిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.ఐతే చట్టసభల్లో సభ్యులం కాబట్టి… న్యాయపరంగా శిక్ష పడితే బాగుండు అనేదే మా ఆలోచన అని తన అభిప్రాయం తెలియచేయారు.ఏపీ సిఎం జగన్‌ 21 ‌రోజుల్లో శిక్ష పడేలా చట్టం చేస్తా అని చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని ,అలాగే కేసీఆర్‌ ‌కూడా అలాంటి చట్టం తేవాలని కోరారు.2023లో డబ్బులు ఇవ్వకున్నా ప్రజలు కాంగ్రెస్‌ ‌కె ఓటేస్తారని …ఇప్పటికే 2018లో డబ్బులు తీసుకుని ఓటేసి తప్పుచేశామన్న భావనలో ఓటర్లు ఉన్నట్లు జగ్గారెడ్డి చిట్‌ ‌చాట్‌ ‌లో
తెలిపారు..
ప్రభుత్వ వైఫల్యాలకు, పాపాలకు ఎన్‌ ‌కౌంటర్‌ ‌పరిష్కారం కాదు…ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో పోలీస్‌ ‌యంత్రంగం కేవలం అధికార పార్టీ నేతల సేవలకు మాత్రమే ఉన్నట్లు కనిపిస్తుందని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి విమర్శించారు.మంగళవారం అసెంబ్లీ లోని మీడియా హాల్‌ ‌లో మాట్లాడుతూ…. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం, పోలీస్‌ ‌నిర్లక్ష్యానికి ఈ ఘటనలు నిదర్శనంగా ఉన్నాయన్నారు.ప్రభుత్వ వైఫల్యాలకు, పాపాలకు ఎన్‌ ‌కౌంటర్‌ ‌పరిష్కారం కాదని హితవు పలికారు. దిశ కుటుంబ సభ్యులు పోలీసులను సంప్రదించగానే స్పందించి ఉంటే ఇంతటి దారుణం జరిగేది కాదని మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళల పై జరిగిన దాడులు ఎక్కువగా దళితులు, బలహీన వర్గాలకు చెందినవేనాని ఆవేదన చెందారు.దిశ సంఘటన తో పాటు అన్ని కేసుల పై స్వాతంత్య్ర విచారణ సంస్థ సిట్‌ ఏర్పాటు చేయాలి, దిశ కేస్‌ ‌పై జ్యూడిషియల్‌ ‌విచారణ జరిపించాలని డిమాండ్‌ ‌చేశారు. ఒక్క దిశ కేస్‌ ‌కోసం మాత్రమే ఫాస్ట్ ‌ట్రాక్‌ ‌కోర్ట్ ‌కాకుండా శాశ్వత ఫాస్ట్ ‌ట్రాక్‌ ‌కోర్టును ఏర్పాటు చేయాలని జీవన్‌ ‌రెడ్డి కోరారు.
కొత్త సారధి ని నియమించే వచ్చే వరకు ఇంతేనా….?
తెలంగాణ కాంగ్రెస్‌ ‌నూతన సారధి కోసం వేచి చూస్తోంది.ప్రస్తుతం ఉన్న పీసిసి అధ్యక్షులు కొంతవరకు పార్టీ కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నడం లేదని..పీసిసి మార్పు త్వరలోనే ఉంటుందని అందుకే ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి మౌనంగా ఉంటున్నారనే చర్చ నడుస్తోంది.ఐతే ప్రస్తుత సారధి నల్గొండ ఎంపీ గా ఉండడం ,అందులో పార్లిమెంట్‌ ‌సమావేశాలు కొనసాగుతూ ఉండడం ఒకకారణమైతే..మరికొందరు నూతన అధ్యక్షుడి మార్పు త్వరలోనే ఉండనుంది దింతో ఉత్తమ్‌ ‌కాస్త అంటీముట్టన్నట్లు వ్యవహరిస్తున్నారనే చర్చ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.ఇది ఇలా ఉంటె ఇటీవలే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల పై ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి అనుకున్న స్థాయిలో స్పందించకపోవడం తో పీసిసి మార్పు కచ్చితంగా ఉంటుందని పార్టీ నేతలో జోరుగా చర్చ నడుస్తోంది.నూతన సారధిని నియమించే వరకు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల పై అంటీముట్టన్నట్లు స్పందిస్తే ఎలా ..! ఉద్యమాలు చేయకపోతే క్యాడర్‌ ‌పరిస్థితి ఏంటి..? ఇలా ఐతే పార్టీ మరింత బలహీనపడుతుంది కదా అంటూ కాంగ్రెస్‌ ఆ‌గ్రహం తో ఊగిపోతున్నారు..
నూతన సారధిగా అవకాసహం ఎవరికీ….?
నూతన సారధిగా ఎవరికీ ఎక్కువగా అవకాశాలు ఉన్నాయనుకుంటే మాత్రం..గాంధీభవన్‌, ‌కాంగ్రెస్‌ ‌పార్టీ శ్రేణుల నోటు నుండి మాజీ మంత్రి , ప్రస్తుత మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌ ‌బాబు పేరు మొదటి వరసలో వినిపిస్తోంది..ఇప్పటికే పేరు ఖరారు అయిన్నట్లు కూడా చర్చించుకుంటున్నారు….! ఇక శ్రీధర్‌ ‌బాబు తో పటు మల్కాజ్గిరి ఎంపీ రేవంత్‌ ‌రెడ్డి , భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి.రాష్ట్ర సారధితో పటుగా వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌డీసిసి ల నియామకం ఒకేసారి జరుగుతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఈ నెల 14 ఏఐసిసి తలపెట్టిన భరత్‌ ‌బచావో కార్యక్రమం తర్వాత ఢిల్లీ అధిష్టానం మార్పులు చేర్పుల పై నిర్ణయం తీసుకోనున్నట్లు ఢిల్లీ సమాచారం..

Leave a Reply

error: Content is protected !!