వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ఎవరెస్ట్‌ను ఎక్కిన ఇద్దరు దివ్యాంగులు.

September 3, 2019

తమ అంగవైకల్యాని ఎదరించి ఇద్దరు తెలుగు యువకులు ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు. ఎత్తైన శిఖరాన జాతీయ జెడా రెపరెపలాడించారు. దివ్యాంగులైనా ఎవరికి తక్కువ కాదని నిరూపించిన ఆర్యవర్ధన్‌, ‌హర్షద్‌ ‌షేక్‌కు హైదరాబాద్‌లో ఘన స్వాగతం లభించింది. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించాలనే సంకల్పంతో గంగోత్రి మౌంట్‌ ‌భగీరథ నుంచి ఆరుగురు సభ్యులతో కలిసి వెళ్లారు. 18వేల అడుగుల శిఖరాన్ని అధిరోహించారు. తెలంగాణ స్పోర్ట్ అథారిటీ నుంచి శిక్షణ పొందిన యువకులను శిఖరం అధిరోహించడానికి అధికారులు ఎంపిక చేశారు. వారి లక్ష్యానికి అండగా అధిత్య ఫౌండేషన్‌ ‌నిలిచింది. ఆర్యా, హర్షద్‌కు డెహ్రాడూన్‌లో మరికొన్ని రోజులు ట్రైనింగ్‌ ఇప్పించింది. తర్వాత బీఎస్‌ఎఫ్‌ ‌వారితో కలిసి ఎవరెస్టు శిఖరం అధిరోహించారు. వీరికి హైదరాబాద్‌లో ఘనస్వాగతం లభించింది.