వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ఎన్‌కౌంటర్‌ ‌చేసిన పోలీసులపై.. ఎఫ్‌ఐఆర్‌ ‌నమోదు చేయండి

December 7, 2019

మార్గదర్శకాలు పాటించలేదు సుప్రీమ్‌కోర్టులో పిటీషన్‌ ‌దాఖలు చేసిన న్యాయవాదులు
దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన దిశ అత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌పై పోలీసులు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించలేదని, వెంటనే ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై ఎఫ్‌ఐఆర్‌ ‌నమోదు చేయాలని పలువురు న్యాయవాదులు జీఎస్‌ ‌గనీ, ప్రదీప్‌ ‌కుమార్‌లు శనివారం సుప్రీంకోర్టులో పిటీషన్‌ ‌దాఖలు చేశారు. ఘటనపై వెంటనే విచారణకు ఆదేశించాలని న్యాయస్థానంలో పిటిషన్‌ ‌దాఖలు చేశారు. అలాగే ఎన్‌కౌంటర్‌ ‌జరిపిన పోలీసులపై ఎఫ్‌ఐఆర్‌ ‌నమోదు చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్‌ ‌సందర్భంగా 2014లో అత్యున్నత న్యాయస్థానం రూపొందించిన మార్గదర్శకాలను పోలీసులు విస్మరించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కాగా ఎన్‌కౌంటర్‌ ఉదంతానికి సంబంధించి శుక్రవారం షాద్‌ ‌నగర్‌ ‌పోలీసులు ఇదివరకే కేసు నమోదు చేశారు. దిశ కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న షాద్‌ ‌నగర్‌ ఏసీపీ వి.సురేంద్ర ఫిర్యాదు మేరకు హత్యాయత్నం (ఐపీసీ సెక్షన్‌ 307) ‌కింద కేసు నమోదు చేశారు. ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ సభ్యులు కూడా విచారణ ప్రారంభించారు.
మరోవైపు తెలంగాణ పోలీసులు దిశ నిందితులపై జరిపిన ఎన్‌కౌంటర్‌ను బాధిత కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చట్ట ప్రకారం శిక్షించకుండా అన్యాయంగా కాల్చిచంపారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.