వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ఐపీఎస్‌లు దేశాభివృద్ధికి పాటుపడాలి

August 24, 2019

జమ్ముకశ్మీర్‌ ‌ప్రత్యేక ప్రతిపత్తి రద్దుతో పటేల్‌ ఆశయం నెరవేరింది
పటేల్‌ ‌పేరనున్న అకాడకి రావడం సంతోషంగా ఉంది
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా
ఐపీఎస్‌లు రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతినకుండా ముందుకుసాగుతూ.. మనస్సు చెప్పినట్లు ధైర్యంగా విధులు నిర్వర్తించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా సూచించారు. శనివారం నగరంలోని సర్దార్‌ ‌వల్లభాయ్‌ ‌పటేల్‌ ‌జాతీయ పోలీస్‌ అకాడలో 70వ బ్యాచ్‌ ఐపీఎస్‌ ‌పాసింగ్‌ ఔట్‌ ‌పరేడ్‌ ‌ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్‌ అధికారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. పరేడ్‌ అనంతరం అమిత్‌షా బ్యాచ్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. సర్దార్‌ ‌వల్లభాయ్‌ ‌పటేల్‌ ‌పేరుతో ఉన్న నేషనల్‌ ‌పోలీసు అకాడకి రావడం సంతోషంగా ఉందన్నారు. 70వ బ్యాచ్‌ ‌లో 12 మంది మహిళా ప్రోబిషనరీలుగా శిక్షణ పూర్తి చేసుకోవడం దేశానికి గర్వకారణమన్నారు. ఐపీఎస్‌ ‌సాధించడంతోనే యువత ఆశయం పూర్తయినట్లు కాదని అమిత్‌షా పేర్కొన్నారు. నిజాయితీగా సేవ చేసి గౌరవం పొందాలని, దేశాభివృద్ధికి పాటు పడాలని కోరారు. పేదరికంలో మగ్గుతున్న కోట్లాది ప్రజలకు సేవ చేసి వారిని వృద్ధిలోకి తీసుకురావాలని హితవు పలికారు. రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతినకుండా, మనసు చెప్పినట్లు ధైర్యంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. హైదరాబాద్‌ ‌సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేసేందుకు సర్దార్‌ ‌పటేల్‌ ఎం‌తో కృషి చేశారని అమిత్‌షా అన్నారు. స్వదేశీ సంస్థానాల విలీనం కోసం వల్లభాయ్‌ ‌పటేల్‌ ‌చేసిన కృషి ఎప్పటికీ మరిచిపోలేనిదని ఆయన కొనియాడారు. తాజాగా జమ్ముకశ్మీర్‌ ‌ప్రత్యేక ప్రతిపత్తి రద్దుతో పటేల్‌ ఆశయం పూర్తిగా నెరవేరిందని, ఏన్నో ఏళ్లుగా ఉన్న జమ్ముకశ్మీర్‌ ‌సమస్యను ప్రధాని మోదీ పరిష్కరించారని అమిత్‌షా అన్నారు. రాజకీయ నాయకులకు కేవలం 5 ఏళ్లు మాత్రమే దేశానికి సేవ చేసే అవకాశముంటుం
దన్నఅమిత్‌ ‌షా.. పోలీసులకు 60 ఏళ్ల వరకు అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ గవర్నర్‌ ‌నరసింహన్‌, ‌తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ తదితరులు హాజరయ్యారు. ఇదిలా ఉంటే ఈ బ్యాచ్‌లో మొత్తం 92 మంది ఐపీఎస్‌లు శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఈ బ్యాచ్‌ ‌నుంచి తెలుగు రాష్టాల్రకు ముగ్గురు చొప్పున ఐపీఎస్‌లను కేటాయించారు. ఐపీఎస్‌ ‌శిక్షణలో టాపర్‌ ‌గా నిలిచిన గౌస్‌ అలంను తెలంగాణకు కేటాయించారు.