వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలి

April 3, 2019

వీడియో కాన్పరెన్స్‌లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ‌నాగిరెడ్డి
పార్లమెంట్‌ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకొని సిద్దంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ‌నాగిరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎంపిటిసి, జడ్పీటీసి ఎన్నికల నిర్వహణపై మంగళవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్పరెన్స్ ‌నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలైన ఎంపిటిసి, జడ్పీటిసి, ఎంపిపిల పరిధిలో ఓటర్ల జాబితా సవరణను మార్చి 30 వరకు పూర్తి చేశామన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. పోలింగ్‌ ‌కేంద్రాలను గుర్తించి ఆ వివరాలను ఆన్‌లైన్లో అప్‌లోడ్‌ ‌చేయాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించాలని, ఎంపిటిసి, జడ్పీటిసి, ఎంపిపి నియోజకవర్గాల వారిగా అభ్యర్థుల జాబితా ముగిసిన అనంతరం బ్యాలేట్‌ ‌పేపర్ల ముద్రణ సకాలంలో జరిగేలా పకడ్భంది ప్రణాళిక రూపొందించుకోవాలని ఆయన సూచించారు. బ్యాలేట్‌ ‌పేపర్‌లో క్రమసంఖ్య కమిషన్‌ ‌నిబంధనల మేరకు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల ప్రక్రియ పకడ్భందిగా జరిగేలా ప్రణాళిను సిద్దం చేయాలన్నారు.