Take a fresh look at your lifestyle.

కమలాపూర్‌ ‌వైద్యాధికారినికి కొరోనా పాజిటివ్‌ ఆం‌దోళనలో మండల ప్రజలు

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కొరోనా మహమ్మారి కమలాపూర్‌ ‌మండల ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. కమలాపూర్‌ ‌ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారికి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ ‌గా నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు. వైద్యాధికారి కి అనుసంధానంగా ఉన్న మెడికల్‌ ‌సిబ్బందికి 15 మందికి పరీక్షలు నిర్వహించారు. కాగా మెడికల్‌ ‌సిబ్బంది కి పూర్తిగా నెగిటివ్‌గా  నిర్ధారణ కావడంతో వైద్య సిబ్బంది ఊపిరిపీల్చుకున్నా రు. ఇదిలా ఉండగా కమలాపూర్‌ ‌మండల కేంద్రానికి చెందిన ఒక ఎంపిటిసికి కొరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. స్థానిక ఎంపిటిసి అల్లుడు కొరోనాతో చికిత్స పొందుతుండగా ఎంపీటీసీ ఇటీవల కలిసి వచ్చాడని తెలిసింది. మండలంలో దేశాయిపల్లి, మాదన్నపేట్‌ ‌గ్రామాలకు చెందిన ఇద్దరికీ పాజిటివ్‌ ఉం‌డగా, గురువారం వైద్యాధికారికి, ఎంపిటిసికి కొరోనా పాజిటివ్‌ ‌చేరడంతో మండల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అంతేకాకుండా కమలాపూర్‌ ‌పెద్ద మార్కెట్‌ 9 ‌గంటల వరకు నడుస్తుంది. కాగా  మండల కేంద్రానికి చెందిన ఎంపిటిసికి పాజిటివ్‌ ‌వచ్చిందని పోలీసులకు సమాచారం తెలియడంతో పెద్ద మార్కెట్‌ను సాయంత్రం 5 గంటల వరకు మూసివేయించి అమ్మకందారులను తమ తమ ఇండ్లకు పంపించారు. శుక్రవారం నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు మార్కెట్‌ ‌నడుస్తుందని మండల ప్రజలకు సమాచారం అందజేశారు.

కొత్త పల్లి లో ఒకరికి పాజిటివ్‌
‌కమలాపూర్‌ ‌మండలం కొత్తపల్లె గ్రామానికి చెందిన 62 సంవత్సరాల వ్యక్తి జ్వరంతో బాధపడుతూ ఈనెల 7న ఎంజిఎం వరంగల్‌ ‌లో చికిత్స నిమిత్తం చేరారని, పరీక్షలు నిర్వహించగా గురువారం పాజిటివ్‌గా నిర్ధారించడం జరిగిందని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉప్పల్‌ ‌వైద్యాధికారి డాక్టర్‌ ‌శ్రీనివాస్‌ ‌తెలిపారు. కొత్తపల్లి గ్రామాన్ని సందర్శించి జ్వరం నిమిత్తం ఇంటింటి సర్వే  చేశామని, పాజిటివ్‌ ‌వచ్చిన వ్యక్తి ఇంటి సభ్యులను హోమ్‌ ‌క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. గ్రామంలో సోడియం హైపోక్లోరైట్‌ ‌ద్రావణాన్ని స్ప్రే  చేపించామన్నారు. గ్రామ ప్రజలకు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత మాస్క్‌ల ఉపయోగంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ ‌శ్రీనివాస్‌తో పాటు సర్పంచ్‌ ‌బండారి కళ్యాణి, సదాలక్ష్మి, ఏఎన్‌ఎం ‌మేరి, రజిత, దేవేంద్ర, ఆశలు కృష్ణవేణి, మంజుల, స్రవంతి, సరితగా, సర్పంచ్‌ ‌బండారి కళ్యాణి , గ్రామ  కార్యదర్శి వినిల్‌ ‌రెడ్డి, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.

Leave a Reply