Take a fresh look at your lifestyle.

కలుషిత ఆహారంతో.. కస్తూరిభా విద్యార్థులకు అస్వస్థత

ఆస్పత్రిలో విద్యార్థులను పరామర్శిస్తున్న అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్‌

ఆస్పత్రిలో విద్యార్థులను పరామర్శిస్తున్న అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్‌

పదర మండలానికి చెందిన కస్తూరిభా విద్యాలయంలో కనీస వసతులతో పాటు, సరైన ఆహారం అందక పిల్లలు అవస్థలకు గురవుతున్నారు. బుధవారం కొందరు తీసుకున్న ఆహారం కలుషితం కావడంతో అస్వస్థతకు గురై ఆసుపత్రుల పాలు కావడం విశేషం. వివరాలిలా నూతనంగా ఏర్పాటైన పదర మండల కస్తూరిభా పాఠశాలను అమ్రాబాద్‌ ‌మండల ఫరిధిలోని మన్ననూర్‌ ‌గ్రామంలో గల ఒక భవనంలో నడుపుతున్నారు. ఈ భవనం శిథిలమయి, అవసరమైన కనీస వసతులు కూడా లేకపోవడం చుట్టూ ప్రహరి గోడ లేని కారణంగా పందులు, కుక్కలు ఇనుప కంచెతో ఏర్పాటు చేసిన దానినుండి ఈ పాఠశాలలోకి ప్రవేశించి పిల్లలతో సహచర్యం చేస్తూ వారిని రోగాల పాటు చేస్తున్నాయి. బాలికలకు సరైన మూత్రశాలలు లేక పోవడం నీటి పారుదల సక్రమంగా లేక పోవడంతో చుట్టూ మురుగు నీరు ప్రవహిస్తుంది. వీటిలో పందులు, కుక్కలు పొర్లి పాఠశాలలో విచ్చల విడిగా సంచరిస్తున్నాయి. ఇక్కడ దోమలకు కొదవలేదు. విద్యార్థులకు సరిపడా గదులు, స్థలం లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా మంగళవారం కొందరు విద్యార్థులు ఇక్కడి చిత్తడి వాతావరణం నచ్చక రాత్రి భోజనం చేయలేదు. ఉదయాన్నే ఉప్మా చేయడంతో దాన్ని తిన్న దాదాపు 07 మంది విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. దీన్ని గమనించిన పాఠశాల ప్రత్యేకాధికారి శారధ వారిని చిత్స కోసం అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో వారికి చికిత్స నిర్వహించిన డాక్టర్లు భాగానే ఉన్నట్లు తెలిపారు. కాగా ఇక్కడి సమస్యలపై విద్యార్థులు తీవ్ర మనస్తాపం చెంది కొందరు పాఠశాలనుండి వెళుతున్నారు. తమ పిల్లల పట్ల అధికారులు చూపుతున్న నిర్లక్ష్యానికి తల్లిదండ్రులు తీవ్ర మనోవేధన చెంది తమ పిల్లలను ఇంటికి తోటుకెళుతున్నట్లు ప్రాథమిక సమాచారం. ఈ సంఘటనపై స్పందించిన ఆర్డిఓ పాండు, అమ్రాబాద్‌ ‌తహశీల్దార్‌ ‌సురేష్‌ ‌కుమార్‌ ‌పాఠశాలను సంధర్శించి ఇక్కడి వసతులపై విద్యార్థులను విచారించారు. త్వరలోనే న్యాయం చేసేలా అధికారులకు సూచిస్తానని ఆయన తెలిపారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!