Take a fresh look at your lifestyle.

కమస్కం

గిట్లైతే ఎట్లా..
మరీ గింత .. ఉంటే ఎట్లా..
కలం పట్టిన ఆలోచనలు కాగితసమజాన్ని అక్షరబద్ధం చేయడంలో తప్పులేదు..
బాధ హృదయాల వోదార్పు స్పందనైతే మరీ మంచిది….
అస్తిత్వ మూలాల మట్టి పరిమాలాలు
కొత్త కవి వృక్షాలకు నీరై.
కవిత్వ పువ్వులు వికసించి సాహితీ పరిమళాలు
నలుదిశల వ్యాపిస్తే…సంతోషం..

ఆవేదన తాలూకు వాక్యాలు సాగు చేయడం
వెనుక ఎన్ని కలత నిద్రలో కాలం నెట్టుకొచ్చిన కలాలు సిరాను కాగితానికి అద్దడంలోను
శరాలను ఎక్కుపెట్టి సంస్కరించడంలో
అనుమానించాల్సిన పనిలేదు…కానీ
ఇప్పుడు కొన్ని కవిపక్షులు..
ప్రశంసవృక్షాలను. బిరుదుకొమ్మలను
ఆశ్రయించి…
భవిష్య సన్మాన తాలూకు గూటిని నిర్మించుకునే
పవనాలు పత్రికలలో వీస్తున్నాయి…
కంటికి కొన్ని దృశ్యాలు కనిపిస్తున్న వాస్తవాలు…
ప్రత్యక్ష సాక్ష్యాలు….

కొన్నెమో..పసలేని ..వసలేనివి
పుట్టలో చిమలోచ్చినట్టు అంతర్జాల పత్రికలో
దినంకోటి వచ్చి పడితే చాలన్నట్టు..
మిగతా కవితలు అసులు రావద్దని
కొత్త కవిత ప్రళయానికి తాలలేమని
సందేహంలో  పత్రికల వఎ•ఱ.ఱ• లు కూడా  ఇవ్వని కవి వర్యులు…ఈ మధ్య పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చారు…మరీ గిట్లైతె..ఎట్లా..

అయ్య..రాయండి..!
మీ బాధ్యతతో,మీ భావమో.?
ప్రజాస్వామ్య హక్కో.. స్వెచ్చొ..  మీఇస్తమో? ఏదైతేనేం…ఒక్కసారి…
నవతరాన్న కవిత ఝరిలో తడుపుతున్న
కొన్ని కలాలను..పరికించండి…
సమస్తాన్ని త్యజించి సాహిత్యాఉనికిని కాపాడడంలో కాటికి దగ్గరున్న జానపదుల గతాలని తవ్వండి…
ఎన్నో అవార్డులు. సత్కారాలు గరికపోసగా
బావించి కాలగర్భంలో కలిసిన ఆలోచనల్ని..
కమస్కం..
వారి సాహిత్య కృషి..సమాజ బాధ్యతని పరిశీలించండి……
గొప్ప సాహిత్యం ఎప్పుడు
నాలుక- చేతికి రెంటికీ సమన్వయం సమాహారమే…కొన్ని మినహాయింపు ఉండొచ్చు…
జెర్ర…ఆ వైపుగా కొత్త ఔత్సాహికులను….
సాహిత్య తోటలో వికసించనివ్వండి..
– నాగరాజు మద్దెల
6301993211.

Leave a Reply