Take a fresh look at your lifestyle.

కాంగ్రెస్‌వి అడ్డగోలు మాటలు

ఈ ఏడాది ఆర్థిక మాంద్యం తీవ్రంగా ఉంది. అన్ని రంగాల్లో మాంద్యం ప్రభావం ఉంటుంది. పన్నులు పెంచే, తగ్గించే అధికారం మాకు లేదు. కేంద్రం నుంచి పన్నుల వాటా రావాలి. అందులోనూ కేంద్రం కార్పొరేట్‌ ‌ట్యాక్స్ ‌తగ్గించింది. ఆ మేరకు రాష్ట్రాల వాటా కూడా తగ్గుతుంది. ఆర్థిక మాంద్యం ఉన్నా సంక్షేమ పథకాలు ఆపేది లేదు.

అవసరమైతే మరిన్ని రుణాలు తెస్తం
అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చలో సిఎం కెసిఆర్‌
‌బిల్లుకు శాసన సభ ఆమోదం
సభ నిరవధిక వాయిదా

ఫోటో: ఈ ‌నెల 29 నుండి అక్టోబర్‌ 9‌వరకు నిర్వహించనున్నవరంగల్‌ ‌శ్రీ భద్రకాళిదేవి శరన్నవరాత్ర (దసరా) మహోత్సవములలో పాల్గొనవలసిందిగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు దంపతులను దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ ‌రెడ్డి, చీఫ్‌ ‌విప్‌ ‌వినయ్‌ ‌భాస్కర్‌, ఆలయ ఇఓ సునీత, ఆలయ అర్చకులు ప్రగతిభవన్‌ ‌లో కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మహోత్సవాల వాల్‌ ‌పోస్టర్‌ ‌ను విడుదల చేసిన దృశ్యం.

రాష్ట్రంలో కౌలుదారులను గుర్తించే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌స్పష్టం మరోసారి చేశారు. రైతుల సంక్షేమం కోసమే తమ ప్రభుత్వం ఉందని.. రైతుల భూమి కాపడుతామని సీఎం అన్నారు. సిఎం కేసీఆర్‌ ఆదివారం అసెంబ్లీలో ‘ద్రవ్య వినిమయ బిల్లు’ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సిఎం పలు లంశాలపై సుధీర్ఘ వివరణ ఇచ్చారు. కాంగ్రెస్‌ ‌శాసన సభాపక్ష నేత మల్లు బట్టి విక్రమార్క లేవనెత్తిన పలు అంశాలపై తనదైన శైలిలో జవాబునిచ్చారు. ఈ సందర్భంగా కొత్త రెవెన్యూ చట్టంపై సీఎం మాట్లాడుతూ.. కౌలుదారులు ఎప్పటికప్పుడు మారుతున్నారని తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో ఇచ్చిన భూపరిహారం.. మహబూబ్‌నగర్‌లో ఎలా ఇస్తామని వివరించారు. రిజిస్ట్రేషన్‌ ‌విలువ, చట్టం ప్రకారం భూపరిహారం ఇస్తామని ప్రకటించారు. ఆర్థికమాంద్యం ప్రభావం అన్ని రంగాలపై ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ‘కొత్త పంచాయతీరాజ్‌ ‌చట్టం తెచ్చినం. కొత్త చట్టం పట్ల కఠినంగా ఉంటం. సర్పంచ్‌లకు జాయింట్‌ ‌చెక్‌పవర్‌ ‌కొనసాగుతది. ఉప సర్పంచ్‌లను కలుపుకొని తీసుకుపోవాలని సర్పంచ్‌లను కోరినం. టీఆర్‌ఎస్‌ ‌నుంచి ఎక్కువ మంది సర్పంచ్‌లు ఎన్నికయ్యారు. సర్పంచ్‌లను తొలగించే సమయంలో మంత్రులకు ఉన్న స్టే పవర్‌ను తీసేసినం. సర్పంచ్‌ల విషయంలో కలెక్టర్‌లకు విశేష అధికారాలు ఇచ్చినం. రెవెన్యూ శాఖలో అవకతవకలు ఎవరి పుణ్యం. వీఆర్‌వోలను మేం తీసేస్తామని చెప్పినమా’ అని కెసిఆర్‌ ‌ప్రతిపక్షలను ప్రశ్నించారు. ‘వీఆర్‌వోలను తొలగించాల్సి వస్తే తొలగిస్తామని, పటేల్‌, ‌పట్వారీ వ్యవస్థలు పోలేదా అని అడిగారు. అదేవిధంగా భారత దేశం ఆశ్చర్యపోయే విధంగా తాము అద్భుతమైన రెవెన్యూ చట్టాన్ని తెస్తామని,
నూతన రెవెన్యూ చట్టాన్ని త్వరలోనే తీసుకువస్తామని వెల్లడించారు. ప్రభుత్వాన్ని ఉద్యోగులు డిక్టేట్‌ ‌చేయలేరని సిఎం అన్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన పనులను ఉద్యోగులు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ‘‘కుక్క తోకను ఊపుతుందా? లేక తోక కుక్కను ఊపుతుందా?’’ అంటూ ఉద్యోగుల తీరుపై వ్యాఖ్యలు చేశారు. పిచ్చి మాటలు నమ్మి సమ్మెలు చేయడం సరికాదని ఉద్యోగులకు సీఎం హితవుచెప్పారు.
తాము రైతుల కోసం పనిచేస్తున్నామని, రైతులకు ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది రానివ్వమని, కౌలుదారులను తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలోనూ గుర్తించదని, అది రైతులకు … కౌలుదారులకు మధ్య సంబంధమని సిఎం స్పష్టం చేశారు. ఈ ఏడాది ఆర్థిక మాంద్యం తీవ్రంగా ఉందని, అన్ని రంగాల్లో మాంద్యం ప్రభావం ఉంటుందని, పన్నులు పెంచే, తగ్గించే అధికారం తమకు లేదని, కేంద్రం నుంచి పన్నుల వాటా రావాలని, అందులోనూ కేంద్రం కార్పొరేట్‌ ‌ట్యాక్స్ ‌తగ్గించిందని, ఆ మేరకు రాష్ట్రాల వాటా కూడా తగ్గుతుందని తెలిపారు. ఆర్థిక మాంద్యం ఉన్నా సంక్షేమ పథకాలు ఆపేది లేదని తెలిపారు. ప్రాజెక్టులపై కాంగ్రెస్‌ ‌సభ్యులు లేవనెత్తిన అంశాలపై వివరణ ఇస్తూ ఢిల్లీ నాయకత్వానికి తలవొంచి నందికొండను నాశనం చేసిందే కాంగ్రెస్‌ ‌పార్టీ అని, ఉన్న తెలంగాణను నాశనం చేసిందే కాంగ్రెస్‌ అం‌టూ మండిపడ్డారు. ప్రాజెక్టుల మీద కేసులు, ఉద్యోగ ప్రకటనల మీద స్టేలు తెచ్చుకున్నారని, మొత్తం మీద కాంగ్రెస్‌ ‌వాళ్లు 900 కేసులు వేశారని అన్నారు. ‘తెలంగాణ తెచ్చి తప్పు చేసినమని జానారెడ్డి అంటరు. ఎక్కువ తక్కువ తెలంగాణను ఆంధ్రాలో కలుపుతామని బలరాంనాయక్‌ అం‌టరు. భవిష్యత్‌లో ఆంధ్రా తెలంగాణ కలిసే అవకాశం ఉందని ఎంపీ జైరాం రమేశ్‌ అం‌టడు’. అని కెసిఆర్‌ అన్నారు. మాట్లాడితే అప్పులు అంటున్నరని, నాగార్జునసాగర్‌, ఎస్సారెస్పీ మీద వారు అప్పులు తేలేదా అంటూ ప్రశ్నించారు. మేడిగడ్డ ప్రాజెక్టుపై కాంగ్రెస్‌ ‌నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ ‌పార్టీకి భౌగోళిక, నీటి అవసరాలపై అవగాహన లేదని మండిపడ్డారు. ప్రాజెక్టుల నిర్మాణం కోసమే అప్పులు తీసుకువచ్చామని, కాంగ్రెస్‌ ‌విమర్శలు అర్ధరహితమని అన్నారు. అవసరమైతే తమ ప్రభుత్వం మళ్లీ రుణాలు సేకరిస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌తో పోలిస్తే టీఆర్‌ఎస్‌ ‌పాలన వంద రెట్లు మెరుగ్గా ఉందని అన్నారు. కాంగ్రెస్‌ ‌పాలించి ఆరు చందమామలు ఏడు సూర్యళ్లు పెడితే మేం ఖరాబ్‌ ‌చేసినమా. 54 ఏండ్ల కాంగ్రెస్‌ ‌పాలనలో దేశ ఆర్థిక పరిస్థితి చతికిల పడింది. చేతగాని ప్రభుత్వాల వల్ల రైతులు 24 లక్షల బోర్లు వేశారు. పథకాల పేర్లు మారాయి తప్ప ప్రజల తలరాత మారలేదు. ఇందిరాగాంధీ గరీబీ హఠావో… నరేంద్ర మోడీ బేటీ బచావో హఠావో… బచావో తప్ప దేశంలో మరొకటి లేదా. దేశంలో ఉన్న ఈ దుస్థితికి ఎవరి విధానాలు కారణం. మన పక్కనే ఉన్న చైనా ఎక్కడిదాకా పోయింది. మనం ఎక్కడ ఉన్నాం. గుండెల మీద అణుబాంబులు వేసుకున్న నాగసాకి ఎక్కడికి పోయింది’ అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్‌ ‌పార్టీని విలీనం చేసుకోడంపై భట్టి లేవనెత్తిన అంశాన్ని ప్రస్తావిస్తూ పక్క రాష్ట్రానికి చెందిన రాజ్యసభ సభ్యులను బీజేపీలో కలుపుకున్నారని, గోవాలో 10 మంది కాంగ్రెస్‌ ‌సభ్యులు బీజేపీలో విలీనమయ్యారని, రాజస్థాన్‌లో బీఎస్పీ సభ్యులను కాంగ్రెస్‌ ‌చేర్చుకుందని, టీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు వందకు వందశాతం రాజ్యాంగబద్దంగానే టీఆర్‌ఎస్‌లో చేరారని, వాళ్లను తాము పార్టీలో చేర్చుకోలేదని, వాళ్లే టీఆర్‌ఎస్‌లో విలీనమయ్యారని పేర్కొన్నారు. నైతికత విషయంలో కాంగ్రెస్‌ ‌పార్టీ తమకు నీతులు చెప్పాల్సిన అసవరం లేదని ఎద్దేవా చేశారు. ఎన్‌ఆర్‌సీపై ఎంఐఎం లేవనెత్తి అంశాలకు వివరణనిస్తూ ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. త్వరలోనే ఓల్డ్‌సిటీలో కూడా మెట్రో రైలు విస్తరిస్తామని తెలిపారు. మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వం నాన్చుడు ధోరణి అనుసరిస్తోందని అవసరమైతే అసెంబ్లీలో 12శాతం రిజర్వేషన్లపై తిర్మానం చేద్దామన్నారు. పది రోజుల పాటు కొనసాగిన అసెంబ్లీ సమావేశాలలో మూడు బిల్లులతో పాటు ఒక తీర్మానాన్ని సభ్యులు ఆమోదించారు. అనంతరం శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!