ఎల్ఆర్ఎస్పై ప్రచురించిన కరపత్రం ఆవిష్కరణలో సుడా ఛైర్మన్
జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని సుడా కార్యాలయంలో సిద్ధిపేట జిల్లా రియల్ ఎస్టేట్ సంక్షేమ సంఘం ఎల్ఆర్ఎస్పై ప్రచురించిన కరపత్రాన్ని సుడా ఛైర్మన్ మారెడ్డి రవీందర్‌రెడ్డి, వైస్ ఛైర్మన్ రమణాచారి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఛైర్మన్ రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ…కొత్తగా ఏర్పడిన సుడా పరిధిలో ఎల్ఆర్ఎస్ కట్టుకునే అవకాశం కల్పించామనీ, ఈ అవకాశాన్ని ప్లాట్ల యజమానులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఎల్ఆర్ఎస్ కట్టడం వల్ల ప్లాట్లకు భద్రత కూడా ఉంటుందన్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు చొరవతో ఎల్ఆర్ఎస్ కట్టుకునే అవకాశం వచ్చిందన్నారు. ఎల్ఆర్ఎస్పైన అవగాహన కల్పించడానికి రియల్ ఎస్టేట్ సంక్షేమ సంఘం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రియల్ ఎస్టేట్ సంఘం కన్వీనర్ జంగం రాజలింగం, కో కన్వీనర్ మారెడ్డి మల్లికార్జున్‌రెడ్డి, చెందిరెడ్డి అంజిరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, మంతూరి రవీందర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, పైసర రంగయ్య, వట్టిపల్లి రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.