Take a fresh look at your lifestyle.

ఏపీ- తెలంగాణ సమస్య ఇంకా సమసిపోలేదు

ఫోటో:వారణాసి కాశీ విశ్వేశ్వరుడి సన్నిధిలో పూజలు జరిపిన ప్రధాని మోడీ, అమిత్‌షా
ఫోటో:వారణాసి కాశీ విశ్వేశ్వరుడి సన్నిధిలో పూజలు జరిపిన ప్రధాని మోడీ, అమిత్‌షా

నేను ముందు బీజేపీ కార్యకర్తను.. ఆతర్వాతే దేశానికి ప్రధానిని
కాశీ.. శక్తిని, శాంతినిస్తుంది : ప్రధాని నరేంద్ర మోదీ
కాశీ విశ్వనాథ మందిరంలో మోదీ, అమిత్‌షాల ప్రత్యేక పూజులుమొదటగా తాను బీజేపీ కార్యకర్తనని, ఆ తర్వాతే దేశానికి ప్రధానమంత్రి అని , నాకు ఆదేశమే ముఖ్యమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించారు. ప్రత్యేక విమానంలో వారణాసి చేరుకున్న ప్రధాని, అమిత్‌షాలకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, ‌గవర్నర్‌ ‌రామ్‌నాయక్‌ ‌ఘనస్వాగతం పలికారు. ప్రముఖ పుణ్యక్షేత్రంలో రోడ్‌ ‌షో నిర్వహించగా.. కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలివచ్చారు. కాశీ విశ్వనాథ మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని మోదీ ప్రసంగించనున్నారు. తన గెలుపు కోసం కష్టపడిన కాశీలోని బీజేపీ కార్యకర్తలకు మోదీ ధన్యవాదాలు తెలిపారు. మొదటగా తాను బీజేపీ కార్యకర్తను అని, ఆ తర్వాతే దేశానికి ప్రధానమంత్రి అని అన్నారు. నాకు ఆదేశమే ముఖ్యమన్నారు. రిలాక్స్ అయ్యే సందర్భం చాలా అరుదుగా వస్తుందని, ప్రచారం, ఎన్నికలు ముగిసిన
తర్వాత అందుకే కేదార్‌నాథ్‌ ‌వెళ్లినట్లు మోదీ చెప్పారు. పార్టీ కార్యకర్తలు చెప్పినట్లు విన్నానన్నారు. వారిని సంతోషపెట్టడమే తన మంత్రమన్నారు. తప్పుడు అభిప్రాయాలను క్రియేట్‌ ‌చేసేందుకు కొందరు ప్రయత్నించారని, కానీ అవన్నీ అబద్దమని రుజువయ్యాయన్నారు. వారణాసి ప్రజలపై నాకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. బెంగాల్‌, ‌త్రిపురాలో బీజేపీ కార్యకర్తలను హతమార్చారన్నారు. ఐడియాలజీ కోసం బీజేపీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారన్నారు. వారణాసిలో గెలుపు తనలో అసాధారణ విశ్వాసాన్ని నింపిందన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy