Take a fresh look at your lifestyle.

కనీస ఆదాయ హామీ పథకానికి తగిన సమయం

ప్రజా సంక్షేమ పథకాలపై ప్రభావం ఒక మనిషికి ఒక రోజు ఆకలి తీర్చడానికి ఒక రోజు మాత్రమే చేప ఇవ్వగలవు. అదే అతడికి చేపను ఎలా పట్టుకోవాలో, ఎలా సేకరించాలో నేర్పితే జీవితాంతం అతడికి ఆహారాన్ని సమకూర్చినట్టు. ఒక మనిషిని స్వశక్తిపై ఆధారపడేట్టు చేయూత నివ్వగలిగితే జీవితాతం అతడికి ఉపయోగకరంగా ఉంటుంది. ఫెర్గ్యూసన్‌ ‌చెప్పింది ఇదే. న్యాయ్‌ ‌వంటి నినాదాల బదులు ఒక మనిషికి చేప ఇవ్వండి వంటి నినాదాలు సమంజసంగా ఉంటాయి. ప్రభుత్వ సహాయం అర్హులకు అందించినట్టు అవుతుంది. సమాజంలో ఆర్థికంగా అట్టడుగు స్థాయిలో ఉన్నాడన్న కారణంగా చేయూతనివ్వడం కన్నా, చేసిన పనికి తగిన ప్రతిఫలం అందించే రీతిలో ప్రభుత్వ సాయం అందాలి. రుణంగానో, ఉదారంగానో ఇవ్వడం కన్నా, అతడి కాయకష్టానికి తగిన ప్రతిఫలాన్ని అందించినట్టు అవుతుంది. ఉచితంగా ఇవ్వడం వల్ల సోమరితనాన్ని పెంచినట్టు అవుతుంది. పరాధీనతను పెంచినట్టు అవుతుంది. సామాజిక రుగ్మతలకు ఆస్కారం కలిగించినట్టు అవుతుంది

అంతర్జాతీయంగా పలు దేశాల్లో నెలకొన్న ధోరణుల నేపథ్యంలో భారత దేశంలో కనీస ఆదాయ పథకానికి తగిన సమయం ఆసన్నమైంది. అయితే, ఈ పథకాన్ని అమలులో పెట్టేవిషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఆరంభంలో మల్లగుల్లాలు పడిన తర్వాత కాంగ్రెస్‌ ‌పార్టీ ఎట్టకేలకు ఈ పథకాన్ని ప్రకటించింది. దీనిని పార్టీ 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపర్చింది. నియంతమ్‌ ఆయ్‌ ‌యోజన(న్యాయ్‌) అనే ఈ పథకంపై ప్రతిస్పందనలు ఊహించినట్టే వస్తున్నాయి. ది ఎకనామిక్‌ ‌టైమ్స్ ఈ ‌పథకంపై రాసిన సంపాదకీయంలో ఈ పథకంపై స్పందనలను ఉటంకిస్తూ ఇది ఆకర్షణీయమైన పొరగప్పిన గుళికలా ఉందని వ్యాఖ్యానించింది. ఈ వాగ్దానం అరచేతిలో చందమామను తెచ్చి పెడతానన్న వాగ్దానానికీ, ఉన్మాదికీ మధ్య ఉందని పేర్కొంది. సమాకాలీన సమాజంలో ఒక కుటుంబానికి నెలకు 12 వేల రూపాయిల ఆదాయం ఉండి తీరాలి. ఆ లెక్కన చూసుకుంటే కాంగ్రెస్‌ ‌చేసిన వాగ్దానం నయా చందమామలాంటిదేమీ కాదు. జనాభాలో 20 శాతానికి మించకుండా ఎంపిక చేసిన కుటుంబాలకు నెలకు ఆరువేల వంతున ఇవ్వడం లో పెద్ద ఉదారత ఏమీ లేదు. అందునా పేదరికం తాండవిస్తున్న బారత దశలో అదేమీ విశేషం కాదు. అలాగే, నయా పథకం ఉన్మాదికి చేరువలోనూ లేదు. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ధోరణులకు అనుగుణంగా నగదు బదిలీ ద్వారా పౌరులందరికీ కనీస ఆదాయాన్ని సమకూర్చడం దీని ముఖ్యోద్దేశ్యం. ఇలాంటి పథకాలు యూరప్‌లోనూ ఇంకా చెప్పాలంటే యునైటెడ్‌ ‌కింగ్‌ ‌డమ్‌లోనూ ఉన్నాయి.
జేమ్స్ ‌ఫెర్గ్యూసన్‌ అనే సామాజిక శాస్త్రవేత్త ఆఫ్రికన్‌ ‌దేశాల పరిస్థితి నేపథ్యంలో కనీస ఆదాయం, నగదు బదిలీ వంటివన్నీ ఒక మనిషికి చేపను ఇవ్వడం వంటిదిగా తన తాజా పుస్తకంలో పేర్కొన్నారు. ఆయన వాదాలన్నీ మన దేశ పరిస్థితులకు ప్రధానాంశాలుగానే ఉంటాయి. ఒక వేళ 2019 మే 23వ తేదీన కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినా కాంగ్రెస్‌ ‌దార్శనిక పత్రం న్యాయ్‌ ‌వెంటనే అమలులోకి రాదు. కనీస ఆదాయ పథకం కోసం జనం ఉవ్వీళురుతున్న మాట నిజమే. వచ్చే నెలలో ఏ పార్టీ లేదా కూటమి అధికారంలోకి వచ్చినా ఇలాంటి పథకం కోసం జనం ఎదురు చూస్తారు. ఫెర్గ్యూసెన్‌ ‌రాసిన పుస్తకం వ్యాఖ్యాతలకూ, విద్యావేత్తలకూ, అభివృద్ధి పథకాల విశ్లేషకులకూ ఒక ప్రశ్న విసురుతోంది. సామాజిక భద్రత, నయా ఉదార వాదం ఏ విధంగా పెరిగిపోతోందోనన్నదే. స్వేచ్ఛా మార్కెట్‌, ‌నయా ఉదారవాదం ప్రాబల్యం పెరిగి పోతున్న తరుణంలో ప్రభుత్వ విధానాల్లో ఉద్దీపనలు, సంక్షేమ పథకాలపై ఎక్కువ వ్యయాలు ఎందుకని. నయా ఉదారవాదం సంక్షేమ పథకాలను చుట్టచుట్టేయడం లేదా వాటిపై వ్యయాలను తగ్గించడం. అయితే అందుకు భిన్నంగా సర్వత్రా కనిపిస్తోంది.
ఈ విధానాలు నయా ఉదారవాద విధానాలంత మెరుగులతో నిండినవి కావు. సూక్ష్మ రుణాలు, లేదా సూక్ష్మ పరపతి వంటివి కావు. వాటికి పూర్తిగా భిన్నమైనవి. పేదలకు ఉచితంగా నగదు చెల్లించడం వంటిది. అంతేకాక ఈ నగదును కాయకష్టం చేసుకోగలిగిన వారికి ఇవ్వనున్నారు. సంప్రదాయకంగా కార్మికుడు, ఉత్పత్తిదారుడు వంటి వర్గాలు మాత్రమే మన సమాజంలో ఉన్నాయి. అయితే, వయసు పైబడిన వారు, ఒంటరిగా ఉన్న తల్లులు వంటి వారికి ఆసరా అవసరం?
గ్లోబల్‌ ‌సౌత్‌లో కొత్త సంక్షేమ రాష్ట్రం
ప్రజా సంక్షేమ పథకాలపై ప్రభావం ఒక మనిషికి ఒక రోజు ఆకలి తీర్చడానికి ఒక రోజు మాత్రమే చేప ఇవ్వగలవు. అదే అతడికి చేపను ఎలా పట్టుకోవాలో, ఎలా సేకరించాలో నేర్పితే జీవితాంతం అతడికి ఆహారాన్ని సమకూర్చినట్టు. ఒక మనిషిని స్వశక్తిపై ఆధారపడేట్టు చేయూత నివ్వగలిగితే జీవితాతం అతడికి ఉపయోగకరంగా ఉంటుంది. ఫెర్గ్యూసన్‌ ‌చెప్పింది ఇదే. న్యాయ్‌ ‌వంటి నినాదాల బదులు ఒక మనిషికి చేప ఇవ్వండి వంటి నినాదాలు సమంజసంగా ఉంటాయి. ప్రభుత్వ సహాయం అర్హులకు అందించినట్టు అవుతుంది. సమాజంలో ఆర్థికంగా అట్టడుగు స్థాయిలో ఉన్నాడన్న కారణంగా చేయూతనివ్వడం కన్నా, చేసిన పనికి తగిన ప్రతిఫలం అందించే రీతిలో ప్రభుత్వ సాయం అందాలి. రుణంగానో,
ఉదారంగానో ఇవ్వడం కన్నా, అతడి కాయకష్టానికి తగిన ప్రతిఫలాన్ని అందించినట్టు అవుతుంది. ఉచితంగా ఇవ్వడం వల్ల సోమరితనాన్ని పెంచినట్టు అవుతుంది. పరాధీనతను పెంచినట్టు అవుతుంది. సామాజిక రుగ్మతలకు ఆస్కారం కలిగించినట్టు అవుతుంది. ప్రపంచ బ్యాంకు, సుప్రసిద్ధ మేధావులు, అభివృద్ధి విశ్లేషకులు చెబుతున్నది ఇదే. దీంతో ఫెర్గ్యూసన్‌ ‌పేర్కొంటున్న కొత్త తరహా సంక్షేమ రాష్ట్రానికి దారి తీస్తుంది. ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే కాంగ్రెస్‌ ఈ ‌పథకాన్ని తన మ్యానిఫెస్టోలో పెట్టింది.
కొత్త సంక్షేమ రాష్ట్రం అంటే పెద్ద స్థాయిలో ఉపాధి అవకాశాలను సృష్టించడంపై కేంద్రీకరించడం కాదు. అర్హులైన వారికి సరికొత్తరీతుల్లో ప్రభుత్వ సాయాన్ని అందించడం. ఇతర దేశాల్లా కాకుండా మన దేశంలో మానవ వనరులకు ఎటువంటి కొదవా లేదు. మానవ వనరులను సద్వినియోగం చేసుకోవడం, నైపుణ్యాన్ని పెంచడానికి ఒక చక్కని అవకాశంగా ప్రస్తుత పరిస్థితిని ఉపయోగించుకోవచ్చు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ గత ఎన్నికల్లో లక్షలాది ఉద్యోగాలు సృష్టిస్తామంటూ వాగ్దానం చేశారు కానీ, ఆచరణలో విఫలమయ్యారు. ఆయన వైఫల్యాన్ని దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్‌ ఈ ‌పథకాన్ని ప్రకటించి ఉండవచ్చు. ఫెర్గ్యూసన్‌ ‌తన పుస్తకంలో దక్షిణాఫ్రికాలో శ్రామికులు ఏవిధంగా వ్యతిరేక పరిస్థితులను సానుకూలంగా మార్చుకుంటున్నదీ వివరించారు. పరస్పరం ఆధారపడే రీతిలో వనరుల వినియోగించే పద్దతిని అలవాటు చేసుకుంటున్నారు.
అయితే, ఫర్గ్యూసన్‌ ‌మరో ఆఫ్రికన్‌ ‌వెనకబాటు తనంగా కాకుండా పరస్పర ఆధారం పద్దతిని మార్చుకోవాలని హెచ్చరిస్తున్నారు. అమెరికా విషయమే తీసుకుంటే అక్కడ జనాభాలో 60.7 శాతం మందికి ఉపాధి లభిస్తోంది. ప్రతి ఐదుగురిలో ఒకరికి ఉపాధి లేదు. ఇతరులు ఏదో విధంగా గడిపేస్తున్నారు.
అన్నీ కాపీ పథకాలే..
గ్లోబల్‌ ‌సౌత్‌లో మనం చూస్తున్న కొత్త సంక్షేమ రాజ్యంలో రెండు అంశాలు కనిపిస్తున్నాయి. నిరుద్యోగం పెరిగి పోవడం, ఉత్పత్తులు భారీగా పెరగడం. వనరుల పంపిణీకి కొత్త విధానాలు, మార్గాలు ప్రస్తుత అవసరం. కనీస ఆదాయ పథకాలు రకరకాల పేర్లతో ఇతర దేశాల్లో అమలులో ఉన్నాయి. నమీబియాలో బేసిక్‌ ఇన్‌ ‌కమ్‌ ‌గ్రాంట్స్(‌బిఐజి), బ్రెజిల్‌లో బేసిక్‌ ‌రెంట్‌ అనే పేర్లతో అమలులో ఉన్నాయి. కొత్త సంక్షేమ రాజ్యం ప్రధానంగా అధిక ఉత్పత్తిపై కేంద్రీకరించింది. అయితే, పంపిణీకి కొత్త విదానాలను అనుసరిస్తోంది. కాంగ్రెస్‌ ఇతర దేశాల్లో ఇప్పటికే అమలు చేసి వదిలేసిన పథకాలను పట్టుకుంటోంది. అంతేకాక ఆఫ్రికా, దక్షిణ అమెరికా దేశాలలో అమలులో ఉన్న నగదు బదిలీ పథకాల ఫలితాలపై సార్వత్రికమైన, స్థిరమైన ఫలితాలు లేవు. సంక్షేమ పథకం పరిశీలనార్హమైనదే. అయితే, దీనిని చాలా జాగరూకతతో, ఇతర దేశాల్లో వచ్చిన ఫలితాలను దృష్టిలో ఉంచుకుని అమలులో పెట్టాలి.
న్యాయ్‌ ‌పథకంలో పదనిసలు ఉండొచ్చు
కాంగ్రెస్‌ ‌మ్యానిఫెస్టోలో పెట్టిన న్యాయ్‌ ‌పథకం ఎంతో ఉత్సాహాన్ని రేకెత్తించవచ్చు. జనంలో ఉత్సాహాన్ని రేకెత్తించవచ్చు. అయితే, భారత్‌ ‌వంటి దేశాల్లో దీని ఫలితం ఎలా ఉంటుందనేది అప్పుడే చెప్పలేం. జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంది. అమలులో కూడ జాగ్రత్తలు తీసుకోవాలి. కనీస ఆదాయ పథకం వస్తే ఇంతవరకూ అమలులో ఉన్న సంక్షేమ పథకాలు పోతాయేమోనన్న భయాలు కూడా జనంలో ఉన్నాయి. ముఖ్యంగా, మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం వంటి పథకాల ద్వారా పేదలకు ఎంతో కొంత సాయం అందుతోంది. గడిచిన ఐదేళ్ళలో ఈ పథకంపై తగిన శ్రద్ధచూపడం లేదు. ఈ కొత్త పథకం వల్ల ఆర్థిక క్రమ శిక్షణ కనుమరుగు అవుతుందేమోనన్న భయాలు ఉన్నాయి. అలాగే, ఈ కొత్త పథకాన్ని ఆధార్‌తో లింక్‌ ‌చేసే అవకాశాలూ ఉన్నాయి. లబ్ధిదారుల ఎంపికకు ఆధార్‌ను ఆధారంగా చేసుకోవచ్చు. ఆధార్‌ ‌వల్ల అనేక సమస్యలు ఉన్నాయి. అది రాజ్యాంగ రహితమైనదే కాకుండా వ్యక్తుల గోప్యతకు సవాల్‌గా పరిణమించింది. ఆధార్‌ ‌రేషన్‌ ‌కార్డు కన్నా, దారిద్య్ర రేఖకు దిగువన జీ•వించే (బీపీఎల్‌) ‌వర్గాల నిర్ధారణ కార్డుల కన్నా మెరుగైనదని చెప్పడానికి ఆదారాలు లేవు.
కనీస ఆదాయ పథకం ద్వారా ఎలాంటి భారతాన్ని చూడాలనుకుంటున్నారు? చౌకీదార్‌- ‌చోర్‌ల ట్విట్టర్‌ ‌గేమ్స్, ‌జనాన్ని మొత్తేస్తున్న అవినీతి ఆరోపణలు, వంశ పారంపర్య రాజకీయాలు, ద్వేష పూరిత రాజకీయాలు, గోరక్షకులు సాగించే దాడులు, అసహన ధోరణలకు బదులుగా ప్రజల్లో నమ్మకాన్నీ, విశ్వాసాన్ని పెంచే లేదా పునరుద్ధరించే రాజకీయాలు నేటి అవసరం

– ‘ద వైర్‌’ ‌సౌజన్యంతో..

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!