వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి

April 9, 2019

నిజామాబాద్‌ ‌రైతు ఐక్యత సభలో మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ ‌నాగేశ్వర్‌పసుపు పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని నిజామాబాద్‌, ‌జగిత్యాల జిల్లాల ఎమ్మెల్యేలు రాజీనామా చేసి కేంద్రంపై ఒత్తిడిని పెంచాలని మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ ‌నాగేశ్వర్‌ అన్నారు. మంగళవారం నిజామాబాద్‌ ‌లోక్‌ ‌సభ బరిలో ఉన్న రైతు ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా ఆర్మూర్‌లో రైతు ఐక్యత సభ జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్‌ ‌నాగేశ్వర్‌ ‌మాట్లాడుతూ.. జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేయని నేపథ్యంలో ఎంపీ కవితను ప్రశ్నిస్తే అది తన పరిధిలో లేదని తప్పించుకుంటున్నారని ధ్వజమెత్తారు. రైతు సమస్యల పోరాటంలో భాగంగా కర్షకులంతా కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. రైతుల ఉద్యమాన్ని కించపర్చే వారికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. పసుపు అంటే శుభానికి మూలం.. మరి పసుపు పండించే రైతుకు ఎందుకు శుభం ఉండకూడదని ప్రశ్నించారు. పసుపు పంట పండిస్తే ఎకరానికి రూ.30 వేల నష్టం వస్తుందని తెలిపారు. పంట వేయకపోతే రైతు బంధు పథకం కింద రూ.10 వేలు వస్తున్నాయని అన్నారు. పరిష్కారం దొరికే వరకు ఉద్యమాన్ని ఉదృతం చేయాలని పిలుపునిచ్చారు. ఎర్ర జొన్న పంటకు 3,500 మద్దతు ధరతో పాటు విత్తనాలను కూడా ప్రభుత్వం అందించాలని డిమాండ్‌ ‌చేశారు. అనంతరం రాష్ట్ర కిసాన్‌ ‌కేత్‌ అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి మాట్లాడుతూ.. పసుపు బోర్డు ఏర్పాటు సహా పసుపు పంట క్వింటాల్‌ ‌ధర రూ.10 వేలకు పెంచకపోతే వోట్లు అడగనని గతంలో ఎంపీ కవిత అన్నారని గుర్తుచేశారు. ఇంకా జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేయని నేపథ్యంలో ఆమెను ప్రశ్నిస్తే అది తన పరిధిలో లేదని తప్పించుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఇలాంటప్పుడు తెరాస తరఫున నిలబడుతున్న కవితకు ఎందుకు వోట్లు వేయాలని ప్రశ్నించారు. ఈ అంశంపై భాజపా కూడా నోరు విప్పడం లేదని ఆయన ధ్వజమెత్తారు. రైతు సమస్యల పోరాటంలో భాగంగా కర్షకులంతా కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. రైతుల ఉద్యమాన్ని కించపర్చే వారికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. నామినేషన్లు వేసిన రైతులంతా కడుపు మండి ఈ పని చేయడంలేదని, ఏదో ఓ పార్టీ వారి వెనక ఉండి ఈ పని చేయిస్తోందని కేటీఆర్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై రైతు సంఘం నాయకులు మండిపడ్డారు. కేటీఆర్‌, ‌కేసీఆర్‌ ‌చేసిన వ్యాఖ్యలను రైతులు ముక్త కంఠంతో ఖండించారు. స్పైస్‌ ‌బోర్డు నెలకొల్పామని కేటీఆర్‌ ‌చెప్తున్నారని, కేవలం స్పైస్‌ ‌పార్కు పెట్టి దాన్ని కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. పార్టీలను పక్కన పెట్టి రైతులంతా ఏకమై సమస్యలను పరిష్కరించుకుందామని రాష్ట్ర కిసాన్‌ ‌కేత్‌ అధ్యక్షుడు పిలుపునిచ్చారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ రైతులు అధిక సంఖ్యలో పోటీ చేయాలని దిశానిర్దేశం చేశారు.