వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ఐపీసీ నుంచి ‘రాజద్రోహం’ ‌తొలగిస్తాం..! కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల

April 2, 2019

తాము అధికారంలోకి వస్తే సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టానికి సవరణలు చేస్తామని, రాజద్రోహం నేరాన్ని నిర్వచించే ఐపీసీలోని 124 చట్టాన్ని తొలగిస్తామని కాంగ్రెస్‌ ‌పార్టీ అధ్యక్షడు రాహుల్‌ ‌గాంధీ ప్రకటించారు. మంగళవారంనాడు యూపీఏ చైర్‌ ‌పర్సన్‌ ‌సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ ‌సింగ్‌ ‌తో కలిసి కాంగ్రెస్‌ ‌మేనిఫెస్టోను విడుదల చేశారు. కాంగ్రెస్‌ ‌ప్రవేశ పెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పధకాన్ని నిరుపయోగంగా ప్రధాని మోడీ అవహేళన చేస్తున్నారని, కానీ దాని వల్ల ఎంతోమందికి మేలు కలుగుతోం దన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పధకంలో వంద రోజులకు బదులు 150 రోజుల పనిదినాలు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటామని ఆయన మేనిఫెస్టోలో హమీ ఇచ్చారు.కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి వస్తే పేదరికంపై సర్జికల్‌ ‌స్ట్రై ‌చేస్తామని, 2030 నాటికి పేదరిక నిర్మూలనకు కృషి చేస్తామని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్‌ ‌గాంధీ స్పష్టం చేశారు. . ఢిల్లీలో హమ్‌ ‌నిభాయేంగే పేరుతో కాంగ్రెస్‌ ‌మేనిఫెస్టోను పార్టీ సీనియర్‌ ‌నేతల సమక్షంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో యూపీఏ ఛైర్‌పర్సన్‌ ‌సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ ‌సింగ్‌, ‌ప్రియాంక గాంధీ, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, రణ్‌దీప్‌ ‌సుర్జేవాలా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్‌ ‌మాట్లాడుతూ.. తమ మేనిఫెస్టో ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేలా ఉందన్నారు. సంక్షేమంతో సంపద సృష్టించడమే లక్ష్యమని రాహుల్‌ ‌పేర్కొన్నారు.