Take a fresh look at your lifestyle.

ఎపిలో అమల్లోకి వచ్చిన కర్ఫ్యూ

  • బ్యాంకులు, జాతీయ రహదారి,
  • పోర్టు పనులకు మినహాయింపులు
  • కనకదుర్గ దుర్గగుడిలో మరో ఇద్దరు మృతి 
  • వ్యాక్సిన్‌ ‌కోసం జనం బారులు తీరుతున్న దక్కని ఊరట

అమరావతి, : కరోనా తీవ్రతతో బుధవారం నుంచి ఎపిలో కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటిరోజు 6గంటల వరకు అమల్లోకి వస్తుంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి కంట్రోల్‌ ‌చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలావుంటే  కరోనా తీవ్ర దృష్ట్యా రాష్ట్రంలో అమలు కానున్న కర్ఫ్యూ నిబంధనల నుండి కొన్నింటికి ప్రభుత్వం మినహాయింపునిచ్చింది.

బ్యాంకులకు, జాతీయ రహదారి పనులకు, పోర్ట్‌లకు మినహయింపు ఇస్తూ సవరణ ఉత్తర్వులు జారీ అయ్యాయి.  ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ ‌కుమార్‌ ‌సింఘాల్‌ ఈ ‌మేరకు సవరణ ఉత్తర్వులను జారీ చేశారు.  ఈ నెల 18 వరకు రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ ఆంక్షలు అమలులోకి రానున్నాయి. ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం12 గంటల వరకే వ్యాపారాలు, రవాణాకు అనుమతి ఇచ్చారు. 12 తర్వాత అందరూ ఇళ్లకే పరిమితం అవ్వాలని ప్రభుత్వం సూచించింది. అత్యవసర సర్వీసులకు మాత్రమే 12 తర్వాత అనుమతి ఇవ్వనున్నారు. చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి, సరిహద్దులను మూసేసారు. జగ్గయ్యపేట చెక్‌పోస్ట్ ‌వద్ద వాహనాలను తనిఖీ చేయనున్నారు. సరైన కారణం ఉంటేనే రాష్ట్రంలోకి అనుమతి ఉంటుందని…లేదంటే వెనక్కి పంపించాలని అధికారులు ఆదేశాలు జారీ చేసింది. ఇకపోతే కరోనా వాక్సిన్‌ ‌కోసం పలు ప్రాంతాల్లో జనం తీవ్ర ఇబ్బందు లను ఎదుర్కొంటున్నారు. వ్యాక్సిన్‌ ‌కోసం క్యూలైన్లో బారులు తీరుతున్నారు. వ్యాక్సినేషన్‌ ‌సెంటర్‌ ‌వద్ద గంటల కొద్దీ పడిగాపులు పడాల్సి వస్తోంది. అధికారుల తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం రెండో డోస్‌ ‌మాత్రమే వ్యాక్సినేషన్‌ అధికారులు అంటున్నారు.

మొదటి డోస్‌ ‌వ్యాక్సినేషన్‌ ‌కోసం వచ్చిన వారికి వ్యాక్సిన్‌ ‌లేదని చేపట్టడంతో జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు   ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై కరోనా కలకలం రేపుతోంది. కరోనా వైరస్‌తో కొండపై ముగ్గురు మృతి చెందారు. బుధవారం  తెల్లవారుజామున ఎన్‌ఎమ్‌ఆర్‌గా పనిచేస్తున్న ఆకుల హరి మృతి చెందగా, మంగళవారం ఆలయ అర్చకులు రాఘవయ్య మృతి చెందారు. నాలుగు రోజుల క్రితమే ఓ అర్చకుడు కరోనా బారిన పడి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. మరోవైపు కరోనాతో పలువురు ఉద్యోగులు బాధపడుతున్నారు.

Leave a Reply