వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ఐఐటి, ఐఐఎంలపై.. కంపెనీ యజమానుల మోజు వారినే దెబ్బకొడుతోంది

November 26, 2019

ప్రతిష్ఠాత్మక సంస్థలు కాని సంస్థల నుంచి వొచ్చిన వారు ఎక్కువ విలువైన అంశాలతో తమను తాము రుజువు చేసుకోవడానికి అవసరమైన ప్రావీణ్యాన్ని కలిగి ఉంటారు. రెండు లేదా మూడు అంచెల స్కూల్స్ ‌నుంచి వొచ్చిన వారు తమ ప్రతిభను రుజువు చేసుకోవడానికి ఎక్కువ శ్రమిస్తుంటారని దినేష్‌ ‌జైన్‌ ‌తెలిపారు. ఆయన నిస్సాన్‌ ‌మోటార్‌ ఇం‌డియా, జీ టర్నర్‌ ‌వంటి సంస్థల్లో సీఈఓగా పని చేశారు. ప్రస్తుతం ఆయన ఇండియన్‌ ‌మాజ్‌ అడ్వయిజరీని నిర్వహిస్తున్నారు. పేరు లేని కాలేజీల నుంచి వొచ్చిన వారిని కంపెనీల్లో చేర్చుకోవడం వల్ల ఎక్కువ ఫలితాలు ఉంటాయి.

ప్రపంచ వ్యాప్తంగా యజమానులు తమకు తగిన వారినే తమ సంస్థల్లో వినియోగిస్తుంటారు. మన దేశంలో మాత్రం అటువంటిది లేదు. భారత దేశంలోని కంపెనీల్లో ఉద్యోగులను నియమించే ధోరణి చూస్తుంటే ఒక్కొక్కసారి ఆశ్చర్యం కలుగుతుంది. మన వాళ్ళు అగ్రశ్రేణి వారిని నియమించాలనుకోవడమే కాకుండా…ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ‌టెక్నాలజీ, లేదా ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ‌మేనేజిమెంట్‌ ‌వంటి సంస్థల నుంచి వచ్చిన వారిని నియమించాలనుకుంటారు. బాగా పేరు పొందిన కంపెనీ ఢిల్లీలోని నిర్ణీత ఐఐటి హాస్టళ్ళ నుంచి అభ్యర్థులను ఎంపిక చేసి నియమిస్తూ ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా యజమానులు తమకు అనుకూలమైన వారిని నియమించుకుంటూ ఉంటారు. మన దేశంలో ఐఐటి, ఐఐఎంల నుంచి వచ్చినవారిని నియమించడమే కాకుండా గొప్పగా చెప్పుకుంటుంటారు. దానిని వారు చాలా సహజమైన విషయంగా భావిస్తారు. ఇలాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో తమ పిల్లలకు ఉద్యోగాల కోసం తల్లితండ్రులు తమ పిల్లలను ఐఐటిలకూ, ఐఐఎంలకూ, బిట్స్ ‌పిలానీకి పంపుతూ ఉంటారు. అలాంటి సంస్థల నుంచి వచ్చిన వారు విద్యా పరంగా ప్రతిభను చాటుకోవడంతో పాటు విలక్షణమైన నైపుణ్యాలు ప్రదర్శిస్తూ ఉంటారు. వారు ఆంగ్ల భాషను ధారాళంగా మాట్లాడుతుంటారు. భారత్‌లోని కార్పొరేట్‌ ‌సంస్థల్లో ప్రవేశానికి అది అత్యవసరం. అయితే, ప్రతిష్ఠాత్మక సంస్థలు కాని సంస్థల నుంచి వొచ్చిన వారు ఎక్కువ విలువైన అంశాలతో తమను తాము రుజువు చేసుకోవడానికి అవసరమైన ప్రావీణ్యాన్ని కలిగి ఉంటారు. రెండు లేదా మూడు అంచెల స్కూల్స్ ‌నుంచి వొచ్చిన వారు తమ ప్రతిభను రుజువు చేసుకోవడానికి ఎక్కువ శ్రమిస్తుంటారని దినేష్‌ ‌జైన్‌ ‌తెలిపారు. ఆయన నిస్సాన్‌ ‌మోటార్‌ ఇం‌డియా, జీ టర్నర్‌ ‌వంటి సంస్థల్లో సీఈఓగా పని చేశారు. ప్రస్తుతం ఆయన ఇండియన్‌ ‌మాజ్‌ అడ్వయిజరీని నిర్వహిస్తున్నారు. పేరు లేని కాలేజీల నుంచి వొచ్చిన వారిని కంపెనీల్లో చేర్చుకోవడం వల్ల ఎక్కువ ఫలితాలు ఉంటాయి. నాలుగైదేళ్ళు పని చేసిన తర్వాత అట్టడుగు స్థాయి ఉద్యోగికి ఎక్కువ అనుభవం లభిస్తుంది. మన దేశంలో అంకుర పరిశ్రమలను పెద్ద నగరాల నుంచి చిన్న పట్టణాలకు విస్తరింపజేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయా సంస్థల్లో పని చేసే వారి వల్ల ఎక్కువ ఉపయోగాలు ఉంటాయి. ఈ రంగంలో అనుభవం సంపాదించిన అపూర్వ అగర్వాల్‌, అనిరుధ్‌ ‌పండిత తదితరులందరి అబిప్రాయాలు ఇవే. బరేలీలో పేరు, ఊరు లేని కాలేజీ నుంచి వచ్చిన వారిని కలిశాననీ, వారిలో అద్భుతమైన ప్రతిభ కనిపించిందని అగర్వాల్‌ అన్నారు. కొత్తగా వచ్చిన వారి వల్ల తక్కువ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అన్నారు. పండిత పెనిసెల్వేనియా యూనివర్శిటీ నుంచి పట్టా పొందారు.

– ‘స్క్రోల్‌.ఇన్‌’ ‌సౌజన్యంతో..