వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ఎన్నికల ఏర్పాట్లు సంతృప్తికరం

April 5, 2019

సీఈవో రజత్‌కుమార్‌
లోక్‌ సభ ఎన్నికలకు చేస్తున్న ఏర్పాట్లు సంత ృప్తికరంగా ఉన్నాయని ఎన్నికల ప్రధాన అధికారి డాక్టర్‌ రజత్‌ కుమార్‌ అన్నారు.జిల్లా పర్యటనలో భాగంగా ఆయన శుక్రవారం స్థానిక వంశీ ఇంటర్నేషనల్‌ హోటల్‌లో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యంత కష్టమైన నిజామాబాద్‌ పార్లమెంటు ఎన్నికలు జిల్లా కలెక్టర్‌ మరియు పోలీస్‌ కమిషనర్‌ ఆధ్వర్యంలో అటు ఏర్పాట్లు ఇటు శాంతిభద్రతలు బాగా నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు. అతి తక్కువ సమయంలో ఎక్కువ సంఖ్యలో వచ్చిన ఈవీఎం పరిశీనకు, అవసరమైన ఏర్పాట్లను, ఫంక్షన్‌ హాల్‌ను ముందుగానే గుర్తించి నిర్వహించడం ద్వారా నిర్ణీత సమయానికి వీటిని పూర్తి చేయడానికి వీలు కలుగుతుందన్నారు. అదేవిధంగా నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, గుర్తులు కేటాయింపు తదితర కార్యక్రమాలు అధిక సమయంతో కూడుకున్నప్పటికీ రాత్రింబవళ్లు కష్టపడి పూర్తి చేశారన్నారు. ఇప్పటికి నిజామాబాదులో 4500, జగిత్యాలో 2500 ఈవీఎం పరిశీలన పూర్తి అయింది అన్నారు. అభ్యర్థులతో ముఖాముఖి సందర్భంగా వారు ప్రచారం చేసుకోవడానికి సమయం సరిపోనందున మరింత సమయం కావాలని కోరారని ఈ విషయం తన పరిధిలో లేనందున కేంద్ర ఎన్నికల కమిషన్‌ ద ృష్టికి తీసుకు వెళ్తానని ఆయన తెలిపారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఎన్నికలను ఈనెల 11న నిర్వహించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నామన్నారు.
ఈ మీడియా సమావేశంలో అడిషనల్‌ డీజి జితేందర్‌, అడిషనల్‌ సీఈవో జ్యోతి బుద్ధప్రకాష్‌, జాయింట్‌ సీఈవో రవి కిరణ్‌, ఎన్నిక ప్రత్యేక అధికారి రాహుల్‌ బొజ్జా, ఎన్నికల పరిశీలకలు గౌరవ్‌ దాలియా, జిల్లా కలెక్టర్‌ ఎం ఆర్‌ ఎం రావు, సిపి కార్తికేయ, డిఆర్‌ఓ అంజయ్య, డి సి ఓ సింహాచలం , అధికారులు తదితరులు పాల్గొన్నారు