Take a fresh look at your lifestyle.

ఏపీ అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత

  • సభలో పరస్పరం తోసుకున్న ఎమ్మెల్యేలు
  • పరస్పరం దాడి చేసుకున్న వైసిపి, టిడిపి నేతలు
అమరావతి, మార్చి 20 : ఏపీ అసెంబ్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోడియం వద్ద నిసనకు దిగిన టిడిపి ఎమ్మెల్యేలపై అధికార వైసిపి సభ్యులు దాడికి దిగారు. దీంతో టిడిపి ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి కిందపడ్డారు. ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి, వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు మధ్య ఘర్షణ జరిగింది. శాసనసభలో చర్చ జరుగుతుండగా టీడీపీ సభ్యులు నిరసన తెలిపారు. అనంతరం టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్‌ ‌పోడియంను చుట్టుముట్టారు. దీనిపై వైసీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ తర్వాత వైసీపీకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కూడా అక్కడికి చేరుకున్నారు. దీంతో టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బాలవీరాంజనేయస్వామి, సుధాకర్‌బాబు మధ్య ఈ ఘర్షణ జరిగింది.
సుధాకర్‌బాబును అడ్డుకున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు. సుధాకర్‌బాబుకు మద్దతుగా వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్లారు. టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తడంతో సభ వాయిదా పడింది. అసెంబ్లీ వెల్‌లో టీడీపీ సభ్యుల నిరసనకు దిగారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఏడో రోజు సోమవారం ప్రారంభం అయ్యాయి.సభ ప్రారంభమైన కాసేపటికే అసెంబ్లీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలమధ్య ఘర్షణ వాతావరణం తలపించింది. పరస్పరం టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు సవాళ్లు విసురుకున్నారు.
టీడీపీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామిపైవైసీపీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు దాడి చేశారు. దీంతో వెంటనే స్పీకర్‌ ‌పోడియాన్ని టీడీపీ సభ్యులు చుట్టుముట్టారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. జీవో నెం. 1 రద్దుకు టీడీపీ సభ్యుల డిమాండ్‌ ‌చేశారు. పోడియం దగ్గర జీవో నెం.1కి వ్యతిరేకంగా టీడీపీ సభ్యులు పెద్ద ఎత్తున్న నినాదాలు చేశారు. తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడడంతో సభను స్పీకర్‌ ‌వాయిదా వేశారు. ఈ క్రమంలో అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యె డోలా వీరాంజనేయ స్వామిపై వైసీపీ ఎమ్మెల్యే టీజేఆర్‌ ‌సుధాకర్‌ ‌బాబు దాడి చేసి.. స్పీకర్‌ ‌పొడియం కిందకు నెట్టివేశారు. దీంతో స్పీకర్‌ ‌పోడియం మెట్ల వద్ద ఎమ్మెల్యె స్వామి కిందపడిపోయారు. అలాగే మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ‌టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి దగ్గర ప్లకార్డ్ ‌లాక్కోని నేట్టేశారు.
ఈ నేపథ్యంలో టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కింద కూర్చోని నిరసన చేపట్టారు.

Leave a Reply