వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ఏమీ చేయలేమని.. చేతులెత్తేసింరు

September 22, 2019

నిరుద్యోగ భృతి లేదు..
ఇచ్చిన హామీలకు కేటాయింపులు లేవు..
వోటాన్‌ అకౌంట్‌ ‌కంటే తక్కువ బడ్జెట్‌..

ఏమీ చేయలేమని..
చేతులెత్తేసింరు
అసెంబ్లీలో ద్రవ్య వివిమయ చర్చపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

ఫోటో: ఆదివారం అసెంబ్లీలో ప్రెస్‌మీట్‌ ‌హాల్లో మాట్లాడుతున్న మాట్లాడుతూ సీఎల్‌పి నేత భట్టి విక్రమార్క

కాళేశ్వరం ప్రాజెక్ట్ ‌నుండి నీళ్ళు వస్తున్నట్లు బోగస్‌ ‌ప్రచారం చేసుకుంటున్నారని, ఇదే అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తే రావడం లేదని ఒప్పుకున్నారన్నారని సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం అసెంబ్లీలో ప్రెస్‌మిట్‌ ‌హాల్లోఆయన మాట్లాడుతూ కార్పొరేషన్‌ల మీద తీసుకవచ్చే అప్పు రాష్ట్ర ప్రభుత్వానిదేనని తెలిపారు. అనుభవదారునికి కౌలు దారులకు లింక్‌ ‌పెడుతున్నారని, కౌలుదారులు వేరు అనుభవదారులు వేరు అని, అప్పులపై నిర్దిష్టంగా చెప్పలేమని, ఈ సంవత్సరం అప్పు, వడ్డీ 23,840 బాకీ ఉందని ఆయన తెలిపారు. మళ్ళీ ఇప్పుడు అప్పు తీసుకొస్తే సంవత్సరానికి 50 వేల కోట్ల వడ్డీ కట్టాల్సివస్తుందని, అది ప్రజలపై భారం మోపడమేనని తెలిపారు. అప్పుల పైన రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అప్పుల వల్ల ప్రజలకు పెనుభారం అవుతుందని, ద్రవ్యవినిమయ బిల్లు సమయంలో ఒక్క ప్రశ్నకూ సీఎం సమాధానం చెప్పలేదని అన్నారు. అసెంబ్లీ సమావేశంలో బహిరంగ సభలో మాట్లాడినట్లు సీఎం మాట్లాడారని, ఎన్నికల హామీలు అమలు చేయలేమని బడ్జెట్‌ ‌ద్వారా ప్రభుత్వం చెప్పేసిందని తెలిపారు. నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పిన ఆయన ఆరునెలలు అయినా దాని ప్రస్తావనే లేదని, మరిచిపోయారని తెలిపారు. 57 ఏండ్లకే పెన్షన్‌ అన్నారని, ఎప్పటి నుండి ఇస్తారో చెప్పడం మాత్రం దాటవేస్తున్నారని, అనుకున్న ఆదాయం రావడం లేదని చేతులెత్తారన్నారని భట్టి ఎద్దేవా చేశారు. గడిచిన ఆరేళ్లుగా పెట్టిన పెట్టుబడికి ఆదాయం తగ్గి మాంద్యంలోకి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వెళ్ళిందని, ప్రభుత్వ ప్రణాళిక లేమి కొట్టొచ్చినట్లు కనపడిందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ‌ద్వారా నీళ్లే రావడం లేదని, ప్రచారం మాత్రం నీళ్లు వచ్చి అంతా జరిగిపోయిందన్నట్లు చేస్తున్నారని తెలిపారు. కార్పొరేషన్ల పేరుతో తెచ్చిన అప్పులు అప్పులు కాదని ప్రభుత్వం చెప్తుందని, ఇది ప్రమాదకరమని, 50 వేల కోట్లు వడ్డీ కట్టే రోజులు రోబోతున్నాయని భట్టి తెలిపారు. ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేదని, ప్రజలు ప్రభుత్వం చేసే అప్పుల పట్ల అప్రమతంగా ఉండాలని, వాస్తవాలు తెలిసి చెప్పకపోతే తమది తప్పవుతుందని ప్రజలకు చెప్తున్నామని ఆయన అన్నారు. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చలో సీఎం కేవలం రాజకీయాలు మాట్లాడారని, బహిరంగ సభలో మాట్లాడినట్టు మాట్లాడిపోయారని, మొబిలైజేషన్‌ అడ్వాన్సులు ఇచ్చి పనులు చేయకపోతే రికవరీ చేసి కేసులు పెట్టండి అంటే సమాధానం లేదని ఆయన తెలిపారు.

మా ప్రశ్నలకు సమాధానం రాలేదు : ఎమ్మెల్యే శ్రీధర్‌ ‌బాబు
మేము అడిగే ప్రశ్నలకు సమాధానం వస్తుందని ఆశించామని, కాని తమ ఆశలన్ని ఆడి ఆశలు అయిన్నాయని ఎమ్మెల్యే శ్రీధర్‌ ‌బాబు అన్నారు. 2 వ ఇన్నింగ్స్ ‌మొదలు పెట్టిన టిఆర్‌ఎస్‌ 26,481 ‌మందిని రిక్రూట్‌ ‌చేశామని హరీష్‌ ‌రావు చెప్పారని, రాష్ట్రం వచ్చిన దగ్గరి నుండి గ్రూప్స్ ‌లేవు, డీఎస్సీ నోటిఫికేషన్‌ ‌లేక కాలయాపన చేస్తుందని అన్నారు. డిపారె్ట•మెంట్‌లో కేవలం 10 వేల మందికి పైగా ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని, యువ న్యాయ వాదుల స్టైఫెండ్‌ ‌గురించి ఎలాంటి హామీ లేదని అన్నారు. ప్రాజెక్టుల గురించి భూములు కోల్పోయిన వారికి పరిహారం లభించలేదని, విభజన చట్ట హామీలు పెండింగ్‌లో ఉన్నాయని, ఆ హామీలు అమలు అయ్యే విధంగా ప్రధానితో మాట్లాడి, వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వం తగుచర్యలు తీసుకోవాలన్నారు. ఆ హామీలను పరిష్కారం చేయాలని ఆయన అన్నారు. ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం నాన్చుడు ధోరణితో వ్యవహరిస్తోందని, తెలంగాణ వచ్చిన తరువాత ఒక్క డీఎస్సీని కూడా విడుదల చేయలేదని అన్నారు. డిపార్ట్‌మెంట్‌లో వచ్చే పదోన్నతులను కూడా ఉద్యోగాలు ఇచ్చినట్టు ప్రభుత్వం చెప్తుకొస్తుందన్నారు. నిరుద్యోగులకు నిరాశే మిగిలిందని, వారి ఎదురుచూపులకు ఫలితం ఇప్పట్లో దక్కేల లేదని ఎమ్మెల్యే అన్నారు. పోటీ పరీక్షల వయోపరిమితి సడలింపుపై ప్రకటన చేయలేదని, జిల్లా జడ్జీల నోటిఫికేషన్‌లు ఇప్పటి వరకు ఇవ్వలేదని, చాలా సమస్యలకు పరిష్కారం వొస్తుందని అనుకున్నామని, కానీ తమకు నిరాశే మిగిలిందని అన్నారు.

ప్రశిస్తే గొంతు నొక్కుతున్నారు : ఎమ్మెల్యే సితక్క విజ్ఞప్తి
వాస్తవ నిర్ణయాలు అసెంబ్లీలో జరగలేదని, అసెంబ్లీని రాజకీయ వేదికగా సీఎం వాడుకున్నారని, కేసీఆర్‌ ‌ప్రతిపక్షాలను తిడుతూ, రాజకీయ పబ్బం గడుపుకున్నారే తప్ప ప్రజలకు ఉపయోగపడే చర్యలు తీసుకోలేదని ఎమ్మెల్యే సీతక్క తెలిపారు. అడ్వాకేట్లకు, జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని, జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తానని ఇంతవరకు ఇవ్వలేదని, తాము ప్రశ్నిస్తే గొంతు నొక్కుతున్నారని,రెవెన్యూ సమస్యలు పరిష్కరించలేదని, రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆమె ప్రభుత్వంపై మండిపడ్డారు. తాము ప్రశిస్తే కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం గతంలో ఏమి చేసిందని అడుగుతున్నారని, కాంగ్రెస్‌ ఎలాంటి అభివృద్ధి చేయందే 2004లో తమతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారని ఆమె ప్రశించారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఎందుకు పదవులు తీసుకున్నారో కేసీఆర్‌ ‌సమాధానం ఇవ్వాలని, హుజూర్‌ ‌నగర్‌ ఉప ఎన్నికల ప్రచారం అసెంబ్లీలో ఉపయోగించుకున్నారని సీతక్క అన్నారు.