Take a fresh look at your lifestyle.

ఏ ఒక్క సమస్య తీర్చలేదు

 

 

 ‌ఫోటో: విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న సీనియర్‌ ‌జర్నలిస్టు, ఐజేయూ నేత కే. శ్రీనివాస్‌ ‌రెడ్డి, ఐజేయూ కార్యదర్శి వై. నరేందర్‌ ‌రెడ్డి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విరాహత్‌ అలీ.
ఫోటో: విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న సీనియర్‌ ‌జర్నలిస్టు, ఐజేయూ నేత కే. శ్రీనివాస్‌ ‌రెడ్డి, ఐజేయూ కార్యదర్శి వై. నరేందర్‌ ‌రెడ్డి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విరాహత్‌ అలీ.

రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల ఆందోళన
మొదటి దశ ఆందోళన విజయవంతం.
సీనియర్‌ ‌జర్నలిస్టు, ఐజేయూ నేత కే. శ్రీనివాస్‌ ‌రెడ్డి.
ప్రభుత్వం దిగిరాకపోతే ఆందోళనలకు సిద్ధం
: ఐజేయూ కార్యదర్శి వై. నరేందర్‌ ‌రెడ్డి.

డిమాండ్ల కోసం పోరాటం చేస్తుంటే కొన్ని సంఘాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నామనడం తగదు : టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
కే. విరాహత్‌ అలీ.
అపరిష్కతంగా ఉన్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ ‌చేస్తూ కలం కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలోని జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో తహసిల్దార్‌ ‌కార్యాలయాల ఎదుట ధర్నాలు చేపట్టి వినతిపత్రాలను అందజేశారు. జర్నలిస్టుల ఆందోళనకు పలు పార్టీల నేతలు సంఘీభావం పలికి ఆందోళనలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో తమవంతు పాత్ర పోషించిన జర్నలిస్టుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌సానుకూలంగా స్పందించి తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఉద్యమ సమయంలో జర్నలిస్టులందరికీ ఇండ్లస్థలాలు కేటాయించి, ఇండ్లు నిర్మించి ఇస్తామని, జర్నలిస్టుల అవిశ్రాంత శ్రమను దృస్టిలో పెట్టుకొని వారి ఆరోగ్య భద్రతకు హెల్త్‌కార్డులు జారీ చేస్తానని, 239 జీవోను రద్దు చేసి అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్‌ ‌కార్డులు జారీ చేయాలని, 2014 శాసనసభ ఎన్నికల సందర్భంగా తమ మ్యానిఫెస్టోలో జర్నలిస్టులకు ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చాలని కోరుతూ వినతిపత్రాలను తహసిల్దార్లకు అందజేసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళాలని కోరారు.
మొదటి దశ ఆందోళన విజయవంతం : కె. శ్రీనివాస్‌ ‌రెడ్డి
హిమాయత్‌ ‌నగర్‌ : ‌జర్నలిస్టుల సంక్షేమం కోసం 2014 ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టిన హామీలను తెలంగాణ ప్రభుత్వం విస్మరించిందని సీనియర్‌ ‌జర్నలిస్టు, ఐజేయూ నేత కే. శ్రీనివాస్‌ ‌రెడ్డి ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లను నెరవేరుస్తామని సీఎం కేసీఆర్‌ ఎన్నోమార్లు ప్రకటించినప్పటికి ఆయా హామీలు ఆచరణకు నోచుకోలేదని ఆయన అన్నారు. ఆరున్నర ఏండ్ల టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ హాయంలో జర్నలిస్టుల ఏ ఒక్క సమస్య తీర్చలేదని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు గురువారం బషీర్‌ ‌బాగ్‌ ‌ప్రెస్‌ ‌క్లబ్‌ ‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐటీయూ కార్యదర్శి వై. నరేందర్‌ ‌రెడ్డి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విరాహత్‌ అలీలతో కలిసి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ ‌రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు కేటాయించి ఇస్తాం, అందరికీ హెల్త్ ‌కార్డులు జారీ చేసి అన్ని కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో చెల్లుబాటు అయ్యేలా చర్యలు తీసుకుంటామని అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్‌ ‌కార్డులు అందిస్తామని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్‌ ‌నేడు ఏదో ఒక సాకుతో అన్యాయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అక్రిడిటేషన్‌ ‌జీవోల సవరణ చేపట్టలేదని అన్నారు. ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్‌ ‌చేస్తూ గురువారం టీయూడబ్ల్యూజే, ఐజేయూ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల రెవెన్యూ కార్యాలయాలలో తహశీల్దార్లకు వినతి పత్రాలు అందజేయడం జరిగిందని, 584 మండలాలకుగాను 510 మండలాలల్లో తహశీల్దార్లకు 7017 మంది జర్నలిస్టుల సంతకాలతో కూడిన వినతి పత్రాలు అందజేసినట్లు ఆయన వెల్లడించారు. మొదటి దశ ఆందోళన కార్యక్రమం విజయవంతం అయ్యిందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించకపోతే రెండవ దశ ఆందోళన కార్యక్రమాలలో భాగంగా అక్టోబర్‌ 4‌న ఆర్డీఓ కార్యాలయాల ఎదుట నిరసన ప్రదర్శన, వినతి పత్రాలు, 14న అన్ని జిల్లా కలెక్టర్‌ ‌కార్యాలయాల ఎదుట శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు చేపట్టి వినతి పత్రాలను అందజేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఐజేయూ కార్యదర్శి వై. నరేందర్‌ ‌రెడ్డి మాట్లాడుతూ మొదటి దశ ఆందోళణ కార్యక్రమంలో భాగంగా తహశీల్దార్లకు వినతి పత్రాలు అందజేయడంలో జర్నలిస్టులు ఒక మెట్టు ఎక్కారని, ప్రభుత్వం స్పందించి దిగిరాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఆందోళణ చేపట్టేందుకు సిద్దంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. శాంతియుతంగా జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లను సాధించుకోవాలని కోరారు. టీయూడబ్ల్యూజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విరాహత్‌ అలీ మాట్లాడుతూ జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లకోసం పోరాటం చేస్తుంటే కొన్ని సంఘాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నామని అనవసరపు ఆరోపణలు చేస్తున్నాయని ఆయన అన్నారు. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళన కార్యక్రమాన్ని తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌యూనియన్‌ అఫ్‌ ‌వర్కింగ్‌ ‌జర్నలిస్టస్ ‌కార్యదర్శి శిగ శంకర్‌ ‌గౌడ్‌, ‌టీయూడబ్ల్యూజే కార్యవర్గ సభ్యులు ఏ. రాజేష్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!