Take a fresh look at your lifestyle.

కశ్మీర్‌ ‌ప్రశాంతంగా ఉంది

ఒక్క బుల్లేట్‌ ‌పేల్చలేదు..
ఒక్క ప్రాణం పోలేదు
ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలంటే చాలా ధైర్యం కావాలి
దీంతో భారత్‌పై ప్రపంచ దేశాల వైఖరిలో మార్పు వచ్చింది
:కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా

జమ్మూకశ్మీర్‌లో పరిస్థితిపై ఎలాంటి ఆందోళనలు అవసరం లేదని, అక్కడంతా ప్రశాంతంగా ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో అమిత్‌షా మాట్లాడారు.. ఆగస్టు 5నుంచి ఇంతవరకూ అక్కడ ఒక్క బుల్లేట్‌ ‌పేల్చలేదని, ఒక్క ప్రాణం కూడా పోలేదని అన్నారు. కశ్మీర్‌ ‌ప్రశాంతంగా ఉందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం 2016లో మెరుపుదాడులు (సర్జికల్‌ ‌స్టైక్్ర‌ ‌చేసినప్పుడు యాధాలాపంగా జరిగినట్టుగానే చాలామంది భావించారని, అయితే ఇటీవల 370 అధికరణ రద్దు తర్వాత దేశ రక్షణ విధానాలపై వారందరికీ చాలా స్పష్టత వచ్చిందని అమిత్‌షా అన్నారు. మెరుపుదాడులు, వాయిదాడులు ప్రజలకు సంతోషం కలిగించి ఉండవచ్చనీ, అయితే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలంటే మాత్రం చాలా దైర్యం కావాలని అన్నారు. ఆ నిర్ణయం తర్వాత భారత్‌పై ప్రపంచ దేశాల వైఖరిలో మార్పు వచ్చిందని చెప్పారు. కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పిస్తూ, యూపీఏ హయాంలో ప్రతిరోజూ అవినీతి, సరిహద్దుల్లో అభద్రత, సైనికుల తలలు నరికివేత, మహిళలకు కొరవడిన రక్షణ, ప్రతిరోజూ రోడ్లపైకి జనం వచ్చి నిరసనలు తెలపడం వంటి వార్తలు చోటుచేసుకుంటూ ఉండేవని అమిత్‌షా విమర్శించారు. ప్రధాని ఒకరు ఉన్నప్పటికీ ఏ ఒక్కరూ ఆయనను ఖాతరు చేయకుండా తామే ప్రధానులుగా భావించుకుని పాలన సాగించారని కాంగ్రెస్‌ ‌హయాంపై చురకలు వేశారు. గత ప్రభుత్వాల

మాదిరిగా కాకుండా మోదీ సర్కార్‌ ఓటు బ్యాంకును ఆశించకుండా ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటూవచ్చారని చెప్పారు. గత ప్రభుత్వానికి ఒక నిర్ణయం తీసుకునేందుకు 30ఏళ్లు పడితే, తమ ప్రభుత్వం గత ఐదేళ్లలో జీఎస్‌టీ, పెద్ద నోట్ల రద్దు, వాయుదాడులు సహా 50కి పైగా కీలక నిర్ణయాలు తీసుకుందని షా చెప్పారు. ఆర్థికంగా భారత్‌ ఎదుగుతోందని, వ్యవసాయరంగం, తలసరి ఆదాయం కూడా పెరుగుతోందని, 5 ట్రిలియన్‌ ‌డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా పురోగమిస్తున్నామని అమిత్‌షా చెప్పారు. 2024 నాటికి ఆ లక్ష్యం సాధించి తీరుతామనే నమ్మకం తనకు ఉందని అమిత్‌షా ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy