వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ఎన్నికల నియమాలు పాటించాల్సిందే

April 5, 2019

ఇన్సిడెంట్‌ ‌ఫ్రీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి : సిపి
ప్రస్తుతం జరగబోవు పార్లమెంటు ఎన్నికలలో పూర్తిగా ఎన్నికల నియమాలు పాటించాల్సిందేననీ సిద్ధిపేట పోలీస్‌ ‌కమిషనర్‌ ‌డి.జోయల్‌ ‌డేవిస్‌ అన్నారు. ఎవరైనా ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకంటామనీ ఆయన ఈ మేరకు గురువారమిక్కడ విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో హెచ్చరించారు. ఈ ఎన్నికలలో ఆధునిక సాంకేతికను వినియోగించనున్నట్లు తెలిపారు. సోషల్‌ ‌మీడియాలో యువత జాగ్రత్తగా వ్యవహరించాలనీ, రాజకీయా నాయకులపైన, నేతలపైన ఇష్టం వచ్చినట్లు పోస్ట్ ‌చేయకూడదన్నారు. పోస్ట్ ‌చేసిన వారిపై ఎన్నికల మోడల్‌ ‌కోడ్‌ ఆఫ్‌ ‌కండక్ట్ ‌కింద చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల విధులు నిర్వహించేందుకు కేంద్ర బలగాలు సిఐఎస్‌ఎఫ్‌ ‌రెండు కంపెనీలు (184) అధికారులు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారనీ, గోవా రాష్ట్రం ఆర్మూడ్‌ ‌పోలీస్‌ అధికారులు సిబ్బంది మూడు కంపెనీలు (228) వచ్చినట్లు చెప్పారు. ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో వోట్లు వేయడానికి సమస్యాత్మకమైన పోలింగ్‌ ‌బూత్‌లలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.