వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ఒకేసారి రెండు పెద్ద చిత్రాలు..

April 28, 2018

సౌత్‌స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌సింగ్‌ చెన్నై, ముంబైల మద్య చక్కర్లు కొడుతూ బిజీగా ఉన్నారు.. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం ఈమె తమిళంలో సూర్య, సెల్వరాఘవన్‌ల ఎన్‌జికె చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది.. ఇటీవలే నిర్మాతల మండలి నిరసన ముగియటంతో ఆమె ఆసినిమా షూటింగ్‌లో జాయిన్‌ అయ్యారు. గురువారంమే మొదటిషెడ్యూల్‌ పూర్తయింది.. దర్శకుడు సెల్వరాఘవన్‌ రకుల్‌ ఫెర్ఫామెన్స్‌పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేశాడు.. దాంతో రకుల్‌ వెంటనే ఆలీ దర్శకత్వంలో అజ§్‌ు దేవగన్‌తో చేస్తున్న రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌కోసం ముంబైకు పయనమయ్యారు.. శుక్రవారం నుంచి షూటింగ్‌లో పాల్గొననున్నారు.. ఇలా ఒకేసారి తమిళ, హిందీ రెండు సినిమాలను మేనేజ్‌ చేస్తున్న రకుల్‌ ఇంకొన్నాళ్లపాటు ఇలాగే చెన్నై, ముంబై షెడ్యూళ్లతో బిజీగా ఉండనున్నారు.