Take a fresh look at your lifestyle.

ఎలాంటి పరిస్థితినైనా తిప్పికొడతాం..! ఆర్మీచీఫ్‌ ‌జనరల్‌ ‌బిపిన్‌ ‌రావత్‌

‘‌నివురు గప్పిన నిప్పు’ లా నియంత్రణ రేఖపాకిస్థాన్‌ ‌పొడవునా గల నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) నివురు గప్పిన నిప్పులా ఉందని, అక్కడ ఏక్షణమైనా ఉద్రిక్త పరిస్థితి తలెత్తవచ్చునని ఆర్మీ చీఫ్‌ ‌జనరల్‌ ‌బిపిన్‌ ‌రావత్‌ ‌తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. పాక్‌ ఆర్మీ తమ బోర్డర్‌ ‌యాక్షన్‌ ‌టీమ్‌ ‌ని అక్కడ ఎప్పటికప్పుడు ప్రేరేపిస్తోందని ఆయన ఆరోపించారు. అయితే ఏ విధమైన పరిస్థితిని ఎదుర్కోవడానికైనా తాము సిధ్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. హైలెవెల్‌ ఆపరేషన్‌, ‌రెడీనెస్‌ అన్నదే మా లక్ష్యమన్నారు. వివిధ కంటింజెన్సీలకు సంబంధించి వివరణాత్మక ప్లాన్‌ ‌లతో మేం ఎప్పటికప్పుడు సన్నద్దులయ్యే ఉన్నామని రావత్‌ ‌పేర్కొన్నారు. రెండు రోజుల క్రితమే ఎల్‌ఓసి వద్ద సుందర్‌ ‌బని సెక్టార్లో పాక్‌ ఆర్మీ.. బోర్డర్‌ ‌యాక్షన్‌ ‌టీమ్‌ ఆపరేషన్‌ ‌కు ప్రయత్నించగా.. దాన్ని భారత జవానులు తిప్పికొట్టారు. ఆ సందర్భంగా ఇరు పక్షాల మధ్య జరిగిన కాల్పుల్లో భారత జవాను ఒకరు మరణించగా.. మరొకరు గాయపడ్డారు. అయితే ఆ కాల్పుల్లో ఎంతమంది పాక్‌ ‌సైనికులు మరణించిందీ తెలియలేదు. వారంలో ప్రతి మూడో రోజూ పాకిస్తాన్‌ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతోందని, అయితే ప్రతీకార దాడులకు దిగుతున్నామని రావత్‌ ‌వెల్లడించారు. ఇప్పటికే పాక్‌ 2,900 ‌సార్లు కాల్పుల విరమణను ఉల్లంఘించిందని ఆయన చెప్పారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!