వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

కఠిన చట్టాలతోనే బాల్య వివాహాల నిర్మూలన

September 13, 2019

పిల్లలల్లోనూ, తల్లి తండ్రులలోనూ సరైన అవగాహన లేకపోవడం వల్లనే బాల్య వివాహాలు సమాజానికి శాపంలా తయారయ్యాయి. తొలుత 1929 నాటి బాల్య వివాహాల నిరోధక చట్టం సంఘ సంస్కర్తల ఒత్తిడి కారణంగా ఆనాటి ప్రభుత్వం తీసుకుని వచ్చింది. తెలుగునాట కందుకూరి వీరేశలింగం పంతులు వంటి సంస్కర్తలు బాల్య వివాహాలను ప్రతిఘటించారు. అయితే 1929 చట్టం అనేక కారాణాల వల్ల విఫలమైంది. న్యాయపరమైన అభ్యంతరాల కారణంగానే ఈ చట్టం విఫలమైంది.బాల్యవివాహాల వల్ల నష్టాల గురించి అవగాహన లేకపోవడం, చట్టాలను అమలు జరిపే యంత్రాంగం చలనశీలంగా లేకపోవడం వల్ల బాధితులకు న్యాయం జరగడం లేదు. రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాలు తెచ్చిన చట్టాలు ఒకదానికి మరొకటి ఘర్షణ పడే రీతిలో ఉన్నాయి. దశాబ్దాలుగా ఇదే తంతు. బాల్య వివాహాలు చట్ట విరుద్ధం. అందుకే 2006లో బాల్య వివాహాల నిషేధ చట్టాన్ని తెచ్చారు. బాల్య వివాహాలను ఈ చట్టం నిషేధిస్తోంది. అయినప్పటికీ బాల్య వివాహాలు రహస్యంగా సాగుతూనే ఉన్నాయి. వివాహానికి వయో పరిమితిని నిర్దారిస్తూ జారీ చేసిన నిబంధనలు కూడా అమలు జరగడం లేదు. వివాహానికి కనీస వయో పరిమితిని యువ తులకు 18 సంవత్సరాలుగానూ, యువకులకు 21 సంవత్సరాలుగానూ నిర్ధారిస్తూ ప్రభుత్వం నిబంధనలు జారీ చేసింది. 2018లో యునిసిఫ్‌ ‌నిర్వహించిన సర్వేలో తేలిందేమంటే, ఏడు శాతం బాలికలు 18 ఏళ్ళ లోపులోనే వివాహాలు చేసుకుం టున్నారు. రాజ్యాంగం అమలు లోకి వచ్చి 69 సంవత్సరాలు అయినా, ఇప్పటికీ బాల్య వివాహాలు అడ్డు అదుపు లేకుండా జరిగిపోతూనే ఉన్నాయి. ఆడపిల్ల పుడితే భారమనే భావన ఇప్పటికీ చాలా కుటుంబాల్లో ఉంది. కట్నం ఇచ్చుకోలేమనే తల్లితండులు ఆడపిల్లలు వద్దంటున్నారు. ఆడపిల్ల కూడికలు, తీసివేతల అంశంగా తయారైంది. తల్లితండ్రుల వద్ద ఆడపిల్ల ఎక్కువ కాలం ఉండదు. అలాగే, తల్లితండ్రులు కూడా ఆడ పిల్ల కానీ, మన పిల్ల కాదనే ధోరణిలో ఆడపిల్లలను పెంచుతారు. పెళ్ళి చేసి పంపేదానికి ఆడపిల్లల చదువు మీద ఖర్చు ఎందుకు అని ఆలోచించేవాళ్ళు కూడా ఉన్నారు. దీంతో ఆడపిల్లల్లో అవిద్య పెరిగి పోతోంది. వరకట్న నిషేధ చట్టం అమలులో ఉన్నా ఈ దురాచారం కొనసాగుతూనే ఉంది. అంతేకాక పెళ్ళయిన యువతుల ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా వారి భర్తలు కాపురం చేయమని బలవంతం చేస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో హింస పెరిగి పోతోంది. దీనిపై ఎవరు ఎవరికి ఫిర్యాదు చేయాలి. చేసినా పట్టించుకునే వారేరీ అనే ప్రశ్నలు తలెత్తుతుంటాయి. కొన్ని సామాజిక వర్గాల్లో ఆడ పిల్లలకు త్వరగా పెళ్ళి చేసి అత్తారింటికి పంపేయాలన్న నియమాలు ఉంటాయి. అలా చేస్తే తమ బాధ్యత తీరిపోయినట్టుగా తల్లితండ్రులు భావిస్తారు. బాల్య వివాహాల వల్ల మైనారిటీ తీరకుండానే తల్లులవుతుంటారు. అలాంటి వారికి పుట్టిన పిల్లలకు శారీరకపరమైన బలహీనతలు ఉంటాయి. బాల్య వివాహాల రద్దు విషయంలో సామాజిక చైతన్యాన్ని తీసుకుని రావాలి. కర్నాటకలో పిల్లల్లో అవగాహన పెంచే కార్యక్రమం చురుకుగా సాగుతోంది. పిల్లలల్లోనూ, తల్లి తండ్రులలోనూ సరైన అవగాహన లేకపోవడం వల్లనే బాల్య వివాహాలు సమాజానికి శాపంలా తయారయ్యాయి. తొలుత 1929 నాటి బాల్య వివాహాల నిరోధక చట్టం సంఘ సంస్కర్తల ఒత్తిడి కారణంగా ఆనాటి ప్రభుత్వం తీసుకుని వచ్చింది. తెలుగునాట కందుకూరి వీరేశలింగం పంతులు వంటి సంస్కర్తలు బాల్య వివాహాలను ప్రతిఘటించారు. అయితే 1929 చట్టం అనేక కారాణాల వల్ల విఫలమైంది. న్యాయపరమైన అభ్యంతరాల కారణంగానే ఈ చట్టం విఫలమైంది.
బాల్య వివాహాలను వ్యతిరేకిస్తూ పిల్ల, లేదా పిల్లవాడు మాత్రమే పిటిషన్‌ ‌దాఖలు చేయాలి. వారు మైనర్‌లు అయినట్టయితే, తల్లితండ్రులు వారి తరఫున పిటిషన్‌ ‌దాఖలు చేయాలి. చాలా మంది ఆడపిల్లలను సొంత ఇంట్లో వారే అడ్డుకుంటుంటారు. వారిని బెదిరిస్తుంటారు. అందువల్ల వారు ధైర్యం చేయలేరు. చైల్డ్ ‌మేరేజ్‌ ‌ప్రొహిబిషన్‌ ఆఫీసర్‌ (‌సిఎంపిఓ)ను సంప్రదించేందుకు వారికి వయసు చాలదు. అంతేకాక, వారి స్టేట్‌ ‌మెంట్లు నమోదు చేసుకోరు. అందువల్ల వారి తరఫున సంరక్షకులు మాత్రమే ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. సంరక్షకులు కూడా సామాజిక నియమనిబంధనలకు కట్టుబడి ఉండాలి. ఫిర్యాదులు అందిన వెంటనే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోరు, తీసుకోలేరు. ఆ ఫిర్యాదులను సంబంధిత అధికారులకు పంపడం, వారు పరిశీలించడం ఇలా అంతా పెద్ద తతంగం అమలు జరగాల్సి ఉంది. అంతేకాక తల్లితండ్రులు, లేదా సంరక్షకులు నిరక్షరాస్యులు కావడం వల్ల ఎవరికి ఫిర్యాదు చేయాలో వారికి తెలియదు. ఫిర్యాదు చేసే విధానం కూడా తెలియదు. ఇస్లామిక్‌ ‌చట్టాలకు ఈ చట్టాలు వర్తించవని గుజరాత్‌ ‌హైకోర్టు ఒక కేసు తీర్పులో పేర్కొంది. శ్రీమతి సీమా వర్సెస్‌ అశ్వినీకుమార్‌ ‌కేసులో అన్ని వివాహాలను తప్పని సరిగా రిజష్ట్రర్‌ ‌చేయాలని గుజరాత్‌ ‌కోర్టు సూచించింది 2017లో సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది. మైనారిటీ తీరని ఆడపిల్లతో భర్త బలవంతంగా కాపరం చేస్తే నేరం అవుతుందని స్పష్టం చేసింది. బాల్యవివాహాలను నిరోధించేందుకే ఈ తీర్పు ఇచ్చింది. అంతేకాక, పెళ్ళిని రద్దు చేయాలని ఆ యువతి దరఖాస్తు చేసుకోవచ్చు. బాల్య వివాహాల వల్ల వాటిల్లే అనర్థాల గురించి తల్లితండ్రులకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. చట్టాలు చేయడం కన్నా, సామాజిక చైతన్యం ద్వారానే ఈ దురాచారాన్ని నిర్మూలించవచ్చు. ఆడ పిల్లలకు చదువు చెప్పిస్తే సమస్యలన్నీ తీరుతాయి. మహిళా సాధికారతతోనే వరకట్న సమస్య, గృహ హింస, బాల్యవివాహాలు వంటి దురాచారాలను నిరోధించడం సాధ్యమవుతుంది. చట్ట సభల సభ్యులు ఈ అంశంపై దృష్టిని కేందీకరించాలి.
– ‘ద వైర్‌’ ‌సౌజన్యంతో..