Take a fresh look at your lifestyle.

కశ్మీర్‌ ‌మరోసారి ప్రయోగశాల ..!

370 రద్దుకు వ్యతిరేకంగా స్థానికులు
ఫోన్‌ ‌కాల్స్, ఇం‌టర్నెట్‌ ‌నిషేధం
హిందూ ప్రాబల్యంపై ఆందోళన
‘రాయిటర్‌ ‘ ‌కథనం
‌శ్రీనగర్‌ ‌సౌరాప్రాంతం జనాభా 15వేలు . ప్రభుత్వ దళాలను ప్రతిఘటించే వారికి ఈ ప్రాంతం కేంద్రంగా ఉంది. కాశ్మీర్‌ ‌కు ప్రత్యేక ప్రతిపత్తిని ప్రభుత్వం రద్దు చేయడంతో ఈ ప్రాంతంలో ప్రజలు కుతకుత ఉడుకుతున్నారు.’’మా గొంతు నొక్కేశారు. మాలో మేము కుమిలి పోతున్నాం..’’ అని 25 ఏళ్ళ ఎజాజ్‌ అన్నాడు. ఈ ప్రాంతంలో అధిక సంఖ్యాకులు ముస్లింలే. ఆగస్టు 5వ తేదీన 370వ అధికరణాన్ని రద్దు చేసినప్పటి నుంచి ఆ ప్రాంతంలో ఆంక్షలు కొనసాగుతున్నాయి.శ్రీనగర్ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్ లో జన సాంద్రత ఎక్కువగా ఉండే సౌరా ప్రాంతంలో యువకులు తమ నగర ప్రవేశ ప్రాంతాలలో రాత్రి, పగలు తేడా లేకుండా వారం రోజులు పైగా కాపు కాస్తున్నారు. నగరంలో ప్రవేశ ప్రదేశాలు డజన్ పైగా ఉన్నాయి. ఆ ప్రదేశాల వద్ద దారికి అడ్డంగా ఇటుకలు ,లోహపు రేకులు, చెక్కల శ్లాబులు, కూలిన చెట్ల బొందలతో బ్లాకేడ్లను ఏర్పాట్లు చేశారు. యువకులు చేతుల్లో రాళ్ళు పుచ్చుకుని ఆ బ్లాకేడ్ ల వెనుక బృందాలుగా కనిపిస్తున్నారు. భద్రతాదళాలను ముఖ్యంగా, పారా మిలటరీ దళాలను తమ ప్రాంతాలకు రానివ్వకుండా అడ్డుకోవడం వారి ఉద్దేశ్యం. మా గొంతు నొక్కేశారు. మేము మాలో మేము కుమిలి పోతున్నాం అని 25 ఏళ్ళ ఎజాజ్ అన్నాడు. అతడి మాదిరిగా ఆ ప్రాంతంలో ఎంతో మంది ఉన్నారు. వారందరినీ రాయిటర్ సంస్థ ప్రతినిధి ఇంటర్వ్యూ చేశారు. వారంతా అరెస్టు భయాన్ని వ్యక్తం చేశారు. బాహ్య ప్రపంచం మేం చెప్పేది వినకపోతే మేం ఏం చేయాలి తుపాకులు పుచ్చుకోవాలా అని ఆ ప్రాంత యువకులు ప్రశ్నిస్తున్నారు. సౌరాప్రాంతంలో 15వేల మంది ఉన్నారు. ప్రభుత్వ దళాలను ప్రతిఘటించే వారికి ఈ ప్రాంతం కేంద్రంగా ఉంది. కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని ప్రభుత్వం రద్దు చేయడంతో ఈ ప్రాంతంలో ప్రజలు కుతకుత ఉడుకుతున్నారు. ఈ ప్రాంతంలో అధిక సంఖ్యాకులు ముస్లింలే. ఈ ప్రాంతంలోకి భద్రతా దళాలు అడుగుపెట్టలేని స్థితి ఉండేది. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కాశ్మీర్ ను యావద్భారతంలోచేర్చేందుకే ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసినట్టు ప్రభుత్వం చెబుతోంది. ఆగస్టు 5వ తేదీన 370వ అధికరణాన్ని రద్దు చేసినప్పటి నుంచి ఆ ప్రాంతంలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. కాశ్మీర్ లో బంధు ప్రీతి, అవినీతిని నిర్మూలించి అభివృద్ది పథంలో రాష్ట్రం దూసుకుని పోయేట్టు చేయడం కోసమే ఈ చర్య తీసుకున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. ఉగ్రవాదాన్ని శాశ్వతంగా తుదముట్టించడానికే ఈ చర్య తీసుకున్నట్టు మోడీ చెబుతున్నారు.

సౌరాలో మోడీ చర్యను ఎవరూ సమర్ధించడం లేదు. రాయిటర్ సంస్థ రెండు డజన్లు పైగా స్థానికులను ఇంటర్వ్యూ చేసింది. ఇప్పుడు ప్రధాని నరేంద్రమోడీ క్రూరత్వం నడుస్తోందని స్థానికుల నోటంట ఒకే మాట వినిపిస్తోంది. రాజ్యాంగ పరమైన మార్పుల వల్ల స్థానికేతరులు ఇక్కడ ఆస్తులు కొనుగోలు చేసుకోవచ్చు. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. దీని వల్ల ఈ ప్రాంతంలో భారత ప్రభుత్వ, హిందువుల ప్రాబల్యం పెరిగి పోతుందని కొందరు హిందువులు ఆందోళన వ్యక్తం చేశారు. వాస్తవాధీన రేఖను గస్తీకాస్తున్నట్టుగా మాకనిపిస్తోందని ఎజాజ్ అన్నారు, వాస్తవాధీన రేఖ వద్ద గడిచిన కొన్ని దశాబ్దాలుగా భారత్, పాక్ దళాల మధ్య ఉద్రిక్తత ఏర్పడుతున్న సంగతి తెలిసిందే. గడిచిన వారం రోజుల్లో పారా మిలటరీ దళాల ఘర్షణలో డజన్ల కొద్దీ స్థానికులు గాయపడ్డారని సౌరా ప్రాంత ప్రజలు చెప్పారు. ఈ ప్రాంతంలో ఎంత మందిని నిర్బంధంలోకి తీసుకున్నదీ స్పష్టంకాలేదు. రాయిటర్ ప్రతినిధి ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు కాశ్మీర్ ప్రభుత్వ అధికార ప్రతినిధి నిరాకరించారు. సౌరా ప్రాంత ప్రజలకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, ఈ మెయిల్స్ చేరడం లేదు. ప్రభుత్వం నిరోధిస్తోంది.

రోజూ యుద్ధాలే

శ్రీనగర్ లో నలుగురు కన్నా ఎక్కుమంది ప్రజలు గుమిగూడరాదని ప్రభుత్వం ఆంక్షలు విధించింది. పెక్కు చోట్ల రోడ్ బ్లాకేడ్ లు ఏర్పాటు చేసింది. 500 మంది పైగా రాజకీయ నాయకులను నిర్బంధించింది. సామాజిక ఉద్యమ నాయకుల ఇంటర్నెట్ సర్వీసులు, ఫోన్ లు నిలిపి వేసింది. గడిచిన రెండు వారాలుగా దేశంలోని ఇతర ప్రాంతాలతో కాశ్మీర్ కు సంబంధాలు తెగిపోయాయి. ప్రభుత్వ వ్యతిరేకులు ప్రదర్శనలు నిర్వహించేందుకు వీలు లేదు. ల్యాండ్ లైన్ ఫోన్ శ్రీనగర్ లోని పలు ప్రాంతాల్లో పునరుద్ధరించబడినా సౌరాలో మాత్రం ఇంకా పునరుద్ధరించబడలేదు. స్థానికులు బృందాలుగా తిరుగుతూ, భద్రతా దళాలు కనిపించగానే మసీదుల్లోకి వెళ్ళిపోతున్నారు. మసీదుల్లో హోరెత్తించే రీతిలో ప్రార్థన గీతాలు వినిపిస్తున్నారు. అక్రమంగా ఆక్రమించకున్న వారికి వ్యతిరేకంగా గీతాలు వినిపిస్తున్నారు.

సౌరా ప్రాంతంలో ఎక్కువ మంది మధ్యతరగతికి చెందిన వారే. భారత భద్రతా దళాల పై ప్రయోగించేందుకు ఇటుకలను, రాళ్ళను పేర్చి ఉంచారు.

ఒక బారికేడ్ వద్ద ఒక వైర్ ను ఉంచారు. భద్రతా దళాలనుంచే ఈ వైర్ ను తాము సంపాదించినట్టు యువకులు చెప్పారు. ఈనెల 9వ తేదీన నిరసన ప్రదర్శన జరిగింది. పదివేల మంది పాల్గొన్నారు. దాంతో 150 నుంచి 200 మంది భద్రతా దళాలు ఆ ప్రాంతంలో ప్రవేశించేందుకు ప్రయత్నించినట్టు స్థానికులు చెప్పారు. ప్రదర్శకులపై పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. ఆరోజు రాత్రి పొద్దు పోయే వరకూ ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి.అయితే, అక్కడ నిరసనలు ఏవీ జరగలదేని ప్రభుత్వం మొదట్లో ఖండించింది. అయితే, ఆ తర్వాత వెయ్యి నుంచి పదిహేను వేల మంది వరకూ గుమిగూడారని అంగీకరించింది. ఈ ప్రదర్శనకు సంబంధించి టీవీ ఫుటేజ్ బీబీసీలోనూ, అల్ జజీరా టీవీలోనూ ప్రసారం అయింది.

అప్పటి నుంచి సౌరా ప్రాంతంలో చిన్న ప్రదర్శనలే జరుగుతున్నాయి. రోజూ భద్రతా దళాలతో ఘర్షణలు జరుగుతున్నాయి. సౌరా ప్రాంతంలోకి అడుగు పెట్టేందుకు భద్రతా దళాలు అనేక ప్రయత్నాలు చేశారనీ,ఇప్పటికీ చేస్తున్నారని స్థానికులు చెప్పారు. ప్రదర్శకులు కలుసుకునే ప్రదేశమైన జీనాబ్ సాహిబ్ పక్కప్రాంతంలోకి ఎవరూరాకుండా సీల్ చేసారు. రోజూ మాపై దాడి చేసేందుకు భద్రతా దళాలు ప్రయత్నిస్తున్నాయి. బందీలుగా ఉన్న భావం కలుగుతోంది. అని ఒవైసీ అనే ఇరవై ఏళ్ళ యువకుడు అన్నాడు. ఈ ప్రాంతంపై తిరిగి పట్టును సాధించేందుకు తాము కృత నిశ్చయంతో ఉన్నట్టు పారా మిలటరీపోలీసు అధికారి ఒకరు చెప్పారు. ఈ ప్రాంతంలో కొందరు యువకులు ఉడుకురక్తంతో ఉన్నారు. తిరుగుబాటు చేసేందుకు సంసిద్ధంగా ఉన్నారు.

డ్రోన్ లు , హెలీకాప్టర్లు

కాశ్మీర్ లో గడిచిన మూడు దశాబ్దాల్లో వేర్పాటు వాదులు భద్రతాదళాలతో జరిపిన అంతర్యుద్ధంలో 50 వేల మంది పైగా మరణించారు. మృతుల సంఖ్య ఇంకా ఎక్కువ ఉంటుందని మానవహక్కుల సంఘాల వారు అంటున్నారు. చాలా మంది కాశ్మీరీలు స్వాతంత్ర్యాన్ని కోరుకుంటున్నారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు భద్రతాదళాలపై దాడులకు తామే బాధ్యలమని బహిరంగంగానే ప్రకటించారు. చారిత్రకంగా చూస్తే కాశ్మీర్ లో జరిగే వేర్పాటు, ఉగ్రవాదాలకు పాక్ కేంద్రంగా పని చేస్తున్న సంస్థలదే బాధ్యత.సౌరాలో ఇస్లామిక తీవ్రవాదుల మద్దతు ఏమేరకు ఉందో తెలియదు. కానీ, హిజ్ బుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హాన్ వనీ భారత సరిహద్దులలోపలే జన్మించాడు. సౌరా ప్రాంతంపై డ్రోన్ లు, హెలికాప్టర్ల ద్వారా భద్రతాదళాలు నిఘా వేసిఉంచాయి. దాడుల భయంతో శాలువలు, తివాచీలు అమ్మే వర్తకులు తమ దుకాణాలను మూసేస్తున్నారు. షేర్ ఏ కాశ్మీరీ మెడికల్ ఇనిస్ట్యూట్ పై భారత భద్రతాదళాలు నిఘా వేసిఉంచాయి. గాయపడిన ప్రదర్శకుల కోసం కాపు కాసి ఉంటున్నారు. భద్రతా దళాలు అరెస్టు చేస్తాయేమోనన్న భయంతో ప్రమాదకర పరిస్థితుల్లో తప్ప హమీద్ అనే ఫిజియోథెరిపిస్టు చెప్పారు.

గాయపడిన నిరసనకారులను అరెస్టు చేయాలనే లక్ష్యంతో స్థానిక దవాఖాన, షేర్‌-ఇ-‌కశ్మీర్‌ ఇన్‌స్టూట్‌ ఆఫ్‌ ‌మెడికల్‌ ‌సైన్సెస్‌పై భారత భద్రతా దళాలు నిశితంగా గమనిస్తున్నాయని కొందరు స్థానికులు తెలిపారు. భద్రతా దళాలు కాల్చిన పెల్లెట్లు దెబ్బతిన్న ప్రజలు అదుపులోకి తీసుకుంటారనే భయంతో వారు దవాఖానలకు వెళ్లడం మానేశారు. ‘ఇది ఏదో తీవ్రంగా లేదా కంటికి తగిలితే తప్ప మేము దవాఖానకి వెళ్ళము’’ అని గాయపడిన వారికి సహాయం చేస్తున్న ఫిజీయోథెరపిస్టు యావర్‌ ‌హమీద్‌ అన్నారు. రెండు అంతస్థుల చెక్క ఇంటిలో, 45 ఏళ్ల బషీర్‌ అహ్మద్‌పై హమీద్‌ ‌వంగి, అహ్మద్‌ ఎడమ కన్ను దగ్గర ఉన్న గుళికల గాయాన్ని బెటాడిన్‌ ‌క్రిమిసంహారక మందులో ముంచిన పత్తి ఉన్నితో శుభ్రం చేశారు. అయితే 23 ఏళ్ల హమీద్‌కు పెల్లెట్లు గాయాలకు చికిత్స కోసం శిక్షణ లేదని తెలిపారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!