వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

కశ్మీర్‌ అం‌శంపై జోక్యం అవసరం లేదు

August 26, 2019

జీ7 సదస్సు సందర్భంగా ట్రంప్‌తో మోదీ
భారత్‌, ‌పాకిస్తాన్‌ ‌మధ్య సమస్యలను తమకుతాముగానే పరిష్కరించుకోగలమని, దానికి మూడో వ్యక్తి జోక్యం అవసరం లేదని భారత ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి స్పష్టం చేశారు. జీ7 సదస్సులో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ‌ట్రంప్‌ ‌సమావేశమయ్యారు.
కశ్మీర్ అంశం పై ప్రధాని మోడీ మాట్లాడుతూ .. భారత్‌, ‌పాకిస్తాన్‌ ‌మధ్య ఎన్నో ద్వైపాక్షిక అంశాలున్నాయి. పాక్‌ ఎన్నికల్లో గెలిచిన తర్వాత నేను ప్రధాని ఇమ్రాన్‌ ‌ఖాన్‌కు ఫోన్‌ ‌చేశాను. పాక్‌ ‌పేదరికంతో పోరాడాలి, భారత్‌ ‌కూడా. భారత్‌-‌పాక్‌ ‌నిరక్షరాస్యత, వ్యాధులపై కూడా పోరాడాలని చెప్పాను. పేదరికం సహా, అన్ని సమస్యలపై మనం కలిసి పోరాడదాం అని చెప్పాను. రెండు దేశాల ప్రజల సంక్షేమం కోసం కలిసి పనిచేద్దాం అని చెప్పాను. అధ్యక్షుడు ట్రంప్‌తో కూడా ఎప్పుడూ ఈ ద్వైపాక్షిక సంబంధాలపై మాట్లాడుతూనే ఉన్నాను. భారత్‌, ‌పాక్‌ ‌మధ్య ఉన్న అన్ని సమస్యలు ద్వైపాక్షికం. అందుకే మేం ప్రపంచంలోని ఏ దేశాన్నీ దానికోసం ఇబ్బందిపెట్టం. భారత్‌-‌పాకిస్తాన్‌ 1947‌కు ముందు కలిసే ఉన్నాయి. మా రెండు దేశాలూ కలిసి మా సమస్యలపై చర్చించుకోగలం, దానికి పరిష్కారం కూడా వెతకగలమనే నమ్మకం నాకుంది అని తెలిపారు .అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ ..మా మధ్య మంచి సంబంధాలున్నాయి. కాబట్టే నేను ఇక్కడున్నా. వాళ్లు చాలా రోజుల నుంచీ అలా చర్చలు జరుపుతున్నారు. ఈ సమస్యలను వారే పరిష్కరించుకుంటారని భావిస్తున్నాను..అని అన్నారు.