వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి

May 10, 2019

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ‌హరితశాసనమండలిలో వరంగల్‌ ‌స్థానిక సంస్థల కోటాలో వరంగల్‌ ‌స్థానానికి నిర్వహించనున్న ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ‌హరిత అన్నారు. గురువారం కలెక్టర్‌ ‌చాంబర్‌లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలచే సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ ‌మాట్లాడుతూ ఈ ఉప ఎన్నికకు సంబంధించి వరంగల్‌ అర్బన్‌ ‌జాయింట్‌ ‌కలెక్టర్‌ ఆర్‌వోగా, డిఆర్‌వో, అర్బన్‌ ఎలక్టోరల్‌ ‌రిజిస్ట్రేషన్‌ అధికారిగా ఉంటారన్నారు. ఈ ఎన్నికలలో జెడ్పిటిసి, ఎంపిటిసిలు, మున్సిపాలిటీల సభ్యులు, శాసనసభ్యులు, పార్లమెంట్‌ ‌సభ్యులు ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఓటర్లుగా నమోదై ఉన్నారన్నారు