Take a fresh look at your lifestyle.

కవితమ్మా…. ముందు మీ తండ్రిని నిలదీయ్‌

  • ‌మహిళలకు 33 శాతం అసెంబ్లీ టిక్కెట్లు ఎందుకియ్యలేదో అడుగు
  • తొలి కేబినెట్‌ ‌లో ఒక్క మహిళకు కూడా చోటెందుకు ఇవ్వలేదో చెప్పమను
  • మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే నోరెందుకు విప్పడం లేదో ప్రశ్నించు
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌ఫైర్‌
జగిత్యాల,ప్రజాతంత్ర,మార్చి 3: మహిళా బిల్లు విషయంలో కేసీఆర్‌ ‌బిడ్డ ఢిల్లీలోని జంతర్‌ ‌మంతర్‌ ‌వద్ద ధర్నా చేస్తానని చెప్పడం చూస్తే నవ్వొస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్‌ ‌కుమార్‌ ఎద్దేవా చేశారు. ‘‘జంతర్‌ ‌మంతర్‌ ‌దగ్గర తరువాత ధర్నా చేయ్‌… ‌ముందు మీ తండ్రిని నిలదీయ్‌. ‌మీ పార్టీలో ఎంత మంది మహిళలకు చోటు ఇచ్చారో చెప్పమను. మీ ప్రభుత్వంలో మహిళలెంత మంది ఉన్నరు? మహిళలంటే ఎందుకంత కక్ష? పోయిన కేబినెట్‌ ‌లో మహిళలకు ఎందుకు చోటివ్వలేదు. మహిళా గవర్నర్‌ ‌ను ఎందుకు అవమానిస్తున్నవ్‌? ‌మహిళలపై అత్యాచారాలు, హత్యలు చేస్తే ఎందుకు స్పందించవ్‌? ‌పార్లమెంట్‌ ‌లో మహిళా బిల్లును ప్రవేశపెడితే ఆ కాపీలను చించిపారేసిన పార్టీలతో ఎందుకు దోస్తానా చేస్తున్నవో నిలదీయ్‌…’’అం‌టూ సవాల్‌ ‌విసిరారు. శుక్రవారం కరీంనగర్‌, ‌జగిత్యాల జిల్లాలో వివిధ అభివృద్ధి పనులకు హాజరైన బండి సంజయ్‌ ‌మధ్యాహ్నం జగిత్యాల పట్టణంలోని మున్సిపల్‌ ‌మాజీ ఛైర్‌ ‌పర్సన్‌, ‌బీజేపీ
నేత బోగ శ్రావణి నివాసంలో అధ్యక్షులు సత్యనారాయణ, శ్రావణిలతో కలిసి మీడియాతో మాట్లాడారు.జంతర్‌ ‌మంతర్‌ ‌వద్ద కేసీఆర్‌ ‌బిడ్డ ధర్నా చేస్తానంటే మహిళలు నవ్వుకుంటున్నరు.
అని చెబుతూ మెడికో ప్రీతినాయక్‌ ‌చనిపోతే, నిర్మల్‌ ‌లో బాలికపై మీ పార్టీ నేతే అత్యాచారం చేస్తే కనీసం మీ తండ్రి స్పందించరు. గంటకో లైంగిక వేధింపు, పూటకో అత్యాచారం, రోజుకో హత్య జరుగుతుంటే ఎందుకు నోరు విప్పడనం లేదని మీ తండ్రిని నిలదీసే ధైర్యముందా? అని ప్రశ్నించారు. నేషనల్‌ ‌క్రైమ్‌ ‌బ్యూర్‌ ‌రికార్డస్ ‌ప్రకారం తెలంగాణలో నేరాల సంఖ్య 17 శాతం పెరిగింది. హత్యలు, అత్యాచారాలకు కేరాఫ్‌ అ‌డ్రస్‌ ‌తెలంగాణగా మారింది. హత్యలు, అత్యాచారాలు చేసేటోళ్లలో ఎక్కువ మంది బీఆర్‌ఎసోళ్లే. ఎవరైనా ఇతరులు అత్యాచారాలు చేసి బీఆర్‌ఎస్‌ ‌లో చేరితే వాళ్ల కేసులు మాఫీ చేస్తున్నరు. పైగా అత్యాచారాలు, హత్యలు చేసేటోళ్లను హీరోలుగా చిత్రీకరిస్తున్నరు..అని బండి సంజయ్‌ అన్నారు.బీజేపీ అధికారంలోకి వస్తే మహిళలపై అత్యాచారాలు, హత్యలు చేసే వాళ్లకు చుక్కలు చూపిస్తాం…అని పేర్కొంటూ వాళ్ల అంతు చూస్తాం. యూపీ తరహాలో వాళ్ల ఇళ్లు కూల్చేస్తాం. యూపీలో అట్లాంటోళ్లు బెయిల్‌ ‌వచ్చినా బయటకు రావాలంటే గజగజ వణికిపోతున్నరు.
మరి తెలంగాణలో అత్యాచారాలు, హత్యలు చేస్తుంటే కేసులెందుకు నీరుగారుస్తున్నరు? శిక్షలు ఎందుకు పడటం లేదో ప్రజలు ఆలోచించాలి..అని బండి సంజయ్‌ ‌నిలదీశారు. గ్యాస్‌ ‌ధరల పెంపుపై బీఆర్‌ఎస్‌ ‌నేతలు ధర్నాలు చేయడం సిగ్గు చేటు. టీఆర్‌ఎస్‌ ‌కు సిగ్గుండాలి.. పెట్రోలు, డీజిల్‌ ‌ధరలు ఇతర రాష్ట్రాల్లో ఎట్లున్నయ్‌.. ‌తెలంగాణ కంటే 15 రూపాయలు తక్కువ ఎందుకున్నయ్‌? ‌కరెంట్‌ ‌ఛార్జీలు 10 సార్లు పెంచారు. 7 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచిండ్రు. నల్లా ఛార్జీలు, రిజిస్ట్రేషన్లు పెంచి జనాన్ని బాదుతున్నరు. వీటిపై మీరెందుకు ధర్నా చేయలేదు? బీజేపీ అధికారంలోకి వస్తే కచ్చితంగా ఆ మేరకు పెట్రోలు, డీజిల్‌ ‌ధరలు తగ్గిస్తం.. గ్యాస్‌ ‌ధరలు పెరిగినందుకు మేం కూడా బాధపడుతున్నాం. కానీ రష్యా -ఉక్రెయిన్‌ ‌యుద్దం వల్ల చమురు కొరత ఏర్పడటంతో ధరలు పెరిగాయనే విషయం ప్రజలకు తెలుసు.. అని బండి సంజయ్‌ అన్నారు.
మద్యం వ్యాపారంలో.. కవిత కీలక  సూత్రధారి
రాష్ట్రంలో మహిళల సమస్యలపై ఎందుకు స్పందించలే
మహిళా గవర్నర్‌ను అవమానిస్తున్నా ఎందుకు మౌనం
కవిత తీరుపై మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌
image.png‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి3: మద్యం వ్యాపారంలో పాత్రధారి, సూత్రధారి కవిత అని,బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత పై బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే   ఎన్వీఎస్‌ఎస్‌ ‌ప్రభాకర్‌  ‌తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం డియాతో మాట్లాడుతూ…లిక్కర్‌ ‌స్కాం లో అరెస్టు అయితే సింపతీ కోసం రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై స్పందించని కవిత మహిళా హక్కుల కోసం పోరాడుతాననడం విచిత్రంగా ఉందని యెద్దేవా చేశారు. మహిళా గవర్నర్‌పై నీచమైన పరుషపదజాలం వాడుతున్నా పట్టించుకోని కవిత ఢిల్లీలో ధర్నా చేస్తుందట అని అన్నారు. కవిత ఓ మహిళా ద్రోహి అని… మహిళల ఉసురు తగులుతుందని బీజేపీ నేత శాపనార్దాలు పెట్టారు.
కేసీఆర్‌  ‌ప్రగతి భవన్‌ ‌నుంచి ఏడడుగులు వేసి.. గవర్నర్‌కు అనుమానాలు నివృత్తి చేస్తే బిల్లులు ఓకే అవుతాయన్నారు. అయితే రాజకీయాల కోసమే ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కరెంట్‌, ‌నీటి బిల్లులు పెంచిందని వాడటం మానేస్తారా బీఆర్‌ఎస్‌ ‌నేతలు  అని ప్రశ్నించారు. ప్రజలు బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వాన్ని గద్దె దింపి తన నిరసన చెబుతారన్నారు. సామాన్య ప్రజల కొనుగోలు శక్తి పెరిగిందన్నారు. గ్యాస్‌ ‌ధరల పెంపు ఆయిల్‌ ‌కంపెనీలు పెంచుతాయని… అయినా ధరలు పెరగకుండా చూడమని మోదీ  ఆర్థిక మంత్రికి సూచించారని ఎన్వీఎస్‌ఎస్‌ ‌ప్రభాకర్‌ ‌పేర్కొన్నారు.

Leave a Reply