వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ఎన్నికల నిర్వహణకు పటిష్ట చర్యలు

April 9, 2019

పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌ ‌శ్రీదేవసేనపెద్దపల్లి పార్లమెంట్‌ ‌నియోజకవర్గం పరిధిలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగడానికి అన్ని రకాల పటిష్టమైన చర్యలు తీసుకున్నట్లు జిల్లా రిటర్నింగ్‌ అధికారి శ్రీదేవసేన కోరారు. సోమవారం పెద్దపల్లి సాధారణ ఎన్నికల పరిశీలకులు, వ్యయ పరిశీలకులతో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టరేట్‌ ‌సమావేశ మందిరంలో సప్లమెంటరీ ఈవిఎం యంత్రా ల ర్యాండమైజేషన్‌ ‌ను నిర్వహించారు. ఈ సందర్భం గా జిల్లా కలెక్టర్‌ ‌మాట్లాడుతూ రాజకీయ పార్టీల సమక్షంలో మొద•, రెండవ దశ ఈవిఎంల ర్యాండమై జేషన్‌ ‌ప్రక్రియ నిర్వహించామని, ప్రస్తుతం సప్లమెంటరీ ఈవిఎం యంత్రాలను నిబంధనల మేరకు ర్యాండమైజ్‌ ‌చేస్తున్నామన్నారు. పోలింగ్‌ ‌కేంద్రం పరిధిలో 1400మంది ఓటర్లు మించితే ఆక్సిలరి పోలింగ్‌ ‌కేంద్రాలు ఏర్పాటు చేసేవారని, కానీ దేశవ్యా ప్తంగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆక్సిలరి పోలింగ్‌ ‌కేంద్రాలను రద్దు చేయాలని ఆదేశించిందన్నారు.