Take a fresh look at your lifestyle.

ఐకెపి కేంద్రాల్లో వసతులేవి?

మండలంలోని ఐకెపి కేంద్రాల్లో కనీస మౌలిక వసతులు, సౌకర్యాల్లేకపోవడంతో రైతులు, హమాలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజురోజుకూ ఎండలు విపరీతంగా పెరుగు తునండటంతో ఆ ఎండలోనే పనులు చేసి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం సేద తీరడానికి టెంట్లను సైతం వేయకపోవడంతో అవస్థలెదుర్కొంటున్నారు. కరోనా వైరస్‌ ‌వ్యాప్తి దృష్ట్యా కనీసం హమాలీలకు మాస్క్‌లు కూడా అందించలేదని వాపోతున్నారు. సంఘబంధం మహిళలు ఐకెపి కేంద్రాలను సమర్థనీయంగా నిర్వహిస్తున్నప్పటికీ వారికి పూర్తిస్థాయిలో ప్రభుత్వ సహకారం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి తక్షణమే మౌళిక సదుపాయాలు కల్పించాలని రైతులు డిమాండ్‌ ‌చేశారు.

Leave a Reply