Take a fresh look at your lifestyle.

ఎపిలో విద్యుత్‌ ‌చార్జీల షాక్‌

  • ‌పెంపును ప్రకటించిన ఈఆర్సీ ఛైర్మన్‌
  • ‌గతంలో ఉన్న స్లాబ్‌ల రద్దు..కొత్తగా 6 స్లాబులు ఖరారు
  • పెరుగుదలతో 14 వందల కోట్లు ఆదాయం వస్తుందని అంచనా

తిరుపతి, మార్చి 30 : ఒక వైపు పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుండటంతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు ఏపీ ప్రభుత్వం మరోభారం మోపింది. ప్రజలకు కరెంట్‌ ‌సంస్థలు షాక్‌ ఇచ్చాయి. అన్ని స్లాబుల్లో ధరలు పెరిగాపోయాయి. ఈ పెంపు ఆగస్టు ఒకటి నుంచి అమలులోకి వస్తుంది. గతంలో ఉన్న కేటగిరీలను రద్దు చేసి 6 స్లాబ్‌లుగా రేట్లను ఖరారు చేశారు. సామాన్యులు ఎక్కువగా వాడే యూనిట్లలోనే రేట్లు ఎక్కువగా పెరిగాయి. మొత్తంగా ఎక్కువగా సామాన్యులపై పడే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వం విద్యుత్‌ ‌చార్జీలను పెంచింది. 30 యూనిట్ల వరకు యూనిట్‌కు 45 పైసలు, 31 నుంచి 75 యూనిట్ల వరకు యూనిట్‌కు 91 పైసలు పెంచారు.

76 నుంచి 125 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ. 1.40 పైసలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 126 నుంచి 225 యూనిట్ల వరకు రూ. 6 లు, 226 నుంచి 400 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ. 8.75 పైసలు , 400 యూనిట్లకు పైగా ఉన్నవాటికి యూనిట్‌కు రూ. 9.75 పైసలు ప్రభుత్వం ఛార్జీలను పెంచింది. తిరుపతి సెనేట్‌ ‌హాల్‌లో ఏర్పాటు చేసిన డియా సమావేశంలో విద్యుత్‌ ‌రెగ్యులేటరీ చైర్‌మన్‌ ‌జస్టిస్‌ ‌నాగార్జున వివరాలను వెల్లడించారు. పెట్రో, గ్యాస్‌ ‌ధరలు పెరిగిన నేపథ్యంలో విద్యుత్‌ ‌ఛార్జీలను పెంచడం జరిగిందన్నారు. గృహ వినియోగదారులు సహకరించాలని కోరారు.

ఛార్జీల పెంపుదల వల్ల ప్రభుత్వానికి 14 వందల కోట్లు ఆదాయం వస్తుందని ఆయన వెల్లడించారు. ఇప్పటికే ధరల పెరుగుదలతో సతమతవుతున్న ఏపీ ప్రజలకు విద్యుత్‌ ‌చార్జీలను పెంచుతూ షాకిచ్చింది ప్రభుత్వం. 30 యూనిట్లకుపైగా వాడిన వారికి ఈ పెంపు వర్తించనుంది. పెరిగిన విద్యుత్‌ ‌టారిఫ్‌ను బుధవారం ఏపీఈఆర్సీ చైర్మన్‌ ‌విడుదల చేశారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విద్యుత్‌ ‌చార్జీల ఉత్తర్వులను ఏపీఈఆర్సీ సభ్యులు ఠాకూర్‌ ‌రామ్‌ ‌సింగ్‌, ‌రాజగోపాల్‌ ‌రెడ్డితో కలిసి ప్రకటించారు. డిస్కిం కంపెనీల లోటును పూడ్చుకునేందుకే రేట్లు పెంచాల్సి వచ్చిందన్నారు. ప్రజలపై ధరల పెంపు బాధగా ఉన్నా.. తప్పడం లేదన్నారు.

ధరలను పెంచడం తప్పని సరికావడంతోనే గృహ వినియోగదారులపై భారం వేస్తున్నాం. ఇష్టం లేకపోయినా కష్టంగానే విద్యుత్‌ ‌చార్జీలు పెంచుతున్నాం. అందరూ అర్థం చేసుకోవాలి. చాలా ఏళ్లుగా ధరలు పెంచలేదు. డిస్కంల మనుగడ, వినియోగదారుల ప్రయోజనాలను పరిగణలోకి తీసుకొనే పెంచుతున్నాం. దేశమంతా బొగ్గుకు కొరత ఉంది. డబ్బులు పెట్టి కొనాలనుకున్నా బొగ్గు లభించని పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లోనే మరీ భారం పడకుండా, సామాన్యులపై భారం వేస్తున్నాం. జాతీయ విద్యుత్‌ ‌టారీఫ్‌ ‌విధానాన్ని అనుసరించే చార్జీలు పెంచాం. సంతోషంతో ధరలు పెంచడం లేదు. అనేక కారణాల వల్ల డిస్కంలు నష్టాల్లో ఉన్నాయి. ఆగస్టు నుంచి కొత్త చార్జీలు అమల్లోకి వస్తాయని వెల్లడించారు.

Leave a Reply