వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ఎన్నికల విధులపై అధికారులకు శిక్షణ

April 2, 2019

పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌ ‌శ్రీదేవసేన
పెద్దపల్లి పార్లమెంట్‌ ‌పరిధిలో పోలింగ్‌ ‌రోజు నిర్వహిం చవలసిన విధులపై ఎన్నికల సిబ్బందికి సంపూర్ణ అవగాహన కల్పిస్తూ పూర్తి స్థాయి శిక్షణ అందించాలని జిల్లా కలెక్టర్‌ ‌శ్రీదేవసేన, ఎన్నికల పరిశీలకులు రాజా రాం సంబంధిత అధికారులను ఆదేశించారు. మంథ ని నియోజకవర్గ పరిధిలో ఎన్నికల నిర్వహణలో పాల్గొ నే 664 మంది ప్రిసైడింగ్‌ అధికారులు, అసిస్టెంట్‌ ‌ప్రిసైడింగ్‌ అధికారులకు సోమవారం జేఎన్టియూహెచ్‌, ‌సెంటినరీ కాలనీలో శిక్షణ ప్రారంభించారు. రెండు రోజుల పాటు సిబ్బందికి సంపూర్ణ శిక్షణ అందించ నున్నట్లు ఆమె తెలిపారు. సోమవారం జేఎన్టియూహె చ్‌లో ప్రారంభించిన శిక్షణ తరగతులను జిల్లా కలెక్టర్‌ ‌సాధారణ ఎన్నికల పరిశీలకులతో కలిసి పరిశీలించా రు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ శ్రీ‌దేవసేన మాట్లాడు తూ ఎన్నికల నిర్వహణను పకడ్భందిగా నిర్వహించ డానికి శిక్షణ కార్యక్రమాలలో శ్రద్దగా పాల్గొనాలని సిబ్బందికి ఆమె సూచించారు.