Take a fresh look at your lifestyle.

కరోనా వ్యాక్సిన్‌ ‌ 60 ‌లక్షల డోసులు కావాలి

ప్రధానికి సీఎం వైఎస్‌ ‌జగన్‌ ‌లేఖ..

కరోనా వ్యాక్సిన్‌ ‌డోస్‌ల కొరత వేధిస్తున్న తరుణంలో రాష్ట్రానికి 60లక్షల డోసులు కావాలని కేంద్రానికి సిఎం జగన్‌ ‌లేఖ రాసారు. దీనిపై ఇప్పటికే పలు దఫాలుగా కేంద్రానికి లేఖలు రాసింది ఏపీ సర్కార్‌.. ‌రెండు రోజుల క్రితమే కోవిడ్‌ ‌వ్యాక్సిన్‌ ‌నిల్వలు జీరోకు పడిపోగా.. తాజాగా 6 లక్షల డోసులు రానున్నాయి.. దీంతో  కరోనా వ్యాక్సిన్‌ ‌కోసం ప్రధాని నరేంద్ర మోడీకి లేఖరాశారు. 60 లక్షల డోసులు ఇస్తే 45 ఏళ్లు పైబడిన అందరికీ మొదటి డోసును మూడు వారాల్లో పూర్తి చేస్తామని ప్రధాని రాసిన లేఖలో పేర్కొన్న సీఎం జగన్‌.. ఒకే రోజులో రాష్ట్రంలో 6, 28, 961 మందికి వ్యాక్సినేషన్‌ ‌చేశామని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.. ఇక, కోవిడ్‌ ‌నివారణకు ప్రధాని తీసుకుంటున్న చర్యలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందని లేఖలో ప్రధానిని అభినందించారు సీఎం వైఎస్‌ ‌జగన్‌. ‌మరో 5 లక్షల కొవిడ్‌ ‌టీకాలు కోవిషీల్డ్  ‌పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్‌ ‌నుంచి నేడు రానున్నాయి. శనివారం గన్నవరంలోని టీకా నిల్వ కేంద్రానికి టీకా డోసులు చేరనున్నాయి. రెండు రోజులుగా రాష్ట్రంలో కొవిడ్‌ ‌టీకాల కొరత ఏర్పడింది. దీంతో పలు జిల్లాల్లో టీకాల పంపిణీ నిలిచిపోయింది. అవసరాలకు తగ్గట్టు జిల్లా అధికారులు స్పష్టమైన వివరాలు ఇవ్వకపోవడంతో టీకాల పంపిణీ ఆలస్యమైనట్లు సమాచారం. టీకాలు రాగానే డిమాండ్‌ ఉన్న చోట పంపిణీ జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ వర్గాలు వివరించాయి.

Leave a Reply