వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ఒత్తిడి, విమర్శలకు ఆస్కారం లేకుండా పనిచేస్తున్నాం

August 27, 2019

సీఎండీ ప్రభాకర్‌రావుఎలాంటి ఒత్తిడి, విమర్శలకు ఆస్కారం లేకుండా పనిచేస్తున్నాం కాబట్టే రాష్ట్రంలో నిరంతర విద్యుత్‌ అం‌దించగలుగుతున్నామని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు తెలిపారు. విద్యుత్‌ ‌సంస్థలపై విపక్షాలు చేస్తున్న విమర్శలపై సీఎండీ ప్రభాకర్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. విద్యుత్‌ ‌సంస్థలు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేసినట్లు తెలిపారు. 2014-15లో రాష్ట్రంలో 45 లక్షల టన్నుల వరి పండేది. కాగా 2018-19లో 60 లక్షల టన్నుల వరి ఉత్పత్తి పెరిగిందంటే నాణ్యమైన విద్యుత్‌ అం‌దించడం వల్లే అది సాధ్యమైందన్నారు. ఈ నాలుగేళ్లలో కోల్‌ ఇన్‌పుట్స్ ‌కోసం పన్నుల రూపంలో రూ.3 వేల కోట్లు అదనపు భారం పడిందని.. అయినా ఇప్పటి వరకు విద్యుత్‌ ‌ధరలు పెంచకుండా వినియోగదారులకు విద్యుత్‌ అం‌దిస్తున్నామన్నారు. ఆరోపణలు చేసి తమ ఆత్మైస్థెర్యాన్ని దెబ్బతీయొద్దున్నారు. దేశంలో తెలంగాణ విద్యుత్‌ ‌సంస్థలు ఒక్కటే నష్టాల్లో ఉన్నట్లు మాట్లాడడం సరికాదన్నారు. ఎటువంటి ఒత్తిళ్లు వచ్చినా పక్కకుపెట్టి తాము బీహెచ్‌ఈఎల్‌తోనే ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. బకాయిలు అనేది నిరంతరాయమన్న ఆయన తమకు రావాల్సినవి ఉంటాయని… తాము కట్టాల్సినవి ఉంటాయన్నారు. ఈఆర్సీ అనుమతి లేకుండా తాము ఏ నిర్ణయం తీసుకోమన్నారు. ఈఆర్సీ లేనప్పుడు తాము ఎలాంటి అనుమతులు ఇవ్వలేమన్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా పారదర్శకంగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.గతంలో తను తెలుగుదేశం, కాంగ్రెస్‌ ‌పార్టీ హాయంలో కూడా పనిచేసానని ఇప్పుడు టీఆర్‌ఎస్‌ ‌పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వంలో పనిచేస్తున్నాని తనకు ఏ పార్టీ కండువ ••ప్పుకోవాల్సిన అవసరం రాలేదని, భవిష్యత్‌లో కూడా ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా బాధ్యత నిర్వహిస్తానని ప్రభాకర్‌ ‌రావు అన్నారు.