Take a fresh look at your lifestyle.

ఒక ద్వారం తెరుచుకుని…

ఓడిపోవటం మరణించడం కాదు!
చతికిలబడటం అసలే కాదు..!!

మరోమారు ఇంకా శ్రద్ధగా
ఏకాగ్రతగా మొలకెత్తడం..!!

గెలవటం సంయమనంగా
సమతుల్యంతో పరిమళించడం..!!

ఎప్పుడూ ఒకే రంగుంలుండవు ప్రకృతిలో..!
వైవిధ్యాలు అమరికలు అనన్యం..!!

గెలుపు ఓటముల సుడిగుండాల్లో
ముందు ఏదైనా ఒక దారం పట్టుకుని
వెళ్ళగలిగితే…
ఎన్నో ప్రపంచాలు తెర తీసుకుంటాయ్‌..!!

‌మనం వేసే అడుగులు దార్శనీకపుటద్దాలు
తొడగకపోతే అల్లకల్లోలపు రొంపిలో పడి
పశ్చాత్తాపపు కాలువలో కొట్టుకుపోతాం..!!

పొరపాట్ల ఆటుపోట్లు ముంచెత్తకముందే
మనిషి బుద్ధితో మనసుతో వినగలిగిన్నాడు
సరలళత్వాన్ని పుణికిపుచ్చుకుంటాడు…
గొప్ప వ్యవస్థను నిర్మిస్తాడు

– రఘు వగ్గు, తాటికొండ, మహబూబ్‌ ‌నగర్‌,‌తెలంగాణ-509382)

Leave a Reply