Take a fresh look at your lifestyle.

ఎఫ్‌టిఎల్‌, ‌బఫర్‌ ‌జోన్లలో అక్రమ నిర్మాణాలు

అధికారుల అండదండలు పుష్కలం
ఎన్‌ ఓ ‌సి లేకుండానే అక్రమ అనుమతులు
ఫిర్యాదులను పక్కనపెట్టిన అధికారులుఆ భూములు ఎఫ్‌ ‌టి ఎల్‌ ‌లో వున్నాయి. అంటే ప్రభుత్వ నిభందనల ప్రకారం బఫర్‌ ‌జోన్లలో నిర్మాణాలు చేపట్టకూడదు. కాని ఇక్కడ బహుళ అంతస్తుల నిర్మాణాలు జరుగుతున్నాయి. దీంతో ఆ ప్రాంత వాసులకు ముప్పు పొంచిఉందన్నమాట. పెను
ప్రమాదం. ఇవన్నీ కబ్జాదారులకు అవసరం లేకున్నా… రాబోయే కాలంలో చెర్వులు అంతరించి నీటిఎద్దడితో, త్రాగునీరు లేక అలమటించే పరిస్థితి ఏర్పడబోతున్నది. అన్నీ తెలిసీ కూడా నీటిపారుదల శాఖ, రెవెన్యూ, మున్యిపల్‌ అధికారులు చెర్వుల్లోని నిర్మాణాలను విచ్చలవిడిగా ప్రోత్సహిస్తున్నారనేది తేటతెల్లమవుతున్నది. ఎఫ్‌ ‌టి ఎల్‌, ‌బఫర్‌ ‌జోన్ల స్థలాలకు నీటిపారుదల శాఖ ఎన్‌ ఓ ‌సి లేకుండానే, జిహెచ్‌ ఎం‌సి అధికారులు అక్రమంగా అనుమతులను మంజూరు చేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే, ప్రజాప్రతినిధుల ఆదేశాలతో తలొగ్గుతు న్నామని అధికారులు చెబు తున్నారు. మరో అడుగు ముందుకు వేసి ఎఫ్‌ ‌టి ఎల్‌ ‌పిల్లర్లను తొలగించి బహుళ అంతస్తుల నిర్మాణాలు చేస్తు న్నారు. కాగా ఎప్‌ ‌టి ఎల్‌ అనుమతులను రద్దు చేయాలంటూ, సిటీ ప్లానర్‌ ‌ప్రదీప్‌ ‌కుమార్‌ ‌కుత్బుల్లాపూర్‌ ‌మున్సిపల్‌ అధికారులకు పంపిన ఆదేశాలనుకూడ టౌన్‌ ‌ప్లానింగ్‌ అధికారులు బుట్టదాఖలు చేశారు. తప్పుడు అనుమతులను ఇవ్వడమే గాక, ఎఫ్‌ ‌టిఎల్‌ ‌భూముల ఆక్రమణ దారులకు కోర్టునుండి స్టే తెచ్చుకోమని మున్సిపల్‌ అధికారులే ఉచిత సలహాలు ఇస్తున్నట్లు సమాచారం. ప్రజల సొమ్ముతో ప్రభుత్వ విధులు నిర్వహిస్తున్న ఇలాంటి అధికారుల పాలనలో ప్రజా మనుగడకే ప్రమాదమని గుర్తించాల్సిన అవసరం ఉందని స్థానికులు అబిప్రాయ పడుతున్నారు. మహాదేవపురం పరికిచెర్వు, సూరారం హనుమాన్‌ ‌నగర్‌ ‌లోని పెద్దచెర్వు ఎప్‌ ‌టి ఎల్‌ ‌లోని నిర్మాణాలను అధికారులు నియంత్రించడంలో ఎందుకు విఫలం అవుతున్నారని ప్రశ్నిస్తున్నారు. అదికారుల చేతివాటం ఒక వైపు నడుస్తుండగా, మరోవైపు కుత్బుల్లాపూర్‌ ‌మున్సిపల్‌ ‌సర్కిల్స్ ‌లో చైన్‌ ‌మెన్‌ ‌ల హవా విపరీతంగా కొనసాగుతున్నది. సెక్షన్‌ ఆఫీసర్లు ఫీల్డ్ ‌కు వెల్లకుండా చైన్‌ ‌మెన్‌ ‌లతోనే కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు.. ఇదే అదనుగా చైన్‌ ‌మెన్‌ ‌లు తమకు అవకాశంగా మార్చుకొని భారీగా డబ్బులు దండుకుంటున్నారు. ఇప్పటికే కుత్బుల్లాపూర్‌ ‌ప్రాతంలో రాను రాను భూగర్భజలాలు పాతాళానికి అడుగంటి పోతున్నాయి. నీటిమట్టాన్ని పెంచటానికి, నిపుణుల సలహాలు కూడా, అధికారులు పట్టించుకోవడం లేదు. ఇంకుడు గుంతల ప్రక్రియ నామమాత్రంగానే ఉంది. భూగర్భ నీటిమట్టం పెరగాలంటె , తెలంగాణ ప్రభుత్వం మిషన్‌ ‌కాకతీయ పేరుతో చెర్వులు, కుంటలలో అధికంగా నీరునిలవడంకోసం, మెట్రోనగరంలోని చెర్వులు,కుంటలను కాపాడాలని అప్పటి మంత్రి కేటిఆర్‌ అధికారులకు స్టిక్ట్ ‌గా ఆదేశాలు కూడా ఇచ్చారు. కాని ఆచెర్వులను మింగెస్తున్న తిమింగలాలకు పూర్తి సహకారం చేస్తున్న టిఆర్‌ఎస్‌ ‌ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, చెర్వులను మింగేస్తున్న వారికి సహకరించడం అంటె అర్ధం ఏంటి, స్వార్ధరాజకీయాలకు చెరువులు అంతరించి పోవడమేనా ఉంటూ పర్యావరణ వేత్తలు ప్రశ్నిస్తున్నారు. చెరువులు లేకుండా, వాటిల్లో నీటి నిల్వలు లేకుండా, భూగర్భజలాల నీటిమట్టం పెంచాలన్న నిపుణుల ఆలోచనను కూడా తొక్కిపెడితె. ఇలాంటి మిషన్‌ ‌భగీరథలు ఎన్నని చేపడుతారని అంటున్నారు. చెర్వులు కనుమరుగైతె నగర వాసుల దాహార్తిని మిషన్‌ ‌భగీరథ తీరుస్తుందాని వ్యాక్యానిస్తున్నారు. ప్రజాప్రతినిధులకు, అదికారులకు విఐపి కోటాలో నీటి వసతులు పూర్తిగా అందుతాయి కాని, సామాన్యుల పరిస్థితి ఏంటి… నీరులేక చావాల్సిందేనాని ప్రశ్నిస్తున్నారు. వెలుగు చూసిన ధారుణమైన వాస్తవాలు…..
కుత్బుల్లాపూర్‌ ‌రెవెన్యూ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న పెద్దచెర్వు ఎఫ్‌ ‌టి ఎల్‌, ‌బఫర్‌ ‌జోన్‌ ‌పరిదిలో హనుమాన్‌ ‌నగర్‌ ‌లోని భవన నిర్మాణాలకు కుత్బుల్లాపూర్‌ ‌మున్సిపల్‌ అధికారులు గుడ్డిగా ఇంటి ఫర్మిషన్‌ ఇచ్చారు. ఈవిషయంలో పూర్తిగా విశ్లేశిస్తే.. అన్నిశాఖల అధికారులు తప్పులు కొట్టొచ్చినట్టు, ఇట్టే కనిపిస్తాయి. ఎల్‌ ఆర్‌ ఎస్‌ అనుమతి కోసం ధరఖాస్తు చేసుకున్నారని, అందుకే తాము అనుమతులు ఇచ్చామని టౌన్‌ ‌ప్లానింగ్‌ అధికారులు బుకాయిస్తున్నారు. నిజానికి ఫీల్డ్ ఎం‌క్వయిరి అవసరం కాని, ఇక్కడ మనీ ఎంక్వయిరితోనే ముగిసింది. దానిపై చర్యలు చేపట్టాలని ఫిర్యాదులు చేసినా పట్టించుకునే అధికారి కరువయ్యారు. మరో ధారుణమైన అధికారుల లంచగొండి తనానికి నిదర్శనం గాజులరామారం మహాదేవపురంలో ఉన్న ‘‘పరికి చెర్వు’’. ఇక్కడి ధారుణాన్ని చూస్తే, అధికారుల వ్యవహారశైలిపై రోతపుట్టిస్తుంది.. ఏకంగా ఎప్‌ ‌టి ఎల్‌ ‌పిల్లర్‌ ‌నెంబర్‌ 7, ఒకప్లాటుకు ఇంటి మధ్యలో వస్తుండగా దాన్ని తీసేసి, మున్సిపల్‌ అధికారులు అక్రమంగా ఇచ్చిన ఇంటి ఫర్మిషన్‌ ‌తో 4 అంతస్తుల భవనాన్ని నిర్మించారు. ఎప్‌ ‌టి ఎల్‌ 4, 5, 6, ఇలా మొత్తం పిల్లర్లను అక్రమార్కులు తొలగించి ఇండ్ల నిర్మాణాలను పటిష్ఠంగా నిర్మించారు. ఈవిషయాన్ని అధికారుల దృష్టికి స్థానికులు గత సంవత్సర కాలంగా తీసుకు వెల్తున్నా, నిర్మాణాలు పూర్తవుతున్నాయి కాని అధికారులలో చలనం ఉండటంలేదు. అసలు రెవెన్యూ, ఇరిగేషన్‌, ‌మున్సిపల్‌ అధికారులు వారి విధులు ఏంటి, వారు వేతనాలు ఎందుకు తీసుకుంటున్నారో అర్ధంకావటంలేదు. విజిట్‌ ‌చేసిన అధికారులు ఏదో ఒక చిన్న ఇటుకను కదిలించి, చర్యలు తీసుకున్నామని చెపుతున్నారు. ఏకంగా కూకట్‌పల్లి జోన్‌ ‌సిటిప్లానర్‌ ‌ప్రదీప్‌ ‌కుమార్‌ ఎఫ్‌ ‌టి ఎల్‌, ‌బఫర్‌ ‌జోన్‌ ‌పరిదిలోని అనుమతులను రద్దుచేయాలని కుత్బుల్లాపూర్‌ ‌మున్సిపల్‌ ‌టౌన్‌ ‌ప్లానింగ్‌ అధికారులకు లిఖితపూర్వక ఆదేశాలు కూడా ఉన్నాయి.. కాని ఆదేశాలు పక్కన బెట్టి. సదరు ఆక్రమణదారులకు అధికారులు కోర్టునుండి స్టే తెచ్చుకోమని ఇచ్చే సూచనలు చూస్తుంటె లంచావాతారాన్ని బయటపెడుతుంది.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy