వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ఎలాంటి పరిస్థితినైనా ..ఎదుర్కొంటాం

August 13, 2019

కాశ్మీరీలతో మమేకమవ్వడమే మా ఆలోచన
ఆర్మీచీఫ్‌ ‌జనరల్‌ ‌బిపిన్‌ ‌రావత్‌దేశ సరిహద్దుల వెంబడి ఎలాంటి ప్రతికూలతలు ఎదురైనా వాటిని సమర్ధవంతంగా భారత సైన్యం తిప్పికొడుతుందని ఆర్మీ చీఫ్‌ ‌జనరల్‌ ‌బిపిన్‌ ‌రావత్‌ అన్నారు. ఆర్మీ ఎప్పుడూ సర్వసన్నద్ధంగా ఉంటుందన్నారు. మంగళవారం ఆయన డియాతో మాట్లాడారు.. అధీన రేఖ వెంబడి పాక్‌ ‌తన ఉనికిని పెంచుకుంటూ పోతోందా అని డియా అడిగిన ప్రశ్నకు రావత్‌ ‌సూటిగా స్పందించారు. నిరోధులు అధీనరేఖ వెంబడి తమ కార్యకాలాపాలను చురుకుగా సాగించాలనుకుంటే అది వారి ఇష్టమని అన్నారు. ముందస్తు మోహరింపులు అనేవి తప్పనిసరిగా ఉంటాయని, దీని గురించి తమకు ఎలాంటి ఆందోళన లేదని చెప్పారు. ఆర్మీ, ఇతర సేవల విషయానికి వస్తే, మనం ఎప్పుడూ సర్వసన్నద్ధంగానే ఉంటామని రావత్‌ ‌స్పష్టం చేశారు. ఆర్టికల్‌ 370 ‌రద్దు తర్వాత కశ్మీర్‌ ‌లోయలో పరిస్థితిపై మాట్లాడుతూ, 70-80వ దశకంలో ప్రజలతో తాము ఎంతగానో మమేకమయ్యేవాళ్లమని, అలాంటి పరిస్థితినే మళ్లీ తాము కోరుకుంటున్నామని అన్నారు. ’అక్కడ మా బలగాలు మోహరించాయి. తుపాకులు వాడకుండానే ప్రజలతో మమేకమవ్వాలనేది మా ఆలోచన. అంతా సవ్యంగా జరిగేత తుపాకులు
పక్కనపెట్టేసి ప్రజలతో ఉల్లాసంగా కలిసిపోతాం’ అని రావత్‌ ‌చెప్పారు. జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370వ అధికరణను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం, జమ్మూకశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడంపై పాక్‌ ‌కారాలు మిరియాలు నూరుతుండటం, మరో పుల్వామా తరహా దాడి జరగొచ్చని పాక్‌ ‌ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ఇటీవల వ్యాఖ్యానించిన నేపథ్యంలో బిపిన్‌ ‌రావత్‌ ‌తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.